- Home
- Entertainment
- ఎన్టీఆర్, ఏఎన్నార్ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్న జమున, స్టార్ హీరోలు ఏం చేశారంటే?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్న జమున, స్టార్ హీరోలు ఏం చేశారంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికంతే ప్రత్యేకం అని నిరూపించుకున్న హీరోయిన్లలో జమున ఒకరు. ఇండస్ట్రీలో హిట్ సినిమాలతో పాటు, వివాదాలు కూడా ఖాతాలో వేసుకున్న ఈ నటి.. స్టార్ హీరోలతో గోడవల కారణంగా చాలా సినిమాలు పోగొట్టుకున్నారు.

వెండితెర సత్యభామ, మకుటం లేని మహారాణి
తెలుగు సినీ రంగాన్ని మకుటం లేని మహారాణిలా ఏలిన నటి జమున. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జమున, ఎన్నో వివాదాలను కూడా ఫేస్ చేశారు. అగ్రనటులకు ఎదురెళ్లి నిలబడ్డ చరిత్ర జమునది. తన టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలో తిరుగులేని కెరీర్ ను సాధించిన జమున, కాస్త నెగెటివిటీని కూడా మూటగట్టుకున్నారు. స్టార్ హీరోలతో వివాదాలు, షూటింగ్ టైమ్స్ లో జరిగిన కొన్ని సంఘటనలు అప్పటి నటులకు ఆమెను దూరం చేశాయి. నటన విషయంల ఏమాత్రం తగ్గని జమున.. ఆత్మాభిమానం, మాట నెగ్గించుకోవడంలో కూడా అంతే పట్టుదల చూపించేవారు. దాని వల్ల ఆమె ఎన్నో అవకాశాలు పోగోట్టుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని పాత్రలు ఆమె కోసమే సృష్టించబడ్డాయేమో అన్నట్టుగా జమను చేసిన అభినయం ఇప్పటి ప్రేక్షకులను కూడా మత్రముగ్ధులను చేస్తుంటుంది. జమునకు చిరుకోపం ఉందని సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే. ప్రముఖ రచయిత ఆత్రేయ "ముక్కు మీద కోపం నీ మొహానికే అందం" అంటూ ‘మూగ మనసులు’ సినిమాకి పాట రాయడం, ఆమె వ్యక్తిత్వాన్ని చూపించడానికే చేసినట్టు కనిపిస్తుంటుంది. అప్పట్లోనే స్వతంత్ర భావాలు, ఆత్మాభిమానం ఎక్కువగా కలిగిన జమున స్టార్ హీరోలతో వివాదాలు తెచ్చుకుని చాలా ఇబ్బందులు పడ్డారు. ఆతరువాత కాలంలో అవి సమసిపోయినా.. జమునా అంటే కోపం ఎక్కువ అన్న పేరు మాత్రం అలా నిలిచిపోయింది.
ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుతో కోల్డ్ వార్
తెలుగు సినీ రంగంలో అగ్రహీరోలుగా వెలుగొందిన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులతో జమున మధ్య దాదాపు మూడేళ్లపాటు కోల్డ్ వార్ నడిచింది. షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం, గౌరవం చూపకపోవడం వంటి ఆరోపణలు ఆమెపై వచ్చాయి. కొన్ని సందర్భాల్లో సమాధానం కూడా సరిగ్గా చెప్పేవారు కాద జమున. షూటింగ్ ఏదైనా ఉంటే.. టేక్ గ్యాప్ లో అందరూ ఒక చోట కూర్చుంటే, జమున మాత్రం విడిగా కూర్చుకని బుక్స్ చదువుకుంటూ కూర్చునేవారట. అంతే కాదు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ టైమ్ కంటే ముందే షూటింగ్ కు వచ్చేవారు. వారు వచ్చి షాట్ కోసం వెయిట్ చేస్తుంటే.. చాలా లేట్ గా వచ్చి కనీసం సారీ కూడా చెప్పేవారు కాదట జమున. ఒక సారి ఓ షూటింగ్ టైమ్ లో గ్యాప్ వస్తే ఎన్టీఆర్, ఎఎన్నార్, సూర్య కాంతం అందరు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూన్నారు. జమున మాత్రం దూరంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని బుక్ చదువుకుంటున్నారు. అప్పుడు ఏఎన్నార్ రామ్మ జమున ఇలా రా అందరం ఇక్కడ కూర్చున్నాం కదా సరదాగా మాట్లాడుకుందాం అని పిలిచారట. కాని జమున మాత్రం నాకు అలా ఇష్టం ఉండదు అని చెప్పి బుక్ చదువుకున్నారట.
జమునను బ్యాన్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్
పెద్ద హీరోలు ఎదురుగానే కాలు మీద కాలు వేసుకోవడంతో పాటు.. ఎఎన్నార్ లాంటి వారు మర్యాదగా పిలిచినా రాకపోవడంతో అటు ఎన్టీఆర్ కు ఇటు అక్కినేనికి కోపం వచ్చింద. అప్పుడు కొన్ని నిర్ణయాలు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి తీసుకునేవారట. కొన్ని విషయాల్లో ఇద్దరు ఒకే మాటమీద ఉండేవారట. ఇద్దరు అనుకుని జమునతో నటించకూడదు అని నిర్ణయించుకున్నారట. ఒక రకంగా జమునను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసినంత పనిచేశారట. ఇద్దరు స్టార్ హీరోలు ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్, పాత తరం నటుడు ఏచూరి చలపతి రావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తగ్గేది లేదన్న జమున
అప్పటి రోజుల్లో కొన్ని పాత్రలలో జమునకు ప్రత్యామ్నాయంగా ఆ స్థాయిలో నటించే నటి లేకపోవడంతో, తిరిగి ఆమెను సినిమాల్లో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇటు జమునతో నటించకూడదు అని నిర్ణయించుకుని ఇండస్ట్రీలో దాదాపు బ్యాన్ చేసినంత పని చేశారు ఎన్టీఆర్, ఏఎన్నార్. కాని జమున మాత్రం ఈ విసయంలో ఏమాత్రం బెదరలేదు. స్టార్స్ తో కాకపోతే చిన్నవాళ్ళతో చేసుకుంటాను అని అనుకున్నారట. అనుకున్నట్టుగానే హరనాథ్, జగ్గయ్య లాంటి హీరోలతో జమున సినిమాలు చేస్తూ, లేడీ ఓరియెంటెడ్ కథల ద్వారా తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. బాలీవుడ్ నుండి సైతం ఆమెకు ఆఫర్లు రావడం ప్రారంభమైంది.
గుండమ్మ కథ వల్ల కలిసిపోయిన తారలు
ఈ వివాదం నడుస్తున్న టైమ్ లోనే విజయా సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి 'గుండమ్మ కథ' సినిమా తీయాలని భావించారు. జమునను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె కోసం మూడేళ్లు వేచిచూశారు. ఆమెతో ఎన్టీఆర్, అక్కినేనిల మధ్య విభేదాల సంగతి తెలుసుకుని రంగంలోకి దిగారు. ముగ్గురితో వేరువేరుగా మాట్లాడి రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, అక్కినేని ముందు ఈ డీల్ కు ఒప్పుకోలేదు. ఆతరువాత జమునతో క్షమాపణ పత్రం రాయమని అడగగా, జమున అస్సలు కుదరదు అని చెప్పేశారు. ఆతరువాత కొన్ని చర్చల తరువాత జమున వ్యక్తిగతంగా వెళ్లి వారిద్దరినీ కలుసుకుని క్షమాపణలు చెప్పడంతో వివాదం సర్ధుమనిగింది. 'గుండమ్మ కథ' షూటింగ్ మొదలైంది. ఈ సినిమా ఆమెకు చిరస్థాయిలో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో జమున సూపర్ హిట్ సినిమాలు
వివాదం ముగిసిన తరువాత ఇండస్ట్రీలో పెద్దలు చెప్పడం, ఫ్యామిలీ నుంచి కూడా కొంత మంది మాటల ద్వారా తన పద్దతులు కొన్ని మార్చుకున్నారట జమున. దాంతో ఆ తర్వాతి కాలంలో అనేక హిట్ సినిమాల్లో జమున ఎన్టీఆర్, అక్కినేనిలతో కలిసి నటించారు. వీరి కాంబోలో దాదాపు సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా సత్యభామనగా జమున, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్, ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేరు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు తెరపై వెలుగొందిన జమున కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూసే స్థాయికి చేరుకున్నారు. ఆమె నమ్మకంతో ఎంతో మంది సినిమాలు నిర్మించి ఆర్థికంగా స్థిరపడినవారు కూడా ఉన్నారు.