- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషికి సహాయం చేయాలనుకుంటున్న మినిస్టర్.. సంతోషంలో జగతి, మహేంద్ర?
Guppedantha Manasu: రిషికి సహాయం చేయాలనుకుంటున్న మినిస్టర్.. సంతోషంలో జగతి, మహేంద్ర?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్లో వసుధార రిషి కోసం కాఫీ తీసుకుని వెళ్ళగా అప్పుడు రిషి వెనుక వైపు వెళ్లి డోర్ క్లోజ్ చేసి వసుధార దగ్గరకు వస్తుండగా వసుధార టెన్షన్ పడుతూ కాఫీ సార్ అని అంటుంది. కాఫీ ఉలిక్కిపోతుంది సార్ అనడంతో పోతే పోనీవ్వు మధ్యలో అడ్డుగా ఎందుకు అని అంటాడు. అప్పుడు వసుధార చేతిలో కాఫీ నీ పక్కన పెట్టడంతో తాగండి సార్ చల్లారిపోతుంది అనగా మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవచ్చు కానీ ఈ క్షణం మళ్లీ మళ్లీ రాదు కదా అని వసుధార దగ్గరగా వెళుతూ ఉంటాడు రిషి.
అప్పుడు వసుధార సిగ్గుపడుతూ ఉండగా ఈ సూన్య మాసం ఎప్పుడు అయిపోతుందో ఏంటో, మనసు దేనికోసమో పరితపిస్తోంది ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అని అంటాడు. అప్పుడు రిషి ఈ శూన్య మాసం అంటే ఏంటి వసుధార అని అడుగుతాడు. అప్పుడు వసు సూన్య మాసం గురించి చెబుతూ ఉంటుంది. తలుపు వైపు చూసి సార్ ఎవరో వస్తున్నారు అని టెన్షన్ టెన్షన్ గా మాట్లాడుతుంది. వస్తే అనగా మీలో చాలా తెగువు కనిపిస్తోంది సార్ అని అంటుంది. ఇందులో కంగారు పడాల్సింది ఏముంది మనకు పెళ్లి జరుగుతుంది కదా అనగా జరుగుతుంది కానీ ఇంకా జరగలేదు కదా సార్ అని అంటుంది.
అంత వరకు మనం ఇలా రావడం కరెక్ట్ కాదు సార్ అనగా ఎలా అనడంతో దగ్గరికి రావడం గడ్డం పట్టుకోవడం అనడంతో నువ్వే కదా మనిద్దరం ఎప్పుడు దగ్గరగా ఉండాలి అనడంతో ఆ దగ్గర వేరు ఈ దగ్గర వేరు సార్ అని అంటుంది. లేదు రెండు ఒకటే అని అంటాడు రిషి. మరి మన మధ్య ఎంత గ్యాప్ ఉండాలో నువ్వే చెప్పు అనగా అది చెప్పలేను సార్ అని సిగ్గుపడుతూ ఉంటుంది వసుధార. ముందు ఈ కాఫీ తాగండి సార్ అనగా రిషి కాఫీ తీసుకుని వసుధార సాసర్ లో పోసి ఇచ్చి ఇద్దరు కప్పు కాఫీ షేర్ చేసుకుని తాగుతూ ఉంటారు.
మరొకవైపు మహేంద్ర రెడీ అవుతుండగా వసుధార సంతోషంగా మహేంద్ర దగ్గరికి వెళ్లి ఒకసారి ఇటు తిరుగు మహేంద్ర అనగా ఏంటి మేడం చాలా హుషారుగా కనిపిస్తున్నారు అని అంటాడు మహేంద్ర. అప్పుడు మహేంద్ర నోట్లు చక్కెర పోయగా ఎందుకు ఈ సంతోషం రిషి,వసుధార గురించే కదా అనగా అవును మహేంద్ర అని అంటుంది. నా కొడుకు పెళ్లి గురించి సంతోషపడుతున్నాను అక్కయ్య నోరు మూయించాడు కదా అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మహేంద్ర అనగా రిషి పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే ఇంకా బాగుంటుంది అనడంతో అంతకంటే సంతోషం మరి ఏముంటుంది.
కానీ రిషి నాకు ఆ అవకాశాన్ని ఇవ్వడు అదృష్టమంతా అక్కయ్యదే అని బాధపడుతూ ఉంటుంది జగతి. అప్పుడు మహేంద్ర ఊరుకో జగతి అని మహేంద్ర ఓదారుస్తూ ఉంటాడు. మరొకవైపు వసుధార రిషి ఇద్దరు కారులో ప్రయాణిస్తూ ఉంటారు. థాంక్యూ సార్ నా భయాన్ని అర్థం చేసుకున్నందుకు అనడంతో భయం మాత్రమే కాదు అని అర్థం చేసుకుంటాను అని అంటాడు రిషి. అప్పుడు వాళ్ళిద్దరూ సరదాగా ప్రేమగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ తర్వాత రిషి వసుధర కాలేజీకి వెళ్లగా అప్పుడు కాలేజీలో ఫ్యాకల్టీ సార్ నిన్న రాత్రి అయితే గొడవ జరిగిందట కదా సార్ మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారంటే కదా అనడంతో మీకెవరు చెప్పారు అనగా ఇదిగోండి సార్ పేపర్లో వేశారు అని పేపర్ చూపించగా అది చూసి వసుధర రిషి షాక్ అవుతారు.
మరొకవైపు మహేంద్ర ఫణింద్ర జగతి వాళ్ళు పేపర్లో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి రిషి కోపంగా వస్తాడు. ఇకనైనా మారతారు ఏమో అనడంతో ఇది చూసినా వాళ్ళు బుద్ధి ఇచ్చుకుంటారేమో అని అంటాడు మహేంద్ర. ఆ తర్వాత మినిస్టర్ ఫోన్ చేసి ఏమైంది రిషి అని అడగగా రిషి జరిగింది మొత్తం వివరిస్తాడు. మరి వాళ్లపై యాక్షన్ తీసుకోమంటావా అనగా వద్దు సార్ స్టూడెంట్స్ జీవితంలో నాశనం అవుతుంది అని అంటాడు రిషి. ఇంట్లో అందరూ హాల్లో కూర్చోగా అప్పుడు టీవీ ఆన్ చేయడంతో మినిస్టర్ రిషి గురించి రిషి కాలేజీ గురించి గొప్పగా చెబుతూ ఉండగా అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు.