ప్రాణం పోయేవరకూ నీతోనే అంటూ ప్రపోజ్ చేసిన జబర్దస్త్ వర్ష.. ఇమ్మూ రియాక్షన్ ఏంటీ..?
జబర్ధస్త్ షోకి బ్యూటీ క్వీన్ గామారిపోయింది వర్ష. యాంకర్స్ రష్మి, అనసూయను కూడా మించిపోయిన వర్ష.. స్టేజ్ మీద రెచ్చిపోతోంది. రీసెంట్ గా తన మనస్సులోని మాటను కో ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయేల్ కు చెప్పేసింది.

జబర్ధస్ట్ స్టేజ్ మీద ఎప్పటి నుంచో లవ్ ట్రాక్ లు వర్కౌట్ అవుతూనే ఉన్నాయి. రష్మి- సుధీర్ ల జంటతో మొదలై.. అలా కొత్త జంటలు పెరుగుతూనే ఉన్నారు. అయితే స్క్రీన్ మీద రష్మి-సుధీర్ తరువాత బాగా వర్కౌట్ అయిన హిట్ పెయిర్ మాత్రం వర్ష- ఇమ్మాన్యుయేల్ జంటే.
ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక స్పెషల్ చూపిస్తారు వీరిద్దరు. గ్లామర్ పరంగా ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉన్నా.. హిట్ పెయిర్ గా జబర్ధస్త్ లో టాప్ పోజిషన్స్ లో ఉన్నారు వీరిద్దరు. ఇక వీరిద్దరి మధ్య అప్పుడప్పుడు జరిగే ఫన్నీ స్క్రిట్స్.. రొమాన్స్.. షో రేటింగ్ ను అమాంతం పెంచేస్తుంది. దాంతో అప్పుడప్పుడు వీరి వర్ష- ఇమ్మాన్యుయేల్ రెచ్చి పోయి పర్ఫామెన్స్ ఇస్తుంటారు.
ఇక రీసెంట్ గా ఇమ్మూకి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది వర్ష. నా ప్రాణం పోయేవరకూ నా హృదయంలో నువ్వు ఉంటావు అంటూ హార్ట్ సింబల్ ..తో ఇమ్మాన్యుయేల్ కు ప్రపోజ్ చేసేసింది. నువ్వు నాకు ఎంతో స్పెషల్ అంటూ వర్ష ప్రపోజ్ చేయడంతో దిల్ ఖుష్ అయ్యాడు ఇమ్మాన్యూయేల్.
వర్ష ఇలా ప్రపోజ్ చేయడంతో ఆనందం తట్టుకోలేకపోయాడు ఇమ్మాన్యయేల్. వెంటనే తాను కూడా ప్రపోజ్ చేవాడు. ఓ చిన్న డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు ఇమ్మూ. అందకే అంటుంటారు ప్రేమించడం కాదు.. ప్రేమించబడటం గొప్పా అంటూ.. మోకాళ్ళ మీద నించుని..నువ్వు నాకు దొరకడంతో నేను చాలా లక్కీ అంటూ ప్రపోజ్ చేశాడు ఇమ్మాన్యుయేల్.
జబర్ధస్త్ లో వర్ష- ఇమ్మాన్యుయేల్ జంటకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్క్రీన్ మీద వీరిద్దరి పెయిర్ కోసం ఎదురు చూస్తుంటారు జనాలు. వీరిమధ్య సాగే ఫన్నీ సీన్స్.. టైమింగ్ ప్రకారం పడే పంచులంటే పడిచస్తుంటారు ఆడియన్స్.
ఇక ముఖ్యంగా వర్ష జబర్ధస్త్ యువరాణిలా మారిపోయింది. ఇద్దరు యాంకర్స్ ఉన్నా.. వారిని మించి పోయిన బ్యూటీతో ఆకట్టకుంటుంది వర్ష. సన్నగా మల్లెతీగలా ఉండే ఈ బ్యూటీ.. ఇటు జబర్ధస్త్ షో చేసుకుంటూనే.. అటు సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతోంది.
ఇటు జబర్ధస్ లోనే కాకుండా సోషల్ మీడియా పరంగా కూడా వర్షకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వర్ష ఫోటో షూట్ కోసం ఎదురుచూసే ఫ్యాస్ కూడా చాల మంది ఉన్నారు. ఇటు జబర్ధస్త్ షోకి.. అటు సోషల్ మీడియా ఫోజులకు వరుసబెట్టి కామెంట్స్ చేస్తుంటారు ఫ్యాన్స్.