MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jailer 2 Movie 7 Days Collections: సరికొత్త రికార్డుల దిశగా జైలర్‌ 2.. రజనీకాంత్‌ మూవీ 7వ రోజు దుమారం

Jailer 2 Movie 7 Days Collections: సరికొత్త రికార్డుల దిశగా జైలర్‌ 2.. రజనీకాంత్‌ మూవీ 7వ రోజు దుమారం

రజనీకాంత్‌ తన 75ఏళ్ల వయసులోనూ బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ ఆడుతున్నాడు. ఆయన నటించిన `జైలర్‌ 2` మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఏడో రోజు కూడా అదిరిపోయే వసూళ్లని రాబట్టడం విశేషం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 22 2026, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతున్న రజనీకాంత్‌
Image Credit : X/@sunpictures

బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుతున్న రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి బాక్సాఫీసు వద్ద తన స్టామినా ఏంటో చూపించారు. 75ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుండటం విశేషం. ఇది ఇండియన్‌ సినిమాలోనే అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. ఈ రేంజ్‌ సత్తా ఇంతకుముందు ఏ ఇండియన్‌ హీరో సాధించలేదు. భవిష్యత్‌లోనూ ఛాన్స్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన `జైలర్‌ 2`తో థియేటర్లలో రచ్చ చేస్తోన్న విషయం తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతోంది. ఏడో రోజు కూడా అదిరిపోయే వసూళ్లని రాబట్టడం విశేషం. మరి బుధవారం ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా సినిమాకి ఎన్ని కోట్లు వచ్చాయనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జైలర్‌ 2 ఏడో రోజు వసూళ్లు, టోటల్‌ కలెక్షన్లు
Image Credit : Asianet News

జైలర్‌ 2 ఏడో రోజు వసూళ్లు, టోటల్‌ కలెక్షన్లు

బుధవారం ఏడో రోజు `జైలర్‌ 2`కి షాకిచ్చే కలెక్షన్లు వచ్చాయి. ముందు రోజుతో పోల్చితే వసూళ్లు డ్రాప్‌ అయ్యాయి. దాదాపు 40శాతం డ్రాప్‌ ఉంది. అయితే సెలవులు ముగియడంతో కలెక్షన్లు కూడా తగ్గాయి. అయినా ఊహించని విధంగా దీనికి కలెక్షన్లు వస్తున్నాయి. ఏడో రోజు రూ.28.15కోట్ల ఇండియా నెట్‌ని, రూ.33కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఏడు కోట్లు వచ్చాయి. మొత్తంగా బుధవారం ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.40కోట్లు రావడం విశేషం. ఇక సినిమా ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.582.45కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన గురువారంతో సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కాబోతుందని సమాచారం. ఇది సినిమా బడ్జెట్‌తోనే బ్రేక్‌ అవుతుండటం విశేషం.

34
తమిళ సినిమా ఇండస్ట్రీ హిట్‌ గా జైలర్ 2
Image Credit : Asianet News

తమిళ సినిమా ఇండస్ట్రీ హిట్‌ గా జైలర్ 2

`జైలర్‌ 2` సినిమాకి రూ.300కోట్లకుపైగా బడ్జెట్‌ అయ్యింది. అదే రేంజ్‌లో బిజినెస్‌ అయ్యింది. ఇప్పుడు ఏకంగా సినిమా బడ్జెట్‌కే బ్రేక్‌ ఈవెన్‌ కాబోతుండటం విశేషం. ఇక బిజినెస్‌ అంతా నిర్మాతకు లాభాలే అని చెప్పొచ్చు. కేవలం బిజినెస్‌తోనే కాదు.. కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఏ స్థాయికి వెళ్లి ఆగుతుందో తెలియదు. వెయ్యి కోట్లని టచ్‌ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంత వరకు వెళ్లకపోయినా రూ.800కోట్లని అయితే ఈజీగా టచ్‌ చేస్తుంది. అయినా థియేట్రికల్‌గానే వంద నుంచి రెండు వందల కోట్ల లాభాలు వస్తాయని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే తమిళంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించే చిత్రంగా ఇది నిలవబోతుందని చెప్పొచ్చు. ఆల్‌ టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌గానూ నిలుస్తుందని చెప్పొచ్చు.

44
జైలర్‌ 2 స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు.. తెలుగులో ఎంతంటే?
Image Credit : Asianet News

జైలర్‌ 2 స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు.. తెలుగులో ఎంతంటే?

ఇక ఈ సినిమా స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు చూస్తే, తమిళంలో ఏడో రోజు ఈ మూవీ రూ.10.75కోట్లు, తెలుగులో ఆరు కోట్లు, కర్నాటకలో రూ.7.25కోట్లు, దాదాపు మూడు కోట్ల వరకు నార్త్ లో రాబట్టింది. ఇక ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సుమారు రూ.70కోట్లు చేసింది. ఇక్కడ ఇంకా ఇరవై కోట్ల వరకు రాబట్టాలి. తమిళనాడులో రూ.143.25కోట్లు, కర్నాటకలో రూ.62.40కోట్లు, కేరళాలో రూ.60.35కోట్లు, నార్త్ లో రూ.36.20కోట్లు వసూలు చేసింది. ఇండియాలో దీనికి రూ.371.45కోట్లు రాగా, ఓవర్సీస్‌లో రూ.211కోట్లు రావడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas Favorite Actor: ప్రభాస్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? చిరు, కృష్ణంరాజు, ఎన్టీఆర్‌ మాత్రం కాదు
Recommended image2
Bigg Boss 10 :హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వగానే నోటికి పని చెప్పిన షాలిని..గేమ్ లో సత్తా చూపించిన రామ్ ప్రసాద్
Recommended image3
Ranbir Kapoor: రామాయణ ఈవెంట్ లో నోరు జారిన రణబీర్ కపూర్.. ఆడుకుంటున్న నెటిజన్లు!
Related Stories
Recommended image1
Rithvik Jothi Raj: రజనీకాంత్ ఆన్ స్క్రీన్ మనవడు, 13 ఏళ్లకే ఏం చేస్తున్నాడో తెలుసా..వీడు మామూలోడు కాదే
Recommended image2
Prabhas Favorite Actor: ప్రభాస్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? చిరు, కృష్ణంరాజు, ఎన్టీఆర్‌ మాత్రం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved