MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న జగతి, మహేంద్రలు.. రిషి, వసుధార రొమాంటిక్ సీన్?

Guppedantha Manasu: ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న జగతి, మహేంద్రలు.. రిషి, వసుధార రొమాంటిక్ సీన్?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

4 Min read
Author : Navya G
Published : Oct 21 2022, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దేవయాని, జగతి మహేంద్రలతో, అయినా ఇందంతా మీ వల్లే వచ్చింది ఆ గురుదక్షిణ ఒప్పందం వల్ల రిషిని వసుని దూరం చేశారు. ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయంటే దానికి మీరే కారణం. అయినా మీరు తల్లిదండ్రులుగా రిషి కోసం ఏం చేశారు ఎప్పుడో రాత్రి ఇంటికి వస్తారు మీ పనులు మీరు చూసుకుంటారు ఎప్పుడైనా రిషి గురించి పట్టించుకున్నారా? ఒకవేళ ఈ మాటలన్నీ నేను రిషి ముందు అంటే ఈపాటికి మిమ్మల్ని అసహ్యించుకునేవాడు. మీరు ఇంట్లో ఉన్నా లేనట్టే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటాది అనిపిస్తుంది నాకు అని చెప్పి కోపంతో అటువైపు నుంచి వెళ్ళిపోతుంది దేవయాని. ఈ మాటలు విని జగతి, మహేంద్రలు ఎంతో బాధపడతారు. అప్పుడు మహేంద్ర జగతితో, జగతి మనమేదో ఒక పరిష్కారం ఆలోచించాలి ఈ మాటలు పడడం నావల్ల కాదు అని అంటాడు. ఆ తర్వాత సీన్లో రిషి, వసుదారలు కార్లో వెళ్తూ ఎందుకో నీతో మాట్లాడాలి అనిపించింది వసుధారా అని రిషి అంటాడు. దానికి వసు, అవును సార్ నాకు కూడా మీతోనే ఉండాలనిపిస్తుంది ఈరోజు అని అంటుంది. 

311

అప్పుడు రిషి, వసుధార నామీద నీకు ఎందుకు అంత నమ్మకం. మనం ఈ సమయంలో కార్లో వెళ్తున్నారు కదా ఎవరైనా ఆపి నీకు నాకు సంబంధం ఏంటి అని అడిగితే ఏం చెప్తావు అని అనగా, మిమ్మల్ని జవాబు ఇవ్వమంటాను సార్ అంటుంది. ఎవరో కాదు నేనే అడుగుతున్నాను నీకు నాకు సంబంధం ఏంటి అని అడుగుతాడు రిషి. అప్పుడు వసుధార, మీరు నేను, నేను మీరు సర్. మీరు నా సగ భాగం అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకుంటూ జగతి, మహీంద్ర లు వాళ్ళు గదిలో బాధపడుతూ ఉంటారు. మహేంద్ర రిషికి ఫోన్ చేయగా రిషి ఫోన్ స్విచాఫ్ లో ఉంటుంది.
 

411

దానికి మహేంద్ర, చూసావా జగతి రిషి నా ఫోన్ ఎత్తడం లేదు నేను ఫోన్ చేస్తే మాట్లాడకపోతే బాగోదు అని ఫోన్ స్విచాఫ్ లో పెట్టేసాడు. ఫోన్ ఉన్నా సరే మాట్లాడడానికి రిషి మనసు ఉండాలి కదా. నిజంగానే దేవయాని వదిన అన్నట్టుగా మనమే రిషికి శత్రువులము అయిపోతున్నామా. అప్పుడు దేవినేని మాటలు గుర్తొచ్చి, దేవయాని వదిన ఒక ప్రశ్నని మన గుండెల్లో బాణంగా విసిరారు దాన్ని ఎలాగైనా పరిష్కరించాలి నేను ఒకటి చెప్తాను అది చేయి జగతి అని అంటాడు. ఆ తర్వాత సీన్లో రిషి, వసుధారలు రోడ్డు మీద గట్టుమీద కూర్చొని ఒకరి భుజం మీద ఒకరు జారబడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.

511

 అప్పుడు రిషి, ఏమో వసుధార నీ దగ్గర ఉంటే మనసులో దిగులంతా పోయి హాయిగా ఉంటుంది అని అంటాడు. నమ్మకం వసు,ప్రేమ ఉంటే అంతే సార్ అయినా మనిద్దరం ఇలా చాలా బాగుంది కదా అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ లో పెట్టి కార్లో ఉంచాను ఏ గోల ఉండదు అని అనగా రిషి ఆశ్చర్యపోయి వెనక్కి తిరుగుతాడు. తిరిగేసరికి వసుధార రిషి వొడిలో పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టి కొంచెం సేపు చూసుకుంటారు. ఆ తర్వాత సీన్లో జగతి,  మహేంద్రలు అన్ని సర్దుకుంటూ ఉంటారు. 
 

