Guppedantha Manasu: పాపం.. వసును బాధ పెడుతున్న జగతి.. మరీ ఇంత దారుణమా!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

జగతి (Jagathi) రిషి చేసిన డిమాండ్ గురించి ఆలోచిస్తూ వసును ఇంటినుంచి బయటకు పంపడం ఏంటీ.. అని ఆలోచిస్తుంది. అసలు రిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని మనసులో ఆలోచిస్తూ.. వసు (Vasu) ను బయటకు పంపడం గురించి బాధపడుతుంది. ఈలోపు వసు వచ్చి ఏమైంది మేడం అని అడగగా తలనొప్పి వస్తుందని చెబుతుంది.
ఇక వసు (Vasu) జగతి కి కాఫి కలిపి తీసుకొని వస్తే కాఫి బాగాలేదు అని కోపంగా ఆ కాఫి ని పారపొస్తుంది. వసు కావాలంటే మళ్ళీ కాఫి కలుపుతా మేడం అని అంటుంది. జగతి నా కాఫి నేను కలుపుకుంటాను ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి అన్నట్లుగా కోపంగా చెబుతుంది. అసలు జగతి (Jagthi) ఇలా ఎందుకు చేస్తుందో వసుకి ఏమీ అర్ధంకాదు.
మరో వైపు రిషి (Rishi) వసు పంపిన ఫోటోలను చూస్తూ వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నిద్ర పట్టక మహీంద్రా రూంలో ఉండగా.. రిషి అక్కడకు వెళ్తాడు. ఏమైనా కబుర్లు చెప్పండి డాడ్ అని అడుగుతాడు. మహీంద్రా (Mahindra) మనసు గురించి కొన్ని అడ్వైస్ ఇస్తాడు. తరువాత అక్కడ నుంచి రిషి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు.
తరువాత రిషి (Rishi) తన ఫ్రెండ్ గౌతమ్ తో కలసి కారు లో బైటకు వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాలి అని రిషి తన ఫ్రెండ్ ని అడిగితే వసు ఇంటికి పోనివ్వు అని చెబుతాడు. దాంతో రిషి షాక్ అవుతాడు. పొద్దు పొద్దున్నే వసు (Vasu) ఇంటికేంట్రా అని కోపంగా అంటాడు.మరోవైవు వసు జగతి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది.
ఇక జగతి కాలేజ్ కి వసు (Vasu) కోసం ఆగకుండా వెలుతుంది. మేడం నేను వస్తా అని అడగగా జగతి ఎప్పుడూ కారులోనే తిరగలేదుగా ఆటోలో కూడా వెళ్లొచ్చు అంటూ కొన్ని మాటలతో బాధపెట్టి జగతి కారు లో వెలిపోతుంది. ఇక జగతి (Jagathi ) కారులో వెళుతుండగా ఒక దగ్గర ఆగి వసుతో బాధపడే విధంగా మాట్లాడినందుకు ఏడుస్తుంది.
ఇక వసు (Vasu) కాలేజ్ నడుచుకుంటూ వెళుతుండగా ఇంతలో రిషి, గౌతమ్ ఎదురవుతారు. ఇద్దరినీ ఇంటిలోకి తీసుకొని వెళుతుంది. ఇక రిషి చేసిన డిమాండ్ కోసం జగతి (Jagathi) ఇష్టంగా ఉంచుకునే వసు ని కష్టంగా మరికొన్ని భాద పడే మాటలతో బాధపడేలా చేసి ఇంటినుంచి పంపుతుందా. లేక ఈ మాటలను గ్రహించుకున్న వసు తానే స్వయంగా వెళ్ళిపోతుందా అనేది తరువాయి భాగంలో చూడాలి.