MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Folk Song: ‘సర్పంచ్ కూతురు’ వెనక పడ్డ రాహుల్ సిప్లిగంజ్..24గంటల్లోనే మిలియన్ వ్యూస్..!

Folk Song: ‘సర్పంచ్ కూతురు’ వెనక పడ్డ రాహుల్ సిప్లిగంజ్..24గంటల్లోనే మిలియన్ వ్యూస్..!

Folk Song: టాలీవుడ్ స్టార్ సింగర్, ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ఓ ఫోక్ సాంగ్ తో అభిమానుల మందుకు వచ్చాడు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 16 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫోక్ సాంగ్ తో ముందుకు వచ్చిన రాహుల్...
Image Credit : youtube\Lethivos

ఫోక్ సాంగ్ తో ముందుకు వచ్చిన రాహుల్...

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట పాడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించడమే కాకుండా ఆస్కార్ గెలుచుకున్నాడు. రాహుల్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో పాటలు పాడాడు. అయితే.. సినిమా పాటలతో పాటు.. యూట్యూబ్ లోనూ రాహుల్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో పాటలు పాడటం కంటే ముందు నుంచే.. స్పెషల్ ఆల్బమ్ సాంగ్స్ తో.. గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు రాహుల్ జాబితాలో.. మిలియన్లు దాటిన సాంగ్స్ చాలానే ఉన్నాయి. కాగా.. తాజాగా.. మరోసారి ఫోక్ సాంగ్ తో యూట్యూబ్ లో తన అభిమానుల ముందుకు వచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యూట్యూబ్ లో అదరగొడుతున్న ‘సర్పంచ్ కూతురా’
Image Credit : youtube\Lethivos

యూట్యూబ్ లో అదరగొడుతున్న ‘సర్పంచ్ కూతురా’

‘సర్పంచ్ కూతురా.. సర్పంచ్ కూతురా నిన్ను ఇడిచి నేనుండలేనే..నిన్ను ఎక్కించి తిప్పుతా, ఎక్కించి తిప్పుతా.. నేను కొన్న కొత్త బైకు పైనే’ అంటూ తెలంగాణ ఫోక్ సాంగ్ తో మన ముందుకు వచ్చాడు. ఈ పాటను స్వయంగా రాహుల్ పాడి.. అందులో హీరోగా కూడా తనే నటించడం విశేషం. సర్పంచ్ కూతురుగా.. యూట్యూబర్ సిరి రాశి నటించారు. ఈ పాటకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించగా, సాహిత్యం చంద్రబోస్ అందించారు. ఈ పాటకు ఎస్ఎస్ కాంచి దర్శకత్వం వహించారు. ఈ పాటను రాహుల్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కాకుండా.. లెథోవిస్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేశారు.పాట విడుదల చేసిన 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

Related Articles

Related image1
Ambani: అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే..మీకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?
Related image2
Dosa: మీకు దోశలు వేయడం వస్తే చాలు.. ఏడాదికి రూ.32లక్షల జీతం, ఎక్కడో తెలుసా?
34
పాట అదరగొట్టిన రాహుల్..
Image Credit : youtube\Lethivos

పాట అదరగొట్టిన రాహుల్..

ఈ పాటలో భార్యపై తనకు ఉన్న ప్రేమను ఓ కుర్రాడు చెబుతున్నట్లుగా సాగుతుంది. సర్పంచ్ కూతురిని ప్రేమించి ధూమ్ ధామ్ గా పెళ్లి చేసుకున్న కుర్రాడు... పెళ్లి తర్వాత పెండ్లాన్ని ఎంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటాడో.. పాటలో లిరిక్స్ ద్వారా అర్థవంతంగా చెప్పారు. ఇక.. రాహుల్, సిరి యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంది.

44
భార్య కొంగు పట్టుకొని తిరిగే భర్త..
Image Credit : youtube\Lethivos

భార్య కొంగు పట్టుకొని తిరిగే భర్త..

భార్య కొంగు పట్టుకొని తిరిగే భర్తలాగా.. భార్యకు చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకునే యువకుడి పాత్రలో రాహుల్ చాలా అద్భుతంగా నటించారు. ఇక, పెళ్లి కాకముందు తల్లి కొంగు పట్టుకొని తిరిగి, పెళ్లి తర్వాత కొడుకు మారిపోయాడని తల్లడిల్లే పాత్రలో బాంబే పద్మ నటించారు. పాట బీట్ ఎంత బాగుందో.. పాటకు తగినట్లు పల్లెటూరి వాతావరణం, ఆ డ్యాన్స్ మూమెంట్స్ కూడా అంతే బాగున్నాయి. ఈ పాట అద్భుతంగా ఉందని కచ్చితంగా 100మిలియన్స్ కొడుతుంది అంటూ.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ పాటకు.. రీల్స్ చేసి తనను ట్యాగ్ చేయమని రాహుల్ సిప్లింగంజ్ తన ఫ్యాన్స్ కి పిలుపునిచ్చారు. కాగా.. ఈ పాట అలా విడుదలైందో లేదో.. యూట్యూబర్ మెహబూబ్ ఈ పాటకు తన స్టైల్ లో స్టెప్స్ వేయడం విశేషం. ఈ రీల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
The Odyssey: విధ్వంసానికి నోలన్ సినిమా రెడీ, కథేంటో తెలుసా.. 2 వేల కోట్ల బడ్జెట్, చరిత్రలో ఇదే తొలి చిత్రం
Recommended image2
Highest Paid Influencers : ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో రూ. 22 లక్షలా..! టాప్ 5 ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్లే
Recommended image3
Rajamouli Lovestory: రాజమౌళి అంత అమాయకుడేం కాదు.. జక్కన్నతో లవ్‌ స్టోరీ బయటపెట్టిన రమా రాజమౌళి
Related Stories
Recommended image1
Ambani: అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే..మీకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?
Recommended image2
Dosa: మీకు దోశలు వేయడం వస్తే చాలు.. ఏడాదికి రూ.32లక్షల జీతం, ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved