- Home
- Entertainment
- వర్షది లేడీ గెటప్ అంటూ ఇమ్మాన్యుయెల్ కామెంట్.. నీ అసలు రూపం ఇదే, ఏడుస్తూ షో నుంచి వెళ్లిపోయిన జబర్దస్త్ నటి
వర్షది లేడీ గెటప్ అంటూ ఇమ్మాన్యుయెల్ కామెంట్.. నీ అసలు రూపం ఇదే, ఏడుస్తూ షో నుంచి వెళ్లిపోయిన జబర్దస్త్ నటి
`జబర్దస్త్`లో ఇమ్మాన్యుయెల్, వర్షల మధ్య కెమిస్ట్రీ గురించి అందరికి తెలిసిందే. రష్మి-సుధీర్ తర్వాత ఆ స్థాయిలో పాపులర్ లవ్ స్టోరీ వీరి మధ్యే నడుస్తుంది. తాజాగా వర్షపై ఇమ్మాన్యుయెల్ చేసిన కామెంట్ సంచలనంగా మారాయి. దీంతో ఏడుస్తూ షో నుంచి వెళ్లిపోయింది వర్ష. ఆ వివరాలు చూస్తే..

`జబర్దస్త్`(Jabardasth), `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోస్ లో జరిగేవి ఏవీ స్కిప్ట్ కాదని, టీఆర్‌పీ కోసం కాదని, అవి రియల్‌గానే జరుగుతాయని ఇటీవల నటి ఇంద్రజ తెలిపారు. ఆమె కొన్ని రోజులు `జబర్దస్త్`కి, ప్రస్తుతం `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ లెక్కన ఆర్టిస్టుల మధ్య లవ్ స్టోరీస్ కూడా నిజమే అనే విషయాన్ని పరోక్షంగా ఆమె హింట్ ఇచ్చినట్టయ్యింది. అలా `జబర్దస్త్` వర్ష(Varsha), ఇమ్మాన్యుయెల్(Immanuel) మధ్య లవ్ ట్రాక్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా వీరిమధ్య ఉన్న మనస్పర్థాలు బయటపడ్డాయి. వర్షపై ఇమ్మాన్యుయెల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వర్షని అమ్మాయి కాదంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీంతో వర్ష ఏకంగా షో నుంచే వెళ్లిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ నీ నిజ స్వరూపం బయటపడిందంటూ ఆమె షో నుంచి వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా హోళీ పండుగ సందర్భంగా `ఈటీవీ`లో చేసిన స్పెషల్ ప్రోగ్రామ్ `రంగ్ దే`(Rang de)లో జరిగింది.
హోళీ పండుగ సందర్భంగా మల్లెమాల వారు `రంగ్‌దే` పేరుతో ఈ స్పెషల్ ఈవెంట్ చేశారు. ఇందులో జబర్దస్త్ కమెడీయన్లంతా పాల్గొన్నారు. పండుగ వాతావరణం తెచ్చేలా, రంగురంగులతో కలర్‌ఫుల్‌గా దీన్ని డిజైర్ చేశారు. ఇందులో హైపర్ ఆది పంచులు ఎప్పటిలాగే హైలైట్ అయ్యాయి. అయితే అటు అమ్మాయి, ఇటు అబ్బాయి కూర్చొని ఒకరిపై ఒకరు కామెంట్లు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు.
ఈ క్రమంలో ఆడవాళ్లు లీడ్‌లో ఉన్నారు. రంగులు వాళ్లకే ఇవ్వాల్సి వస్తుందేమో అని హోస్ట్ గా లీడ్ చేస్తున్న హైపర్ ఆది అన్నారు. దీంతో వాళ్లకి అంత సీనే లేదని ఇమ్మాన్యుయెల్ అనగా, మూతి పగులుంది అని సావిత్రి అన్నది. దీంతో మీ మోహాళ్లే అంటూ రెచ్చిపోయాడు ఇమ్ము. అక్కడ నీ వర్ష కూడా ఉందని హైపర్ ఆది అనగా, ఆ మోహాన్ని కూడా అంటున్నా, ఏం చేసిందని, నిజానికి వర్ష అక్కడ ఉండాల్సింది కాదు, ఇక్కడ ఉండాలి. ఆమె కూడా మొగోళ్లాగే ఉంటుంది కాబట్టి అని నవ్వుతూ అన్నాడు.
కానీ దాన్ని వర్ష తీసుకోలేకపోయింది. అందరిముందు అలా అనేసరిగా చాలా హర్ట్ అయ్యింది. మొహం మాడిపోయింది. దీనికి స్పందించిన భాస్కర్ మరింత ఉప్పు జల్లాడు. మాటి మాటికి ఆ పదం వాడకురా. అబ్బాయంటున్నారు బయట. మా ఆవిడే అడిగింది. లేడీ గెటప్పా అని` అంటూ భాస్కర్ సైతంకామెంట్ చేయడంతో మరింతగా హర్ట్ అయ్యింది. బాధ, ఆవేశం, కోపం ఆమెలో కలగలిపి వచ్చేశాయి.
మాట్లాడొచ్చు కానీ, మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకుని మాట్లాడు అంటూ స్టేజ్ నుంచి దిగిపోయింది. దీంతో లీడ్ చేస్తున్న రాంప్రసాద్, హైపర్ ఆది ఆపే ప్రయత్నం చేశాడు. సరదాగా అన్నాడని చెప్పినా ఆమె వినలేదు. బాగా హర్ట్ అయ్యింది. ఒక్కసారి, రెండు సార్లు, కానీ ప్రతి సారి మొగోడు మొగోడు అంటున్నారని ఆవేదన చెందింది. కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో దిగొచ్చిన ఇమ్మాన్యుయెల్ మొక్కుబడిగా సారీ చెప్పాడు.
కానీ దానికది సరిపోలేదు. రాంప్రసాద్ కూడా ఆమెకి కన్విన్స్ చేయమని చెప్పగా, ఇమ్ము వినలేదు. నేను సారీ ఎందుకు చెప్పాలంటూ రెచ్చిపోయాడు. సారీ చెప్పాల్సిన అవసరం ఏంటని, నన్ను ఎన్ని సార్లు అనలేదని ఆయన మండిపడ్డాడు. దీనికి వర్ష రియాక్ట్ అవుతూ మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే ఎవరూ పడరు ఇక్కడ అంటూ ఫైర్ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య కాస్త హోరాహొరిగా గొడవ జరిగింది.
దీంతో మరింత ఆవేదన చెందిన వర్ష ఏకంగా షో నుంచే వెళ్లిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె షో నుంచి వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇదంతా `రంగ్ దే` లేటెస్ట్ ప్రోమోలోని సన్నివేశాలు. ఆసక్తి, సస్పెన్స్ రేకెత్తిస్తున్న ఈ సన్నివేశాల్లో నిజమెంతా? స్క్రిప్ట్ ఎంత అనేది పూర్తి షో చూస్తే గానీ అర్థం కాదు. ఈ షో ఈ నెల 20న ఈటీవీలో ప్రసారం కాబోతుంది.