MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jabardasth Vinod: జబర్థస్త్ వినోద్ కు చేతబడి చేశారా..? వినోదిని మాటల్లో నిజమెంత..? ఇలా అయిపోయాడేంటి

Jabardasth Vinod: జబర్థస్త్ వినోద్ కు చేతబడి చేశారా..? వినోదిని మాటల్లో నిజమెంత..? ఇలా అయిపోయాడేంటి

జబర్థస్త్ వినోదిని అలియాస్ వినోద్ కు ఏమయ్యింది.. ? అతను గుర్తు పట్టకుండా అయిపోవడానికి కారణం ఏంటీ..? వినోద్ కు అసలేమయ్యింది. అతను ఏమంటున్నాడు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 15 2023, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jabardasth Vinodh

Jabardasth Vinodh

జబర్దస్ కామెడీ షో ద్వారా ఎంతో మందికి గుర్తింపు వచ్చింది. ఎక్కడో మూలన ఉన్నవారికి మంచి ప్లాట్ ఫామ్ అయ్యింది జబర్థస్త్. సామాన్యులను సెలబ్రిటీలను చేసింది జబర్థస్త్. అలానే  గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోదిని  అలియాస్ వినోద్ కూడా  ఒకరు. లేడీ గెటప్స్ తో బాగా గుర్తింపు సాధించాడు వినోద్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

వినోద్ లేడీ గెటప్ వేస్తే.. ఆడవారు కూడా కుళ్లుకునేవారు. అంతే కాదు గెస్ట్ లు గా వచ్చిన సెలబ్రిటీలు కూడా వినోదిని అందానికి ముగ్ధులైపోయేవారు. కొంత మంది అయితే అమ్మాయా.. లేక లేడీ గెటప్ ఆ అని.. కన్ ఫ్యూజ్ అయ్యేవారు. అయితే జబర్థస్త్ వల్ల స్టార్ డమ్ తో పాటు.. బాగా సంపాదించుకున్న వినోద్... ఆతరువాత కెరీర్ లో ఎన్నో కుదుపులు ఫేస్ చేశాడు. కొన్ని కష్టాలు పడ్డాడు. అయినా సెట్ అయ్యాడు అనుకునే టైమ్ లో..మళ్లీ ఇబ్బందుల్లో పడ్డాడు వినోద్. 
 

37

 తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తానుపడుతున్న ఇబ్బందులు, కష్టనష్టాలను చెప్పుకుని బాధపడ్డాడు వినోద్. గతంలో ఇంటి విషయంలో కొంత మంది అతన్ని కొట్టగా.. అది పెద్ద వివాదం అయ్యింది. దాని తరువాత వినోద్ మళ్ళీ కోలుకుని.. పెళ్లి చేసుకుని.. ప్రోగ్రామ్స్ చేసుకుంటూ.. వచ్చాడు. కాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పడుతున్న ఇబ్బందులు  ఏకరవు పెట్టాడు. 

47

ముఖ్యంగా తాను రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అతను వెల్లడించాడు.  తన ఆరోగ్యం బాగాలేనప్పుడు జబర్దస్త్‌లోని సహ నటులైన చమ్మక్ చంద్ర, అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ వంటివారందరూ తనకు సాయం చేసి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. అయితే, తనంత తానుగా ఎవరినీ సాయం అడగలేదని పేర్కొన్నాడు. 
 

57

తన అనారోగ్యం గురించి తెలుసుకుని వారే ముుందుకు వచ్చి సాయం అందించారన్నాడు వినోద్. తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి మంత్రి రోజా కూడా సాయం చేశారంటున్నాడు వినోద్. అనారోగ్యంతో బాధపడిన వినోద్..  ప్రస్తుతం కోలుకుంటున్నట్టు వెల్లటించారు. ఇంకాస్త ఆరోగ్యం కుదుటపడిన తరువాత  ఈవెంట్స్ చేయడంతోపాటు త్వరలోనే జబర్దస్త్ షోకి తిరిగి వస్తానని వెల్లడించాడు. 
 

67

అంతే కాదు మరికొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించాడు వినోద్. తన  ఆరోగ్యం బాగాలేకపోవడానికి చేతబడి కారణమనే అనుమానం వస్తుందన్నారు. దానికి సబంధించి కూడా కొన్ని పూజలు చేయించినట్టు వినోద్ వెల్లడించాడు. అంతే కాదు దానిని కూడా చాలా ఖర్చుు అయ్యిందన్నారు. అటు హాస్పిటల్ కు..పూజలకు కలిపి.. 3 లక్షల వరకూ ఖర్చుక అయ్యిందన్నారు. 

77

ఇప్పటికైతే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించాడు. ఇంటి కోసం జరిగిన గొడవలో తన చేయి విరిగిందని వాపోయాడు. ఓ విషయంలో హామీగా ఉండడం ద్వారా రూ. 5 లక్షలు నష్టపోయానని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాకపోతే అనారోగ్యం కారణంగా వినోద్ చాలా తగ్గిపోయి.. పేలగా తయారయ్యాడు. మునుపటి వినోద్ కు.. ఇప్పటి వినోద్ కు చాలా తేడా కనిపిస్తోంది. వినోద్ ను ఇలా చూసి.. జబర్థస్త్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. బాధపడుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved