- Home
- Entertainment
- జైలర్ 2 కోసం అనిరుధ్ కు ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా..? ఏఆర్ రెహమాన్ ను మించిపోయాడుగా
జైలర్ 2 కోసం అనిరుధ్ కు ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా..? ఏఆర్ రెహమాన్ ను మించిపోయాడుగా
రజినీకాంత్ జైలర్ 2 పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో పాటు మ్యూజిక్ విషయంలో కూడా అంతే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈసినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నాడో తెలుసా..?

సూపర్ స్టార్ రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం జైలర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో 'జైలర్ 2 సినిమా పై భారీగా అంచనలు పెరిగిపోయాయి. ఇక ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఆ మూవీ గురించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి.
Also Read: రాజమౌళి కోరిక తీరుకుండానే ఆ ఇద్దరు స్టార్లు మరణించారు, జక్కన్న సినిమా చేయాలనకున్నది ఎవరితో..?
అనిరుద్ రవిచందర్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు నటించిన జైలర్ 2023లో విడుదలైంది. ఈ చిత్రంలో రజినీకాంత్ రిటైర్డ్ జైలర్‌గా నటించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కిషోర్, జాకీ ష్రాఫ్ అతిధి పాత్రల్లో నటించారు. .220 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.650 కోట్ల వసూళ్లు సాధించింది.
రజినీకాంత్ & అనిరుద్
ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. ఈమూవీకి అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్యోర్ తో పాటు.. పాటలు అందరిని ఆకర్శించాయి. అంతే కాదు రజినీకాంత్ వచ్చినప్పుడు వచ్చే ఎలివేసన్ మ్యూజిక్ కు అందరు ఫిదా అయ్యారు.
ఇక తమన్నా పాట అయితే.. యూట్యూబ్‌లో ఎక్కువగా వీక్షించబడిన పాటల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకి రెండో భాగం రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతికి అధికారిక ప్రకటన వచ్చింది. జైలర్ 2 ప్రోమో కూడా వీడియో విడుదలైంది.
జైలర్ 2 సినిమా
మొదటి భాగంలో నటించిన నటులు, నటీనటులు రెండో భాగంలో కూడా నటిస్తారని చెబుతున్నప్పటికీ, కథ ప్రకారం మార్పులు జరగవచ్చు. శివరాజ్ కుమార్ స్థానంలో బాలకృష్ణ నటించే అవకాశం ఉందని సమాచారం.
అనిరుద్
జైలర్ 2 సినిమాకి కూడా అనిరుద్ మార్క్ మ్యూజిక్ మ్యాజిక్ చేయబోతున్నారు. అంతే కాదు ఈసినిమాకు ఆయన .18 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. జైలర్ సినిమాకి రూ.10 కోట్లు తీసుకున్నారని ఇదివరకు వార్తలు వచ్చాయి. సినిమా మ్యూజిక్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోయాయట. అందుకే అనిరుద్ కి రూ.18 కోట్లు ఇచ్చారట.
అనిరుద్
తమిళ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకుల్లో అనిరుద్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఏఆర్ రెహమాన్ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు రూ.12 కోట్ల వరకే పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏ.ఆర్.రెహమాన్‌ను అధిగమించారు అనిరుద్.