611

మనం ఇంటిని వొదిలి వెళ్లిపోతున్నామా అని జగతి అనగా, అవును జగతి ఇది ఒకటే పరిష్కారం ఉన్నది. వదిన గారు అన్నారు కదా ఇల్లు వదిలి వెళ్ళిపోమని ఇంక ఈ బంధాలకి మనకి ఎటువంటి సంబంధము ఉండదు అని పెట్ట సర్దుకొని బయటికి వెళ్తున్నప్పుడు మహేంద్ర,రిషిది, తనది ఫోటో చూసి, రిషి నిజంగా నేను మారిపోతున్నానా ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను మారిపోతున్నాను పారిపోతున్నాను అని అనుకుంటూ బాధతో జగతిని తీసుకొని ఇల్లు వదిలి కారులో కూర్చుంటారు. దీన్ని దేవయాని చూస్తూ ఆనందపడుతుంది.
 

711

 ఆ తర్వాత సీన్లో రిషి వసుదారలు మాట్లాడుకుంటూ ఉంటారు. జీవితం చాలా చిత్రంగా ఉంటుంది కదా వసుధార, అప్పుడే నవ్వుతాము అప్పుడే ఏడుస్తాము అని అనగా వసు రిషి ని చూస్తూ ఉంటుంది. ఎందుకు వసుధార నన్నే చూస్తున్నావు ఏం మాట్లాడటం లేదు అని అనగా, మీరు మాట్లాడండి సార్ మిమ్మల్ని మీ నవ్వును చూస్తూ ఉంటాను అని వసు అంటుంది. దానికి రిషి, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నవ్వులన్నీ వచ్చాయి వసుధార థాంక్స్ అని అనగా దీనికి కూడా ఒక రకంగా జగతి మేడమే కారణం సర్ అని వసు అంటుంది.
 

811

 అప్పుడు రిషి కొంచెం మాట మారుస్తూ అయినా మనం చాలా రోజుల తర్వాత పక్క వాళ్ళ గురించి కాకుండా మన గురించి మాట్లాడుకున్నాం వసుధార ఇకపై ఇలాంటి రోజులే ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు వసు, నాకు సందేహం ఉంది అడగనా అని అనగా, మన గురించి అయితే మాత్రమే అడుగు వసుధార ఇప్పుడు కొత్త రకం సమస్యలు ఏమి సృష్టించొద్దు అని అనగా మన గురించే సార్ మీ ఫోన్లో నన్ను పొగరు అని ఎందుకు సేవ్ చేసుకున్నారు. నాకు మంచి పేరు ఉంది కదా అది ఎందుకు పెట్టుకోలేదు అని అనగా, నీకు మంచి పేరు ఉంది వసుధార కానీ మనం చిన్న పిల్లల్ని బుజ్జి,కన్నా అని ఎందుకు పిలుస్తాము వాళ్ళ మీద ప్రేమతోనే కదా.

911

 అందరి ఫోన్ లోనీ నీ పేరు వసుధార అనే ఉంటుంది కానీ నేను నీకు స్పెషల్ కదా అందుకే ఇలా సేవ్ చేసుకున్నాను. పొగరు అంటే అదేం తిట్టో లేకపోతే బూతో కాదు అది కూడా ఒక మంచి పదమే అని రిషి అంటాడు. అప్పుడే రిషి, అయినా వసుధార నా జీవితంలో నాకు ఆనందం తెప్పించే వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకళ్ళు నువ్వు ఇంకొకలు డాడ్. డాడ్ అంటే నాకు చాలా ప్రాణం. డాడ్ లేకుండా నేను ఉండలేను ముందుగా నేను లేకుండా డాడీ ఉండలేరు మా బంధం జీవితాంతం ఇలాగే ఉంటుంది అని అంటూ,  ఏవేవో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాను కదా అని అంటాడు.

1011

అప్పుడు వసు, పర్లేదు సార్ అని రిషి బుజం మీద తను తలపెట్టి మీరు ఏం మాట్లాడినా నాకు నచ్చుతుంది అని అంటుంది. అప్పుడు రిషి ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకున్నాం కదా అని అనగా అవును సార్ మనం ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి అని వసు అంటుంది. మరోవైపు జగతి,మహీంద్ర లు కారులో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తూ చాలా భారంగా ఉన్నది జగతి గుండెల్లో ఏదో తెలియని బరువుగా ఉన్నది అని అంటాడు. మరోవైపు రిషి వసుధారతో, గుండెల్లో ఏదో తెలియని ఆనందం ఉన్నది వసుధార మనసు ప్రశాంతంగా ఉన్నది అని అంటాడు.
 

1111

 మరోవైపు మహేంద్ర కారులో, ఇది కల అయితే బాగున్న కదా జగతి రేపు ఉదయం లెగిసిన వెంటనే రిషి నా కళ్ళ ముందు ఉంటాడు అని అనగా బాధపడొద్దు మహేంద్ర ఇది మనం రిషికి ఇస్తున్న  కానుక అనుకుందాం రిషి ఆనంద పడుతాడు కదా అని అంటుంది. మరోవైపు రిషి వసుతో, వసుధార ఆ దేవుడు అందించిన కానుక ఏమో నువ్వు అని అనిపిస్తుంది అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved