Guppedantha Manasu: జగతి మాటలకు బాధపడిన రిషి.. దగ్గరైన మహేంద్ర, రిషి?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

క్లాస్ లో రిషి(rishi)చెప్పిన టాపిక్ గురించి చెబుతుండగా అప్పుడు వసు, సార్ ఈ టాపిక్ గురించి అప్పుడే చెప్పారు సార్ అని అనగా అప్పుడు రిషి అందరికి రావాలి నీకు ఒక్కటి అర్థం అవుతే చాలా అని వసు(vasu) ని అందరి ముందు అవమానించేలా మాట్లాడతాడు రిషి.
వసు ని టార్గెట్ చేస్తూ ఇంకొన్ని మాటలు అంటాడు రిషి. ఆ తర్వాత వసు, రిషి క్యాబిన్ లో కూర్చొని ఎదురు చూస్తూ ఫన్నీగా ఉంటుంది. ఇంతలో అక్కడికి రిషి (rishi)రావడంతో వాళ్లిద్దరూ కాసేపు ఫన్నీగా పొట్లాడుకుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడగా అప్పుడు రిషి ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నేను కాదు జగతి(jagathi), మహేంద్ర సార్ చూసుకుంటాడు అని చెబుతాడు.
అప్పుడు వసు(vasu) నేను మీకు పీఏ గా ఉన్నానా లేదా సార్ అని ప్రశ్నించగా అది నువ్వే ఆలోచించు ఎందుకంటే నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు చెయ్యను అని చెప్పడం లేదు అని అంటాడు రిషి. అలా వాళ్లిద్దరూ కొద్దీసేపు ఫన్నీ గా మాట్లాడుకుంటారు. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. మహేంద్ర(mahendra) టాబ్లెట్ వేసుకోవడం లేదు ఆరోగ్యం గురించి శ్రద్ద వహించడం లేదు అని చెప్పడంతో రిషి షాక్ అవుతాడు.
ఇవన్నీ మహేంద్ర శరీరానికి ఇచ్చే మందులు సార్ మనసుకి మందులు కావాలి అని అనడంతో ఆలోచనలో పడతాడు. మా ఆయన మా అబ్బాయిని మిస్ అవుతున్నారు సార్ అని చెప్పడంతో రిషి(rishi) ఒక్కసారిగా బాధపడతాడు. నాకు 20 ఏళ్లు దూరమైన మా ఆయన ఎప్పుడూ ఇంతగా బాధపడలేదు కానీ మా అబ్బాయికి దూరం అయినందుకు ఇప్పుడు చాలా బాధ పడుతున్నాడు అని చెప్పి జగతి(jagathi)అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది.
అప్పుడు రిషి గౌతమ్(gautham) కి కాల్ చేసి ఒక పని అప్పచెబుతాడు. ఆ తర్వాత గౌతమ్, రిషి తనకు పని చెప్పినందుకు గౌతమ్ తిట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో జగతి(jagathi) అక్కడికి రావడంతో మేడం మీ అబ్బాయికి కొంచెం భయం చెప్పండి అని అనగా మా అబ్బాయి గురించి పొగడ్తలు చెబితే వింటాను కానీ కంప్లైంట్స్ చెబితే నేను వెళ్తాను అని అంటుంది జగతి.
ఇంతలో అక్కడికి మహేంద్ర(mahendra) రావడంతో మహేంద్ర ని కార్ లో పిలుచుకొని వెళతాడు గౌతమ్. మరొకవైపు వసు,జగతి కారు లో వెళ్తు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు గౌతమ్, మహేంద్ర,రిషి కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. రేపటి ఎపిసోడ్ లో రిషి (rishi)కోసం వసు ఐస్ క్రీమ్ తీసుకొని వస్తే అది కరిగిపోతుంది.ఆ ఐస్ క్రీమ్ ని చూసిన రిషి పాయసం అంటూ వసు ని ఆట పట్టిస్తాడు.