చిరు, నాగార్జున తర్వాత ఆ రేంజ్ లో ఆస్తి ఉండాల్సిన హీరో..ఒక్క బ్రోకర్ వల్ల 1000 కోట్లు మాయం, ఓపెన్ గా చెబుతూ
టాలీవుడ్ లో 90 దశకంలో ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో జగపతి బాబు ఒకరు. కుటుంబ కథా చిత్రాలకు ఆయన బ్రాండ్ అయ్యారు. అదే విధంగా నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో అనే గుర్తింపు తెచ్చుకున్నారు.
Nagarjuna Akkineni
టాలీవుడ్ లో 90 దశకంలో ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో జగపతి బాబు ఒకరు. కుటుంబ కథా చిత్రాలకు ఆయన బ్రాండ్ అయ్యారు. అదే విధంగా నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో అనే గుర్తింపు తెచ్చుకున్నారు. వయసు పెరిగే కొద్దీ హీరోగా హవా తగ్గుతుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ వేషాలు మొదలు పెట్టారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో జగపతి బాబు అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరు. విలన్ గా మంచి పారితోషికం తీసుకుంటున్నారు కాబట్టి జగపతి బాబు బాగానే సంపాదిస్తున్నారు. కానీ జగపతి బాబు ఆర్థిక స్థితి ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. ఆస్తుల విషయంలో జగపతి బాబు చిరంజీవి, నాగార్జున లాంటి టాప్ హీరోల స్థాయిలో ఉండాల్సింది. ఒకప్పుడు అంతలా సంపాదించారు కూడా.
Actor Jagapathi Babu
జగపతి బాబే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ నా ఆస్తులు లెక్క వేసుకుంటే 1000 కోట్ల నెట్ వర్త్ ఉండాల్సింది. మొత్తం పోగొట్టుకున్నా అని హాట్ కామెంట్స్ చేశారు. జగపతి బాబు క్యాసినో ఆడడం వల్లే ఆస్తులు పోగొట్టుకున్నట్లు ఇండస్ట్రీలో ఒక ప్రచారం ఉంది. అయితే జగపతి బాబు ఆ వాదనని ఖండించారు. క్యాసినో నాకు ఒక ఎంటర్టైన్మెంట్. దానివల్ల అన్ని కోట్లు పోగొట్టుకున్నా అనేది అబద్దం.
అంత ఆస్తి ఎలా పోయింది అని యాంకర్ అడగగా.. జగపతి బాబు సమాధానం ఇచ్చారు. కొంత డబ్బు లెక్క లేకుండా ఇచ్చేశాను. కొందరు వ్యక్తులు కొట్టేశారు. కానీ వాళ్ళని నేను బ్లేమ్ చేయను.. ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉండిఉంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండేది కాదు అని జగపతి బాబు అన్నారు. ఒక బ్రోకర్ జగపతి బాబుని మోసం చేశాడు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.. దీనిపై జగపతి బాబు మాట్లాడుతూ ఒకడే కాదు అలా చాలా మంది ఉన్నారు అని తెలిపారు.
నన్ను వాడుకున్న వాళ్ళు ఉండొచ్చు, నా చేతగాని తనం అయి ఉండొచ్చు మొత్తంగా నా డబ్బు పోయింది. డబ్బు పోయాక నా ఫ్యామిలీకి ఓపెన్ గా చెప్పేశా.. నేను ఇకపై 30 కోట్లు సంపాదించగలుగుతా. ఎందుకంటే మన అవసరాలకు ఆ డబ్బు బాగా సరిపోతుంది. అంతకి మించి వస్తే అది బోనస్. కానీ మీరు 30 కోట్లకి మించి ఆశించవద్దు అని భార్య పిల్లలకు చెప్పినట్లు జగపతిబాబు ఓపెన్ కామెంట్స్ చేశారు. ఫ్లైట్ టికెట్స్, జల్సాలు, రెస్టారెంట్స్ ఇవ్వన్నీ లెక్క వేసుకుని టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పుడు 30 కోట్లకి మించి సంపాదన వస్తోంది అని జగపతి బాబు తెలిపారు.
ఇండస్ట్రీలో డబ్బుని కరెక్ట్ గా వాడుకునే వ్యక్తి నాగార్జున మాత్రమే. డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలో అంత ఇస్తాడు.. మనుషులకు ఎంత విలువ ఇవ్వాలో ఇస్తాడు.. ఫ్యామిలీకి ఎంత టైం కేటాయించాలో కేటాయిస్తారు. డబ్బుని ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా సంపాదించాలి అని విషయంలో నాగార్జున పర్ఫెక్ట్ అంటూ జగపతి బాబు కామెంట్స్ చేశారు.