మద్యం బాటిల్ తో కశ్మీర్ లో పోలీస్ స్టేషన్ వరకు, రెప్పపాటులో చావు నుంచి జగపతి బాబు ఎస్కేప్..ఫ్రెండ్ లవ్ కోసం
జగపతి బాబు కెరీర్ బిగినింగ్ లో ఫ్యామిలీ చిత్రాలు చేశారు. కానీ ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ మాత్రం రెబల్ అని చెప్పొచ్చు. తనకి నచ్చినట్లు బతకాలని భావించే వ్యక్తి. సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు విలన్ రోల్స్ లో అదరగొడుతున్నాడు.
Actor Jagapathi Babu
జగపతి బాబు కెరీర్ బిగినింగ్ లో ఫ్యామిలీ చిత్రాలు చేశారు. కానీ ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ మాత్రం రెబల్ అని చెప్పొచ్చు. తనకి నచ్చినట్లు బతకాలని భావించే వ్యక్తి. సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు విలన్ రోల్స్ లో అదరగొడుతున్నాడు. విలన్ గా తన మాస్ యాంగిల్స్ బయటపెడుతున్నాడు. ఒకప్పుడు ఆస్తులు పోగొట్టుకుని జగపతి బాబు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో మంచి రెమ్యునరేషన్ అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరు.
రియల్ లైఫ్ లో జగపతి బాబు చాలా మొండిగా ఉంటారట. ఫ్రెండ్స్ కోసం అంతే ప్రాణాలు పెట్టేస్తారు. జగపతి బాబు లైఫ్ లో నిజంగానే అలాంటి సంఘటన జరిగింది. గతంలో జగపతి బాబు తన చిత్ర షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లారు. శ్రీనగర్ లో షూటింగ్ జరుగుతోంది. ఆ టైంలో ఆ చిత్రానికి పనిచేసే వ్యక్తుల్లో ఒకరు కశ్మీర్ ముస్లిం అమ్మాయిని ప్రేమించారట. అదే టైంలో శ్రీనగర్ మొత్తంఆర్మీ కాల్పులతో గందరగోళంగా ఉంది. కొందరు ముస్లిమ్స్ పట్టుకునితిరుగుతున్నారు . కర్ఫ్యూ విధించారు.
తన ఫ్రెండ్ ని రక్షించడానికి జగపతి బాబు సాహసం చేశారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తన ఫ్రెండ్ ని సేఫ్ గా పోలీస్ స్టేషన్ కి తరలించాలి. అక్కడ జరిగే కాల్పుల నుంచి తప్పించుకోవాలన్నా, ధైర్యం కావాలన్నా నేను మద్యం తాగాలి. అందుకే చేతిలో మందు బాటిల్ పట్టుకుని వాడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లా. పోలీసులు మమ్మల్ని సేఫ్ గా ఎయిర్ పోర్ట్ కి తరలించారు. మేము ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న 5 నిమిషాల తర్వాత ఆ పోలీస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేసినట్లు జగపతి బాబు తెలిపారు.
అలా తాను చావు నుంచి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా నేను రిస్క్ చేయడం ఆపను. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాను. ఎందుకంటే అందులోనే నాకు కిక్కు ఉంది అని జగపతి బాబు అన్నారు.
జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో లెజెండ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం,గూఢచారి, శ్రీమంతుడు లాంటి చిత్రాలతో అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.