MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Uma Shankari: విక్టరీ వెంకటేష్ ఆన్ స్క్రీన్ చెల్లికి క్యాన్సర్, ఆసుపత్రిలో చికిత్స.. ప్రతి రోజూ పోరాడుతున్నా

Uma Shankari: విక్టరీ వెంకటేష్ ఆన్ స్క్రీన్ చెల్లికి క్యాన్సర్, ఆసుపత్రిలో చికిత్స.. ప్రతి రోజూ పోరాడుతున్నా

విక్టరీ వెంకటేష్ లక్ష్మీ మూవీలో నటించిన ఉమా శంకరి హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి అభిమానులు షాక్ అయ్యారు. అసలు ఆమెకు ఏమైంది? పూర్తి వివరాలు ఈ ఫొటో గ్యాలరీలో చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 16 2026, 06:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Actress Uma Shankari
Image Credit : Asianet News

Actress Uma Shankari

తమిళ ఇండస్ట్రీలో కొందరు నటీమణులు తక్కువ సినిమాలే చేసినా, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. ఆ జాబితాలో నటి ఉమా శంకరి ఒకరు. ఈమె ఎవరో కాదు, అలనాటి నటి సుమిత్ర కూతురే. 2000 సంవత్సరంలో సీమాన్ దర్శకత్వం వహించిన 'వీరనడై' సినిమాతో ఉమా శంకరి హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విక్టరీ వెంకటేష్ కి చెల్లిగా..
Image Credit : Asianet News

విక్టరీ వెంకటేష్ కి చెల్లిగా..

ఆ తర్వాత 'కలకలప్పు', 'చొక్కా తంగం', 'వికడన్', 'సూర్యన్', 'తెన్రల్', 'కోవై బ్రదర్స్', 'అడైకళం', 'మణికంఠ', 'రసిగర్ మండ్రం', 'భాగ్యలక్ష్మి' వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. చివరిగా అజిత్ నటించిన 'వలిమై' చిత్రంలో యంగ్ సుమిత్ర పాత్రలో కనిపించారు. 'చొక్కా తంగం', 'కోవై బ్రదర్స్' సినిమాలతో ఆమె అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో కూడా ఉమా శంకరి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ లక్ష్మీలో ఆయన చెల్లి పాత్రలో ఉమా శంకరి నటించారు. ఈ మూవీలో ఆమెది ప్రాధాన్యం ఉన్న పాత్రే. ఆమ్మో బొమ్మ, కల్యాణ రాముడు, నవ్వుతూ బతకాలిరా లాంటి తెలుగు సినిమాలలో ఉమా సత్తా చాటారు.  2006లో పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.

35
రొమ్ము క్యాన్సర్‌ - హాస్పిటల్‌లో చికిత్స
Image Credit : Asianet News

రొమ్ము క్యాన్సర్‌ - హాస్పిటల్‌లో చికిత్స

పెళ్లి తర్వాత ఉమా శంకరి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో కూడా ఆమె పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇలాంటి సమయంలో, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫొటోను షేర్ చేశారు. తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ చికిత్స తీసుకుంటున్నానని ఆమె ఆ పోస్టులో వెల్లడించారు.

45
కుటుంబానికి ధన్యవాదాలు
Image Credit : Asianet News

కుటుంబానికి ధన్యవాదాలు

ఆమె తన పోస్టులో ఇలా రాశారు: "ప్రస్తుతం కీమో, ఇమ్యునోథెరపీ రెండో రౌండ్‌లో ఉన్నాను. ప్రతీ రోజును ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. కష్టమైన రోజులను ఎలా తట్టుకోవాలో నేర్చుకుంటున్నాను. బలంగా ఉన్న రోజులను ఆస్వాదిస్తున్నాను. నాకు అండగా నిలుస్తున్న కుటుంబానికి ధన్యవాదాలు. ప్రేమ, సపోర్ట్ ఇస్తున్న అభిమానులకు కూడా నా కృతజ్ఞతలు. నా పనులు నేను చేసుకుంటూనే, ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నాను" అని ఉమా శంకరి పేర్కొన్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by D R UmaShankari (@uma_shankarii_)

55
అభిమానుల కామెంట్లు
Image Credit : Getty

అభిమానుల కామెంట్లు

ఈ పోస్ట్ చూసిన అభిమానులు, 'త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లోకి రావాలి', 'మీ ధైర్యం అభినందనీయం', 'మీరు ఎందరికో ఆదర్శం' అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో గౌతమి, మమతా మోహన్‌దాస్, సోనాలి బింద్రే, మనీషా కోయిరాలా వంటి నటీమణులు క్యాన్సర్‌ను జయించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
Rajendra Prasad: కమల్ హాసన్ కంటే రాజేంద్ర ప్రసాద్ గొప్ప నటుడు, ఎలాగో తెలుసా.. పోసాని షాకింగ్ కామెంట్స్
Recommended image2
Karna: 16 ఏళ్ళ పసి బాలుడి ఒళ్ళంతా బాణాలే, అలాంటి కర్ణుడు వీరుడు శూరుడా.. ఇది తెలిస్తే రక్తం మరుగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved