Guppedantha Manasu: ఢీ అంటే ఢీ అంటున్న జగతి, శైలేంద్ర.. నట విశ్వరూపం చూపిస్తున్న దేవయాని!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్తో ప్రేక్షకులు హృదయాలని గెలుచుకుంటుంది. భర్త ముందు మంచితనం నటిస్తూ వెనకాతల గోతులు తవ్వుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషికి ఫోన్ చేస్తుంది వసుధార. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయమని వాయిస్ మెసేజ్ పెడుతుంది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన రిషి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మీ ప్రశ్నకి సమాధానం దొరికింది కదా ఇంక నన్ను వదిలేయండి అంటాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి సార్ అని అడుగుతుంది వసుధార. నాది గమ్యం తెలియని ప్రయాణం, విధి ఎక్కడికి తీసుకు వెళ్తే అక్కడికే వెళ్తాను.
కానీ కంగారు పడకండి ఇదే ఊర్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఇన్నాళ్లు అంటే ఏంజెల్ తోడున్నారు కాబట్టి మీకు ఏ బాధ లేకపోయింది. ఇప్పుడు మీరు ఒక్కరే ఉండలేరు సార్ అని మనసులో అనుకొని పాండ్యన్ కి ఫోన్ చేస్తుంది వసుధార. మరోవైపు హోటల్ దగ్గర దిగుతాడు రిషి. అక్కడికి పాండ్యన్ వస్తాడు. మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతాడు. కొంచెం పని ఉంది ఆ పని పూర్తి కావాలంటే ప్రైవసీ కావాలి అందుకే ఇక్కడికి వచ్చాను.
అది సరేగాని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రిషి. మీకు ప్రైవసీ కావాలంటున్నారు కదా నేను ఒక దగ్గరికి తీసుకు వెళ్తాను రండి అని చెప్పి రిషి చెప్తున్నా వినిపించుకోకుండా తనతో పాటు తీసుకువెళ్లిపోతాడు పాండ్యన్. మరోవైపు తల్లితో మాట్లాడుతూ రిషి బ్రతికి ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే నేను ఎండి అయ్యాక కూడా రిషికి నిజాలు తెలిస్తే నాకు ఇబ్బందులు తప్పవు. అందుకే శత్రు శేషం లేకుండా చేద్దాం అనుకుంటున్నాను రిషి ని చంపేస్తాను అంటాడు శైలేంద్ర.
అది నీ వల్ల కాదు అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన జగతి. రిషిని ఏమైనా చేయాలంటే ముందు మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి. కాలేజీకి రిషి దూరంగా ఉన్నాడని ఏవేవో కుట్రలు చేశావు కానీ సరి అయిన సమయానికి రిషి వచ్చి ఆడుకున్నాడు. ఇంక నీ ఆటలు చెల్లవు. నీ పతనం మొదలైంది అంటుంది జగతి. ఇన్నాళ్లు నాలో శాంపిల్ ని మాత్రమే చూసావు ఇకమీదట నా విశ్వరూపం చూపిస్తాను, రిషి ని భూమ్మీద లేకుండా చేస్తాను అంటాడు శైలేంద్ర. అదీ చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జగతి.
మరోవైపు పాండ్యన్ రిషి ని నేరుగా తన ఇంటికి తీసుకు వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అంటాడు రిషి. మీరు ప్రైవసీ కావాలన్నారు కదా ఇక్కడ మీకు కావలసినంత ప్రైవసీ ఉంటుంది అంటాడు. ఇంతలో మురుగన్ కూడా వచ్చి మీరు హోటల్ రూమ్ లో ఉండటం ఏమీ బాగోదు, మీకోసం రూమ్ అరేంజ్ చేశాను రండి అని చెప్పి గదిలోకి తీసుకు వెళ్తాడు మురుగన్. రూమ్ అంతా తనకి నచ్చినట్లుగా, రూమ్ లో తనకి ఇష్టమైన రూమ్ ఫ్రెషనర్ చూసి రిషికి అనుమానం వస్తుంది.
ఇది ఎవరు చేశారు అని అడుగుతాడు. అప్పుడు వసుధార మురుగన్ ఇంటికి వచ్చి అంతా క్లీన్ చేసి, వెళుతూ వెళుతూ ఇదంతా నేను చేశాను అని చెప్పొద్దు అని చెప్పిన విషయం గుర్తొస్తుంది అందుకే అతను ఏమీ మాట్లాడడు మురుగన్. కానీ మళ్ళీ రిషి అసలు హోటల్ దగ్గరికి నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు. వసుధార మేడం పంపించారు అంటాడు పాండ్యన్. ఆ తర్వాత నేను మీకోసం టిఫిన్ పంపిస్తాను ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మురుగన్, పాండ్యన్.
ఇదంతా నువ్వే చేసావని తెలుసు, నన్ను అనుక్షణం కనిపెట్టుకొని ఉంటున్నావు కానీ నామీద నింద వేసేసావు. నింద వేసే ముందు నాకు నిజం చెప్పి ఉంటే మిమ్మల్ని కాపాడి,నన్ను కూడా నేను కాపాడుకునే వాడిని కదా. నన్ను నమ్మలేకపోయావు నమ్మకం లేని చోట బంధం నిలబడదు అందుకే నీతో మూడుముళ్ల బంధానికి దూరంగా ఉంటున్నాను అనుకుంటాడు రిషి. మరోవైపు పంతులు గారిని ఇంటికి పిలిపించిన దేవయాని రిషి ఇంటికి రావాలంటే ఏం చేయాలి, ఏ పూజలు చేయమన్నా చేస్తాను అంటూ తెగ హడావిడి చేస్తుంది.
అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు. ఇంట్లో శాంతి పూజలు చేస్తే ఇంట్లో ఉన్న శని పోయి అబ్బాయి ఇంటికి తిరిగి రావచ్చు అంటాడు పంతులుగారు. ఇదంతా చూస్తున్న ఫణీంద్ర మీ ఇద్దరూ చేసిన పని వల్ల దేవయాని చూడండి ఎంత బాధ పడుతుందో. అయినా మీ ఇద్దరు చాలా పెద్ద తప్పు చేసారు. నా పెద్దరికాన్నే వద్దనుకున్నారు అంటూ బాధపడతాడు. ఎంత బాగా నటిస్తున్నారు అక్కయ్య అని మనసులో అనుకుంటుంది జగతి. రిషి లేకుండా నేను ఉండలేను అందుకే నేను వెళ్ళి రిషి ని తీసుకు వస్తాను అంటూ రిషి దగ్గరికి బయలుదేరుతుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.