Guppedantha Manasu: పెద్ద స్కెచ్ వేసిన దేవయాని.. ఏకంగా వసు, రిషిల మధ్య చిచ్చు?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

జగతి (Jagathi), వసు కాలేజ్ కు బయలుదేరుతుండగా దేవయాని వచ్చి వారిపై మండిపడుతుంది. రిషితో (Rishi)ఎక్కడికి వెళ్లావు అని వసును అడగటంతో ఆ మాట రిషిని అడగండి అంటూ రీ కౌంటర్ వేస్తుంది.
దేవయాని (Devayani) ఎంత గట్టిగా మాట్లాడుతుందో.. వసు కూడా అంతే గట్టిగా మాట్లాడటంతో.. జగతి తో నీ శిష్యురాలు చూడు నీలాగే మాట్లాడుతుంది అని అంటుంది. వెంటనే వసు తనను జగతి (Jagathi) మేడం తో పోల్చవద్దని అంటుంది.
పక్కన జగతి (Jagathi) వసును కంట్రోల్ చేయడానికి ప్రయత్నించగా.. వసు (Vasu) మాత్రం కంట్రోల్ కాదు. అరిచే వాళ్ళ ఎదుట సున్నితంగా ఉండకూడదని.. తిరిగి అరవాలని అనటం తో దేవయానికి ఎదురుదెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది.
ఇక ఇద్దరి మాటల యుద్ధం పూర్తయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కాలేజ్ దగ్గరికి వెళ్ళాక రిషి (Rishi)సార్ తో జరిగిన విషయం మొత్తం చెబుతాను అని వసు జగతి (Jagathi) తో అంటుంది. కానీ జగతి మాత్రం ఆ విషయం అస్సలు చెప్పకూడదు అని అంటుంది.
అప్పుడే రిషి (Rishi) అక్కడికి రావడంతో ఇంత ఆలస్యం ఎందుకు అయిందని అడుగుతాడు. వెంటనే వసుధార ఆ విషయం చెప్పడానికి ప్రయత్నించడంతో.. జగతి చెయ్యి పట్టుకొని ఆపుతుంది. అది గమనించిన రిషి వసును (Vasu) బాగా కంట్రోల్ లో పెట్టుకుందని అనుకుంటాడు.
వసును (Vasu) సాయంత్రం కాలేజి అయిపోయాక కలవమని అంటాడు. ఇక కాలేజ్ అయిపోయాక జగతి (Jagathi) రెస్టారెంట్ లో ఉంటుంది. వసు తో మాట్లాడుతుంది. ఆ విషయం గురించి ఆలోచించకుండా చిరునవ్వుతో ఉండమంటుంది.
అదే సమయంలో దేవయాని (Devayani) పెద్ద స్కెచ్ వేస్తూ రెస్టారెంట్ దగ్గరికి వచ్చి రెస్టారెంట్ లోపల ఒక మనిషిని పెడుతుంది. రిషి వస్తే మెసేజ్ చేయమని అంటుంది. ఇంట్లో ధరణి (Dharani) టెన్షన్ పడుతూ మహేంద్రవర్మ తో దేవయాని అత్తయ్య.. వసు వాళ్లను కలవడానికి వెళ్తుందని అంటుంది.
అప్పుడే వచ్చిన రిషి (Rishi) ఆ మాటలను వింటాడు. ఇక తన పెద్దమ్మ దేవయాని నుంచి తనకు మెసేజ్ వస్తుంది. నీకు ఇష్టం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాను అని వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. రిషి అక్కడినుంచి వెళ్ళటంతో కారు శబ్దం విని మహేంద్ర వర్మ (Mahendra varma) షాక్ అవుతాడు.
రెస్టారెంట్ లో దేవయాని (Devayani) వసును కూడా తనతో కాఫీ తాగమని అంటుంది. తరువాయి భాగం లో రిషి రావడాన్ని గమనించిన దేవయాని కావాలని కింద పడుతుంది. అది చూసిన రిషి (Rishi) వసు పడేసిందనుకొని వసు దగ్గరికి వచ్చి మరో మాట మాట్లాడొద్దని అరుస్తాడు.