- Home
- Entertainment
- Guppedantha Manasu: కొడుకు కండిషన్స్ విని షాకైనా మహేంద్ర.. రిషీని కావాలనే బాధపెట్టిన వసుధార!
Guppedantha Manasu: కొడుకు కండిషన్స్ విని షాకైనా మహేంద్ర.. రిషీని కావాలనే బాధపెట్టిన వసుధార!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో.. మహేంద్ర (Mahendra) రిషి ను ఏం చేస్తున్నావ్ నాన్న అని మనసులో తలచుకుంటాడు. మరోవైపు రిషి కూడా తలుచుకుంటాడు. ఆ తర్వాత రిషి (Rishi) వసుకు కాల్ చేసి మహేంద్ర గురించి అడుగుతాడు. దాంతో వసు ఫోన్ మహేంద్ర కు ఇవ్వగా మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు.
దీంతో రిషి మనసులో ఎంతో బాధను వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత ప్రాజెక్టు గురించి జగతి కి కాల్ చేస్తాడు. మహేంద్ర ఈ ప్రాజెక్టు ను ఆపొద్దు అని జగతి తో అంటాడు. అదే క్రమంలో వసు (Vasu) రిషి సార్ ఈ ప్రాజెక్టు విషయంలో మనసు మార్చుకుంటే బాగుండు అని అంటుంది.
మహేంద్ర (Mahendra) రిషి మనసు మారడం అనేది బహుశా నీ వల్లే సాధ్యమవుతుంది అని వసును అంటాడు. ఈలోపు అక్కడకు గౌతమ్ వచ్చి రిషి ఇది వరుకులా ఉండడం లేదు అని చెబుతాడు. దాంతో మహేంద్ర ఎంతో బాధను వ్యక్తం చేస్తాడు.
ఆ తరువాత మహేంద్ర గౌతమ్ తో వసు (Vasu) ను కారులో డ్రాప్ చేయమని చెబుతాడు. ఆ తర్వాత రిషి (Rishi) భోజనం చేయకుండా ఉంటాడు ఆఫీస్ లో ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో జగతి ఏంటి వసు నా కొడుకు భోజనం చేయకపోయినా.. పట్టించుకోవా అని అడుగుతుంది. దాంతో వసు రిషి కు భోజనం పెట్టడానికి తీసుకువెళుతుంది.
ఇక అక్కడికి వెళ్ళిన వసు మీరు భోజనం చేస్తే మహేంద్ర (Mahendra) గారి గురించి కొన్ని విషయాలు చెబుదాం అనుకున్నాను అని అంటుంది. దాంతో రిషి (Rishi) భోజనం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక భోజనం వడ్డిస్తుంది. ఇక అదే క్రమంలో వసు మహేంద్ర గారు ఈ కాలేజీ ను మిస్ అవుతున్న విషయంలో చాలా ఫీల్ అవుతున్నారు అని చెబుతుంది.
దాంతో రిషి వసు (Vasu) ద్వారా ఎలాగైనా డాడీ తో మాట్లాడాలి అని అనుకుంటాడు. అదేక్రమలో వసు (Vasu) మీరిద్దరూ మాట్లాడుకొనంతగా గొడవేం పడ్డారు అని అడుగుతుంది. ఇక ఆ తర్వాత వసు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక రిషి (Rishi) కి ఎం చెప్పాలో అర్ధం కాదు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.