MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Jailer 2: షూటింగ్ పూర్తవ్వకుండానే 160 కోట్ల డీల్, రజినీకాంత్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందా?

Jailer 2: షూటింగ్ పూర్తవ్వకుండానే 160 కోట్ల డీల్, రజినీకాంత్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందా?

రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా షూటింగ్ పూర్తికాకముందే భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయంలో కోట్ల డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఈమూవీ ఓటీటీ హక్కులు ఎవరు తీసుకున్నారు. జైలర్ 2 రిలీజ్ డేట్ వాయిదా పడిందా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జైలర్ 2 పై భారీ అప్ డేట్..
Image Credit : instagram

జైలర్ 2 పై భారీ అప్ డేట్..

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా జైలర్ 2. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని రజినీకాంత్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జైలర్2 గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్ డేట్ బయటకు వస్తూనే ఉంది. ఇక తాజాగా ఈసినిమాకు సబంధించిన ఓ హాట్ న్యూస్ బయటికొచ్చింది. 

సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాక ముందే, జైలర్ 2 ఓటీటీ రైట్స్ ఏకంగా 160 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ భారీ డీల్‌ను దక్కించుకుంది. తమిళ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటీటీ డీల్ అని చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Image Credit : TS Thalaivarin Sonthangal Facebook

రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం 'జైలర్ 2' సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కేరళలోని పాలక్కాడ్‌లోని అట్టప్పాడి, కోజికోడ్‌లో జరిగింది. ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు మలయాళ ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని మొదట వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, 'జైలర్ 2' సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Suriya Net Worth: చెన్నై, ముంబైలో ఇళ్ళు.. సూర్య ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
Related image2
Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..
35
600 కోట్లు వసూలు చేసిన సినిమా..
Image Credit : instagram

600 కోట్లు వసూలు చేసిన సినిమా..

బ్లాక్‌బస్టర్ హిట్ 'జైలర్' సినిమాకు సీక్వెల్‌గా 'జైలర్ 2' తెరకెక్కుతోంది. ఈసినిమాను కూడా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగంలో రజినీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో కనిపించారు. 2023లో రిలీజైన 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా హిట్ అయినప్పటి నుంచే అభిమానులు రెండో భాగం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు.

45
డాన్ పాత్ర ఉంటుందా?
Image Credit : X

డాన్ పాత్ర ఉంటుందా?

ఈ ఏడాది జనవరి 14న ఒక ప్రోమో వీడియోతో సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు మూవీ టీమ్. ఆ తర్వాత మార్చిలో షూటింగ్ మొదలైంది. తమిళ సినీ ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్ రాబట్టే సినిమాల్లో 'జైలర్ 2' ఒకటి అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. మొదటి భాగానికి మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా మ్యూజిక్ చేస్తన్నాడు. పార్ట్ 1 లాగే రెండో భాగం కూడా ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ఉండబోతోంది. అయితే, రెండో భాగంలో మోహన్‌లాల్ చేసిన 'మాథ్యూ' అనే డాన్ పాత్ర ఉంటుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

55
రజినీకాంత్ సినిమాలు
Image Credit : instagram

రజినీకాంత్ సినిమాలు

రజినీకాంత్ చివరిగా కనిపించిన సినిమా 'కూలీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రజినీకాంత్‌తో పాటు నాగార్జున కీలక పాత్రలో, అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు. జైలర్ 2 తో పాటు మరికొన్ని కథలను రజినీకాంత్ వింటున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Suriya Net Worth: చెన్నై, ముంబైలో ఇళ్ళు.. సూర్య ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image2
Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved