MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: అఖిల్ చేసిన పనికి బాధపడుతున్న జానకి రామచంద్ర.. జెస్సి పై సీరియస్ అయిన అఖిల్?

Janaki Kalaganaledu: అఖిల్ చేసిన పనికి బాధపడుతున్న జానకి రామచంద్ర.. జెస్సి పై సీరియస్ అయిన అఖిల్?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 4వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Feb 04 2023, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో జ్ఞానాంబ, రామచంద్ర జానకి ఒకచోట కూర్చుని ఉండగా ఇంతలో మలయాళం అక్కడికి వచ్చి నేను ఇంట్లో పని వారిని అంటూ ఆ విషయం చెప్పడానికి తలబడుతూ ఉండగా మాకు అర్థమయింది. జానకి ఈరోజు నుంచి ఇతను మన ఇంట్లో పని చేస్తాడు వెళ్లి వంటగది చూపించు అనడంతో సరే అని జానకి అతన్ని వంటగదిలోకి పిలుచుకుని వెళ్తుంది. తర్వాత మల్లిక లోపలికి వచ్చి ఏంటి కొద్దిసేపట్లోనే ఇంత సంత పెట్టారు అని లోపలికి వెళ్లి డబ్బులు ఇస్తేనే బట్టలు ఇవ్వండి అప్పు ఎవరికీ ఇవ్వొద్దు అని చెబుతుంది. ఆ తర్వాత జానకి మలయాళం కి కిచెన్ లో ఉన్న వస్తువుల పేర్లు చెప్పి ఎలా చేయాలో చెబుతూ ఉండగా మలయాళం ఏమీ అర్థం కాక తల గోక్కుంటూ ఉంటాడు. సరే జానకమ్మ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటాడు.

27

 తర్వాత వాళ్ళ మామ ఫోటో చూస్తూ వాళ్ళ మామని తిట్టుకుంటూ ఉంటాడు మలయాళం. తర్వాత విష్ణు షాప్ కి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు గోవిందరాజులు మలయాళం సొంటి కాఫీ తీసుకొని రారా ఈరోజు నీ కాఫీతో ఇంట్లో అందరికీ టేస్ట్ లు మారిపోవాలి అంటూ మళయాలం వంటతనం గురించి అందరికీ వివరిస్తూ ఉంటాడు గోవిందరాజులు. మలయాళ మాత్రం వంటగదిలో కాఫీ చేయడానికి తిప్పలు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత మలయాళం సొంటి కాఫీ తీసుకొని రావడంతో అది కొంచెం తేడాగా ఉన్నా కూడా గోవిందరాజులు పైకి ఏమీ తెలియనట్టుగా ఆహాహా అంటూ పొగుడుతూ ఉంటాడు.
 

37

అప్పుడు మల్లికని ఉద్దేశిస్తూ కొంతమందికే కాఫీ తాగడం తప్ప చేయడం రాదు చూసి నేర్చుకోండి అని అంటాడు. అప్పుడు కాఫీ తాగగా ఒక్కసారిగా గోవిందరాజులు పేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడంతో అందరూ ఏమైందో అనుకుంటూ ఉండగా ఏమీ తెలియనట్టుగా బాగుంది అద్భుతం అని అంటాడు గోవిందరాజులు. అబ్బా నా కాఫీ సూపర్ అని అనుకుంటూ ఉండగా నీకు ఉందిరా కొద్దిసేపు ఉండరా అని అనుకుంటూ ఉంటాడు గోవిందరాజులు. అప్పుడు మల్లికా కాఫీ తాగుతావా అనగా నేను మళ్ళీ పెట్టించుకుని తాగుతాను మామయ్య మీరు తాగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు గోవిందరాజులు మలయాళం ని తిడుతూ ఒరేయ్ శొంఠి కాఫీ తీసుకొని రారా అంటే మిరియాలు కాఫీ తీసుకొని వస్తావా అని తిడతాడు.
 

