MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jailer 2 Movie 17 Days Collections: జైలర్‌ 2 అరుదైన రికార్డు.. 17వ రోజు రజనీ మూవీ అదిరిపోయే వసూళ్లు

Jailer 2 Movie 17 Days Collections: జైలర్‌ 2 అరుదైన రికార్డు.. 17వ రోజు రజనీ మూవీ అదిరిపోయే వసూళ్లు

రజనీకాంత్‌ హీరోగా రూపొందిన `జైలర్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద తన జోరు చూపిస్తోంది. మూడు వారాలు అవుతున్నా, ఈ చిత్రం బాక్సాఫీసుని షేక్‌ చేస్తుండటం విశేషం. 17 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 01 2026, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జైలర్‌ 2 మూవీ 17వ రోజు కలెక్షన్లు
Image Credit : Asianet News

జైలర్‌ 2 మూవీ 17వ రోజు కలెక్షన్లు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన `జైలర్‌ 2` మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు అవుతున్నా కూడా, బాక్సాఫీసు వద్ద జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అదిరిపోయే వసూళ్లతో రన్‌ అవుతుంది. రోజుకి ఇంకా పది కోట్లకుపైగానే కలెక్షన్లు వస్తుండటం విశేషం. ఇక తాజాగా ఈ సినిమా 17 రోజులు పూర్తి చేసుకుంది. 17వ రోజు శనివారం దీనికి దాదాపు రూ.13.90కోట్లు రావడం విశేషం. బాక్సాఫీసు వద్ద ఇంకా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతుందనడానికిది నిదర్శనం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జైలర్‌ 2 టోటల్‌ కలెక్షన్లు
Image Credit : Asianet News

జైలర్‌ 2 టోటల్‌ కలెక్షన్లు

ఇక `జైలర్‌ 2` మూవీ ఇప్పటి వరకు రూ.790.85కోట్లు వసూలు చేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో సంచలన చిత్రంగా నిలిచింది. కోలీవుడ్‌ లో అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా `2.0` ఉండగా, ఆ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసింది. సరికొత్త సంచలనం సృష్టించింది. అంతేకాదు కోలీవుడ్‌కి సాధ్యం కాని రికార్డుల వేట దిశగా వెళ్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో రూ.520.35కోట్ల గ్రాస్‌ని, రూ.444.75కోట్ల నెట్‌ని సాధించింది.

34
జైలర్‌ 2 స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు, తెలుగులో ఎంతంటే?
Image Credit : Asianet News

జైలర్‌ 2 స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు, తెలుగులో ఎంతంటే?

భాషల వారిగా చూస్తే, ఈ మూవీ తమిళంలో రూ.203.95కోట్లు, తెలుగులో రూ.93.85కోట్లు, కర్నాటకలో రూ.90కోట్లు, కేరళాలో రూ.76.20కోట్లు, హిందీలో రూ.56.35కోట్లు వసూలు చేసింది. హిందీలో, కేరళాలో ఈ చిత్రానికి ఊహించని విధంగా కలెక్షన్లు రావడం విశేషం. ఇక ఓవర్సీస్‌లో దుమ్ములేపింది. అక్కడ ఈ మూవీకి రూ.270.50కోట్లు రావడం విశేషం. ఈ సినిమా అన్ని ఏరియాలోనూ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ లాభాల్లో వెళ్తోంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ మూవీగా నిలవడం విశేషం. దాదాపు రూ.300కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు లాభాల పంటపండిస్తోంది. ఇప్పటికే దీనికి థియేట్రికల్‌గా వంద కోట్లకుపైగా లాభాలు రావడం విశేషం.

44
జైలర్ కి సీక్వెల్‌గా వచ్చిన జైలర్‌ 2
Image Credit : Asianet News

జైలర్ కి సీక్వెల్‌గా వచ్చిన జైలర్‌ 2

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా రూపొందిన `జైలర్‌ 2` చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా ఇందులో రమ్యకృష్ణ ఆయనకు జోడీగా నటించింది. అలాగే ఎస్‌ జే సూర్య, విద్యాబాలన్‌, మిథున్‌ చక్రవర్తి, మిర్నా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌, విజయ్‌ సేతుపతి గెస్ట్ రోల్స్ చేశారు. నిర్మాత కళానిధి మారన్‌ తన సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదలయ్యింది. మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్‌` మూవీ పెద్ద హిట్‌ కావడంతో దానికి సీక్వెల్‌గా ఈ `జైలర్‌ 2`ని రూపొందించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Related Stories
Recommended image1
Rajeev Kanakala: ఎన్టీఆర్‌ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్‌ కనకాల
Recommended image2
Bigg Boss 10 Double Elimination: ఎలిమినేషన్‌లో ట్విస్ట్, రోహిత్‌ ఔట్‌.. బిగ్‌ బాస్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved