- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జ్ఞానంబ మాటలకు కన్నీళ్లు పెట్టిన జానకి.. ఐపీఎస్ చదవనంటూ రామచంద్రకు మళ్ళీ షాక్!
Janaki Kalaganaledu: జ్ఞానంబ మాటలకు కన్నీళ్లు పెట్టిన జానకి.. ఐపీఎస్ చదవనంటూ రామచంద్రకు మళ్ళీ షాక్!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువు గల కుటుంబం నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 22 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే మల్లిక (Mallika) జానకి చేతికి ముగ్గు గిన్నె ఇస్తూ ఉండగా ఈలోపు అక్కడకు జ్ఞానాంబ వచ్చి బుద్దుందా నీకు జానకి చేత పనులు చేపిస్తావా అని అంటుంది. అంతేకాకుండా ఇంకోసారి జానకి (Janaki) తో పనులు చేపిస్తే నీకు మర్యాదగా ఉండదు అని మల్లికను అంటుంది.
ఇక జ్ఞానాంబ (Jnanamba) ముగ్గు వేస్తూ నువ్వు ఈ ఇంట్లో ఒక వస్తువు లా ఉంటావు అంతే.. నీకు ఈ ఇంటితో సంబంధం లేదు అని అంటుంది. దాంతో జానకి ఎంతో బాధపడుతుంది. ఇక ఈ లోపు రామ చంద్ర (Ramachandra) వచ్చి.. చూశావా మా అమ్మ నీ గురించి ఎంత మంచిగా ఆలోచించిందో అని వాళ్ళ అమ్మను మెచ్చుకుంటాడు.
కానీ అసలు విషయం తెలియక రామచంద్ర (Ramachandra) వాళ్ళ అమ్మ గురించి మంచిగా ఆలోచిస్తాడు. కానీ జానకి మనసులో బాధపడుతూ బయటకు రామచంద్ర ముందు నవ్వుతూ ఉంటుంది. తర్వాత జానకి (Janaki) ఎలాగైనా మా అత్తయ్య గారికి నా మీద ఉన్న ఆపార్ధాన్ని తీసేయాలి అని నిర్ణయం తీసుకుంటుంది.
మరోవైపు యోగి (Yogi) జ్ఞానాంబ అన్న మాటలు గురించి ఊహించుకుంటూ ఉంటాడు. ఇక ఊర్మిళ వచ్చి మనం ఒకసారి జానకి ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. ఎల్లుండి మన బాబు బారసాల దానికోసం కుటుంబ సమేతంగా అందరినీ పిలవాలి కదా అని ఊర్మిల (Urmila) యోగితో అంటుంది.
అలాగే మన రెండు కుటుంబాలు కలవడానికి మీ నాన్నగారి ప్రతిరూపమైన మన బాబే వారధి అవుతాడు అని ఊర్మిళ (Urmila) అంటుంది. మరోవైపు జానకి కు వారం రోజుల్లో అకాడమీ ఫీజు కట్టమని కాల్ చేస్తారు. దాంతో జానకి (Janaki) ఫీజు కట్టాల్సినవసరం లేదని రామచంద్ర తో అంటుంది.
అంతేకాకుండా నేను ఐపీఎస్ కు ప్రిపేర్ అవడం మానేస్తున్నాను అని జానకి (Janaki) అంటుంది. దాంతో రామచంద్ర (Ramachandra) ఒకసారి గా స్టన్ అవుతాడు. ఇక జానకి నేను చాలా చాలా అదృష్టవంతురాలిని అండి నేనెవరో తెలియకుండానే నా చదువుకు గిఫ్ట్ ఇచ్చారు అని అంటుంది.
అంతేకాకుండా ఇప్పుడు ఏకంగా చదివిస్తున్నారు అని జానకి (Janaki) అంటుంది. మన బంధం ఏ జన్మలో లోనో రాసిని అనుబంధం అని అంటుంది. దానికి రామచంద్ర (Ramachandra) ఎంతో ఆనందిస్తాడు. ఈ క్రమంలో రేపటి భాగంలో రామచంద్ర ఫీజు ఎలా కడతాడో చూడాలి.