47

నీకు వంట వస్తుందా అనగా ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి చేసి చూపిస్తాను అని అంటాడు. సరే గుత్తొంకాయ కూర పప్పు చేసి తీసుకొని రాపో అని అంటాడు గోవిందరాజులు. అప్పుడు గోవిందరాజులు సెటైర్లు వేయడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అఖిల్ ఉద్యోగానికి వెళ్లడానికి రెడీ అవుతుండగా జెస్సి జాగ్రత్తలు చెబుతూ ఉండడంతో ఏం చేయాలో ఎక్కడ ఉండాలో నాకు చెప్పాల్సిన పని లేదు అని అంటాడు అఖిల్. ఆ తర్వాత అఖిల్ బయటికి వెళ్లి దేవుడికి మొక్కుకొని జ్ఞానాంబ ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళొస్తానమ్మా అని అంటాడు. ఆల్ ది బెస్ట్ అఖిల్ అని జానకి సంతోషంగా చెప్పగా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల్. అప్పుడు జానకి బాధపడుతూ ఉంటుంది. అది చూసి మల్లిక సంతోషపడుతూ ఉంటుంది.
 

57

తర్వాత జానకి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జానకి వాళ్లకు కూడా చెప్పి ఉంటే ఏం జరిగేది జ్ఞానం అనడంతో మొదటిసారి వెళుతున్నారు కదండీ వాడి టెన్షన్స్ వాడుకుంటాయి అనడంతో చెప్పి వెళ్తే ఏం కాదులే జ్ఞానం అని అంటాడు గోవిందరాజులు. తర్వాత రామచంద్ర జరిగిన విషయాలు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇంతలోనే జానకి రావడంతో కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఎందుకు రామ గారు నా దగ్గర కూడా మీ బాధను దాచుకుంటారు అంటుంది జానకి. అఖిల్ అలా చేసినందుకు మీకు బాధగా లేదా అనడంతో మంచి ఉద్యోగం వచ్చింది అంతకంటే ఏం కావాలి నాకేం బాధ లేదు అని కవర్ చేసుకుంటూ ఉంటాడు రామచంద్ర. ఉద్యోగానికి వెళుతున్నాడు కానీ వెళ్ళొస్తానని ఒక్క మాట చెప్పాడా అంటుంది జానకి.
 

67

అప్పుడు జానకి రామచంద్రకి ధైర్యం చెబుతూ బాధపడకండి అని అంటుంది. మీరు అఖిల్ కోసం ఎన్నో త్యాగాలు చేశారు కానీ అవన్నీ మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనడంతో నాకు చెప్పకుండా నా తమ్ముడు కాకుండా పోతాడా అంటూ రామచంద్ర లోపల బాధ పెట్టుకుని బయటకు మాత్రం ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటాడు. వెళ్దాం పద జానకి గారు అని అంటాడు రామచంద్ర. ఆ తర్వాత మలయాళం వంట చేయడానికి రాకపోవడంతో మలయాళం లో పాటలు పాడుకుంటూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మలయాళం మాటలకు మల్లిక ఆశ్చర్య పోతుంది. అప్పుడు నాన్ వెజ్ నేను తింటాను అనగా నేను చెప్పేది నీ గురించి కాదు నా గురించి అని అనడంతో మీరు నాన్వెజ్ తింటారా అనగా ఎగిరేవి ఈదేవి ఏవైనా వండి పెడితే తింటాను అంటుంది మల్లిక.
 

77

అప్పుడు మల్లిక వీటికి వంటల్లో చేయడం వస్తే ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మలయాళం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత జానకి ఇంటికి వెళుతూ ఉండగా ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి జానకి నీ పేరు నోటీసు బోర్డులో వేశారు ఫీజు కట్టలేదని అనడంతో జానకి లోపలికి వెళ్తుంది. అప్పుడు దానికి పేరు చూసి బాధపడుతూ ఉంటుంది. రామచంద్ర గారి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏమైంది జానకి అని వాళ్ళ ఫ్రెండ్ అడగడంతో కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటుంది జానకి. అప్పుడు జానకికి వాళ్ళ ఫ్రెండ్ 5వేలు ఇస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved