‘జైలర్’ పారితోషికాలు.. ఒక్క రజినీకాంత్ కే రూ.200 కోట్లు, మిగతా వారి రెమ్యునరేషన్స్ ఎంతంటే?
‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో నిర్మాత కాస్ట్ అండ్ క్రూ కు కాస్ల్టీ గిఫ్ట్స్ అందిస్తున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో రజినీకాంత్ తో పాటు మిగితా వారు అందుకున్న పారితోషికాలు వైరల్ గా మారాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) లేటెస్ట్ ఫిల్మ్ ‘జైలర్’. యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు.
గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు కరూ.700 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇండియాలోనే ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసింగ్ థర్డ్ ఫిల్మ్ గా ఈ చిత్రం ముద్రవేసుకుంది. దీంతో నిర్మాత కళానిధి మారన్ కార్లు, కాస్ల్టీ గిఫ్ట్ అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జైలర్ కాస్ట్ అండ్ క్రూ అందుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది. రజినీ కాంత్ విషయానికొస్తే.. తొలుత రూ.110 కోట్ల పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత సినిమా భారీ కలెక్షన్లు రాబట్టడంతో మరో రూ.100 కోట్లు అందించారు. దీంతో రూ.200 కోట్లకు పైగా పారితోషికం అందుకున్న నటుడిగా రజినీకాంత్ రికార్డు క్రియేట్ చేశారు.
‘బీస్ట్’ మూవీతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్’తో మాత్రం ఎవరూ ఊహించిన సక్సెస్ అందుకున్నారు. ఆయన డైరెక్షన్ సరికొత్తగా కనిపించింది. కథ నార్మల్ గానే ఉన్నా.. తెరపై చూపించిన తీరు నెక్ట్స్ లెవల్లో ఉంది. ఇక ఈ చిత్రానికి నెల్సన్ రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అలాగే కాస్ల్టీ కారును కూడా బహుమతిగా అందుకున్నారు.
అలాగే చిత్రానికి సంగీతం అందించిన సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా భారీగానే ఛార్జ్ చేశారని తెలుస్తోంది. రూ.30 కోట్లు అందుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా అనిరుధ్ ‘జైలర్’కు ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ నెక్ట్స్ లెవల్లో ఉంది. తను అందించిన ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఇక మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కూడా ఈ చిత్రానికి భారీగానే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. స్పెషల్ అపీయరెన్స్ తో దుమ్ములేపిన తమన్నా రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుందని అంటున్నారు. దీంతో వీరందరూ హ్యయేస్ట్ పేయిడ్ అందుకున్న నటీనటులు, టెక్నీషియన్లుగా ముద్ర వేసుకున్నారు.