- Home
- Entertainment
- రాజమౌళి కోరిక తీరుకుండానే ఆ ఇద్దరు స్టార్లు మరణించారు, జక్కన్న సినిమా చేయాలనకున్నది ఎవరితో..?
రాజమౌళి కోరిక తీరుకుండానే ఆ ఇద్దరు స్టార్లు మరణించారు, జక్కన్న సినిమా చేయాలనకున్నది ఎవరితో..?
అందరు రాజమౌళితో సినిమా చేయాలి అనుకుంటారు. కాని రాజమౌళి తన జీవితంలో ఆ ఇద్దరితో సినిమా చేసి ఉంటే బాగుండి అనుకుంటాడట. ఇంతకీ ఎవరా హీరో, హీరోయిన్ తెలుసా..?

ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. దేశ వ్యాప్తంగా రాజమౌళి ఇమేజ్ ఓ రేంజ్ లో ఉంది. బాలీవుడ్ మేకర్స్ కూడా రాజమౌళి అంటే భయపడాల్సిందే. ఒకప్పుడు తెలుగు సినిమాను ఎంత చులకనగా చూశారో.. ఇప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్ తో పాటు.. ఇతర ఇండస్ట్రీలు కూడా భయపడే స్థాయికి తీసుకువచ్చాడు రాజమౌళి.
ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాపై కన్నేశాడు జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ బాబుతో అమెజాన్ అడ్వెంచర్ స్టోరీని సినిమాగా చేయబోతున్నాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఇక ఈ క్రమంలో రాజమౌళి గురించి మరోసారి మీడియా మారుమోగిస్తోంది. ఇక రాజమౌళితో సినిమా అంటే అటు బాలీవుడ్ తో పాటు..ఇంతర ఇండస్ట్రీల నుంచి కూడా స్టార్స్ పోటీ పడీ నటిస్తుంటారు.
ఆయన సినిమాలో ఒక్క సారి అయినా నటించాలని కోరకుంటుంటారు. ప్రయత్నాలు కూడా చేసేవారు ఉన్నారు. కాని రాజమౌళి కూడా ఓ హీరో హీరోయిన్ తో సినిమా చేసి ఉంటేబాగుండే అని ఎప్పుడూ మదన పడుతుంటాడట ఈ విషయం మీకు తెలుసా..? ఇంతకీ వారు ఎవరో తెలుసా..? వారెవరో కాదు మహానటి సావిత్రి, నవరస నట సార్వభౌమన నందమూరి తారకరామారావు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా డైరెక్ట్ చేయలేకపోతినే అని ఆయన ఎప్పుడు బాధపడుతుండేవాడట.
rajamouli
ఇక అది కుదరలేదు.. ఎప్పటికీ కుదరదు కూడా. ఇలా జక్కన్న జీవితంలో ఈ లోటు ఉండిపోయింది. కాని తెలుగు పరిశ్రమ గర్వించే దర్శకుడిగా ఆయన స్థాయి ఏంటో అందరికి తెలిసిందే. ఇక మహేష్ బాబుతో చేసే సినిమా కూడా హిట్ కొట్టాడంటే.. రాజమళి పేరు హాలీవుడ్ లో కూడా మారుమోగుతుంది అనడంలో ఏమాత్రం అనుమానం ఉండదు. జక్కన్న వల్ల ముందు ముందు మరిన్ని ఆస్కారుల పండ పండే అవకాశం కూడా కనిపిస్తోంది.