- Home
- Entertainment
- శోభన్ బాబు తర్వాత అంతటి స్టార్ ఆయనే..జూ.ఎన్టీఆర్, బాలయ్య మధ్య గొడవకి కారణం, రాజీకి ప్రయత్నం
శోభన్ బాబు తర్వాత అంతటి స్టార్ ఆయనే..జూ.ఎన్టీఆర్, బాలయ్య మధ్య గొడవకి కారణం, రాజీకి ప్రయత్నం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ నుంచి మరిన్ని పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 రిలీజ్ కాబోతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ నుంచి మరిన్ని పాన్ ఇండియా మూవీస్ రాబోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 రిలీజ్ కాబోతోంది. మరోవైపు తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీ మధ్య సఖ్యత సరిగ్గా లేదని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ కి బలం చేకూరేలా సంఘటనలు జరుగుతున్నాయి. చివరగా అన్ స్టాపబుల్ షోలో డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన అన్ని చిత్రాల గురించి చర్చించారు. కానీ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రాన్ని మాత్రం పక్కన పెట్టారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ ఈనాటిది కాదు.
నాన్నకు ప్రేమతో చిత్ర సమయంలోనే దీని గురించి చర్చ జరిగింది. ఈ మూవీలో జగపతి బాబు విలన్ పాత్రలో నటించారు. 2014లో బాలయ్య లెజెండ్ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించింది నాన్నకు ప్రేమతో చిత్రంలోనే. దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలో జగపతి బాబు శోభన్ బాబు తర్వాత అంతటి స్టార్ అని అభివర్ణించారు. శోభన్ బాబు తర్వాత ఆయనే, అందులో తిరుగులేదు. శోభన్ బాబు తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని జగపతి బాబు మెప్పించారు.
అంతటి స్టార్ హీరో బాలయ్య బాబాయ్ కి విలన్ గా నటించడం చూసి ఆశ్చర్యపోయా. లెజెండ్ సినిమాలో వీరిద్దరి సన్నివేశాలు చూస్తూ మైమరచిపోయాం. నాన్నకు ప్రేమతో చిత్రం విలన్ కోసం సుకుమార్ కి మాకు చర్చ జరుగుతోంది. నేను జగపతి బాబు గారి పేరు ప్రస్తావించాను. వెంటనే సుకుమార్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని అన్నారు. బాలయ్య బాబాయ్ తో చేసారు కానీ మన సినిమాకి జగపతి బాబు గారు చేస్తారా అనే చిన్న సందేహం.. కానీ ఏదో నమ్మకం. ఆ విధంగా ఆయన్ని అప్రోచ్ కావడం జరిగింది అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. నేను ప్రతి హీరోతో బావుంటాను, ఎవరితో ఎలాంటి సమస్య లేదు. తారక్ రూమ్ లోకి వెళ్లి కూర్చుని మాట్లాడేంత చనువు ఉంది. నాన్నకి ప్రేమతో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక కీలక అంశం గురించి చర్చ జరిగింది. నేనే తారక్ కి అడిగాను. బాలయ్య ఏంటి సమస్య అని ప్రశ్నించాను. ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా, గొడవకి కారణం ఏంటి అని అడిగాను. వీళ్లిద్దరి కలసి ఉండాలనే ఉద్దేశంతోనే అడిగాను. తారక్ చాలా క్లియర్ గా సమాధానం ఇచ్చారు. ఆయనతో నాకేంటి ప్రాబ్లెమ్, అసలు సమస్య ఏంటో కూడా నాకు తెలియదు. నా తండ్రి సోదరుడు ఆయన.. ఆయనతో నేనెందుకు గొడవ పెట్టుకుంటాను ?
నేను ఎప్పుడూ అన్ని విషయాలకు ఓపెన్ గా ఉంటాను అని తారక్ తెలిపారు. తారక్ తన మైండ్ లో చాలా క్లియర్ గా ఉన్నారు. అది నాకు నచ్చింది. ఎలాంటి సమస్య లేనప్పుడే అంత క్లియర్ గా ఉంటారు అని జగపతి బాబు తెలిపారు. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయాలనే జగపతి బాబు ఈ అంశం గురించి ఎన్టీఆర్ తో చర్చించారు.