MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: శైలేంద్ర కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి.. ఏంజెల్ రాకతో రిషి లైఫ్ మారనుందా?

Guppedantha Manasu: శైలేంద్ర కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి.. ఏంజెల్ రాకతో రిషి లైఫ్ మారనుందా?

Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనని నమ్మిన వాళ్లే మోసం చేయడంతో తీవ్ర మానసిక వేద అనుభవిస్తున్న ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : May 31 2023, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో కారు బాగు చేస్తూ ఉంటాడు రిషి. అతనిని తదేకంగా చూస్తూ నువ్వు రిషి కదా అని అడుగుతుంది ఆ అమ్మాయి. నేను నీకు తెలుసా అని అడుగుతాడు రిషి. నేను ఏంజెల్ ని రిషి. మనం ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్, డిగ్రీలో కూడా కలిసి చదువుకున్నాము పక్క పక్కనే కూర్చునే వాళ్ళం గుర్తొచ్చిందా అంటుంది ఆ అమ్మాయి. గుర్తొచ్చింది అన్నట్లుగా తల ఊపుతాడు రిషి. ఉత్సాహంగా రిషి తో మాట్లాడుతుంది ఏంజెల్.
 

28

రిషి వివరాలు అన్నీ అడుగుతుంది. రిషి డల్ గా ఉండడం చూసి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఏమో నేను అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నెంబర్ కి ఫోన్ చెయ్యు అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఏంజెల్. మరోవైపు మహేంద్ర.. కొడుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. భర్తకి టీ తీసుకొస్తుంది జగతి. వద్దంటూ టీ ని విసిరేస్తాడు మహేంద్ర.
 

38

షాక్ అవుతుంది జగతి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది రిషి ని వదిలి నేను ఇప్పటివరకు ఎప్పుడూ ఉండలేదు ఇప్పటివరకు నేను విషెస్ చెప్పకుండా ఏ బర్త్డే జరగలేదు. నువ్వు వసుధార కలిసి వాడికి మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. నువ్వు ఇలా చేయటానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. దయచేసి అదేంటో చెప్పు అంటాడు మహేంద్ర. ఏం చేసినా మన మంచికే చేశాను అంటుంది జగతి. రిషి ఇంట్లోంచి వెళ్ళిపోవటం నీకు మంచి పనా అంటాడు మహేంద్ర. వసుధార అయిన ఎక్కడ ఉందో తెలుసా ఆమెకి ఫోన్ చెయ్యు అంటాడు.

48

జగతి వసుధారకి ఫోన్ చేస్తుంది. కానీ కోపంగా ఉన్న వసు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కట్ చేసేస్తూ ఉంటుంది. మరోవైపు తల్లికి గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో ఉన్న వసు రిషిని తలుచుకొని బాధపడుతుంది. మీ మంచి కోసమే ఇలా చేశాం సార్. మీరు ముందు కోప్పడి తర్వాత అర్థం చేసుకుంటారని అనుకున్నాను కానీ నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారు అనుకోలేదు మీ బర్త్ డే కి మంచి గిఫ్టే ఇచ్చాము అని బాధపడుతుంది.
 

58

అదే సమయంలో రిషి కూడా జగతి, వసుల ప్రవర్తనకి బాధపడతాడు. నిర్ణయం తీసుకునే ముందు నాకు ఒక్కసారి చెప్పవలసింది. ఇద్దరు కలిసి నాకు మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. రియల్లీ ఐ మిస్ యు డాడీ అనుకుంటాడు రిషి. మరోవైపు కాలేజీకి వెళ్తున్న జగతితో కాలేజీ ఎండి సీటు నా కొడుక్కి వస్తుంది అనుకున్నాను కానీ అలా జరగలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ సీట్ నా కొడుక్కి ఇచ్చేయి అంటుంది. ఇంకా మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారా ఇంతకుముందు అయితే నా కొడుకుని చూపించి భయపెట్టారు.
 

68

ఇకమీదట భయపడేది లేదు ఇన్నాళ్లు నాలో ఓపికని సహనాన్ని చూసారు. నాలో కోపాన్ని చూడొద్దు అంటూ హెచ్చరించి వెళ్ళిపోతుంది జగతి. భర్తకి కాలేజీకి వెళ్తున్నాను అని చెప్తుంది. నేను రావడం లేదు నువ్వు వెళ్ళు అని భార్యని కసురుకుంటాడు మహేంద్ర. నీవల్లే మహేంద్ర ఇంత బాధ పడుతున్నాడు అంటూ చివాట్లు పెడుతుంది దేవయాని. జగతిని బాధ పెట్టొద్దు అంటూ భార్యని మందలిస్తాడు ఫణీంద్ర. బయటికి వెళ్తున్న మహేంద్ర ని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జగతి.
 

78

రిషి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. రిషి ఎక్కడో కనిపించాడట తీసుకురావడానికి వెళ్తున్నాను అంటాడు మహేంద్ర. నేను వస్తాను అంటుంది జగతి. వాడు నీ మీద కోపంగా ఉన్నాడు. నువ్వేమీ రానక్కర్లేదు. నేనే వెళ్లి కాళ్ళో, వేళ్ళో పట్టుకొని తీసుకు వస్తాను అని బయలుదేరుతాడు మహేంద్ర. జగతి కూడా కాలేజీకి వెళ్ళిపోతుంది. రిషి ఇంటికి వస్తాడు కదా అని భార్యని అడుగుతాడు ఫణీంద్ర. రావాలనే ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను అంటుంది దేవయాని. నాకు తెలుసు నీకు రిషి అంటే ఎంత ఇష్టమో తప్పకుండా రిషి వస్తాడు నువ్వేమీ బాధపడకు అని భార్యకి ధైర్యం చెప్తాడు ఫణీంద్ర. 

88

ఇదంతా వింటున్న ధరణి ఇదంతా జరగటానికి కారణమే వీళ్ళు. నిజం తెలిస్తే ఏమైపోతారో అని మామ గారిని తలుచుకుని బాధపడుతుంది ధరణి.అదే సమయంలో రిషి మళ్ళీ ఇంటికి వస్తే నేను ఎప్పటికీ ఎండీ ని కాలేను అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర. ఇప్పుడు ఏం చేద్దాం అని కంగారుగా అడుగుతుంది దేవయాని. ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేమీ కంగారు పడకు నువ్వు అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది అంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Recommended image2
Shakeela: ఓ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో పడుకున్న షకీలా.! అలా చేస్తాడని అస్సలు అనుకోలేదట: షకీలా
Recommended image3
Gangster Movies: OTTలో మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇవే..అసలు సిసలైన మజా గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved