- Home
- Entertainment
- పెళ్లి కూతురు ముస్తాబులో మెరిసిపోతున్న వర్ష.. సిగ్గుతోనే చంపేస్తున్న ‘జబర్దస్త్’బ్యూటీ!
పెళ్లి కూతురు ముస్తాబులో మెరిసిపోతున్న వర్ష.. సిగ్గుతోనే చంపేస్తున్న ‘జబర్దస్త్’బ్యూటీ!
పెళ్లికూతురు ముస్తాబులో జబర్దస్త్ వర్ష (Varsha) నెటిజన్ల గుండెల్ని కొల్లగొడుతోంది. కొంటె పోజులతో కలవరపెడుతోంది. తాజాగా పంచుకున్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

బుల్లితెరపై అందాల ప్రదర్శిస్తూ జబర్దస్ వర్ష చేస్తున్న రచ్చ తెలిసిందే. పాపులర్ కామెడీ షోతో Jabardasth నటిగా వర్ష టీవీ ఆడియెన్స్ కు బాగానే పరిచయం అయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సండి చేస్తోంది. అదిరిపోయే ఫొటోషూట్లతో నెట్టింట రచ్చరంభోలా చేస్తోంది.
కండ్లు చెదిరే అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అట్రాక్టివ్ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ట్రెడిషనల్ లోనూ వయ్యారాలను వడ్డిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా స్టన్నింగ్ పోజులతో మతులు పోగొడుతోంది.
తాజాగా వర్ష ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. పట్టుచీర, ఆకర్షణీయమైన నగలు ధరించి పెళ్లి కూతురిలా ముస్తాబైంది. సంప్రదాయ దుస్తుల్లో వర్ష నిండుచందమామలా వెలిగిపోతోంది. దానికితోడు తన రూపసౌందర్యంతోనూ మరింతగా మెరిసిపోతోంది.
సంప్రదాయ దుస్తుల్లో వర్ష ఇంత అందంగా దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు సైతం వర్ష గ్లామర్ మెరుపులకు మంత్రముగ్ధులవుతున్నారు. వధువులా మారి సిగ్గుపడుతూ ఫొటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బుల్లితెరపై సందడి చేయడమే కాకుండా ఇలా ఇంటర్నెట్ లోనూ రచ్చరచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మరోవైపు నెటిజన్లు కూడా యంగ్ బ్యూటీ గ్లామర్ ఫీస్ట్ ను పొగుడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.
మరోవైపు నటుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్‌తో వర్ష రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కొన్నాళ్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో ఎంత వరకు నిజమున్నదనేది తెలియాల్సి ఉంది. కానీ, దీనిపై వస్తున్న రూమర్లు మాత్రం వర్షకు మంచి పాపులారిటీని తెచ్చిపెడుతున్నాయి.