- Home
- Entertainment
- ఇమ్మానియేల్ అనుమానం నిజమే... తన కొత్త లవర్ ని పరిచయం చేసిన వర్ష, కుర్రాడు జబర్దస్త్ గా ఉన్నాడు!
ఇమ్మానియేల్ అనుమానం నిజమే... తన కొత్త లవర్ ని పరిచయం చేసిన వర్ష, కుర్రాడు జబర్దస్త్ గా ఉన్నాడు!
జబర్దస్త్ వర్ష కొన్నాళ్లుగా ఒక యంగ్ ఫెలోతో ఎఫైర్ నడుపుతున్నారన్న ప్రచారం ఉంది. అది నేడు రుజువైంది. వర్ష తన ప్రేమికుడిని పరిచయం చేసింది.

Jabardasth Varsha
బుల్లితెర స్టార్స్ లో వర్ష ఒకరు. ఈ స్లిమ్ బ్యూటీ తెలియని ప్రేక్షకుడు లేడు. ఇమ్మానియేల్ లవర్ గా ప్రచారం అవుతున్న వర్ష కొత్త అబ్బాయిని వెతుక్కుందని పుకారు లేచింది. ఊహాగానాలు నిజం చేస్తూ ఎట్టకేలకు తన లవర్ ని పరిచయం చేస్తూ ఓ ఎమోషనల్ వీడియో చేసింది.
Jabardasth Varsha
వర్ష ప్రేమికుడు జబర్దస్త్ గా ఉన్నాడు. ముద్దుగా బొద్దుగా వర్షకు సరైన జోడీ అని చెప్పాలి. వీడియో చూసిన వర్ష అభిమానులు మీ జంట సూపర్ అంటున్నారు. అయితే లవర్ ఫేస్ పూర్తిగా రివీల్ చేయలేదు. దీంతో అతగాడెవరో మొత్తంగా చూపించొచ్చుగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Jabardasth Varsha
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వర్ష-ఇమ్మానియేల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి హైపర్ ఆది కారణమయ్యాడు. వర్ష వేరొక వ్యక్తితో రీల్స్ చేసిందని ఇమ్మానియేల్ కి ఆది చెప్పాడు. ఛస్తే చేయదు. నేను నమ్మను అని ఇమ్మానియేల్ అన్నాడు. దాంతో చూడు అంటూ... వర్ష ఓ అజ్ఞాత వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వీడియోలు వేదిక మీద ప్లే చేశాడు.
Jabardasth Varsha
ఆ వీడియోలు చూసిన ఇమ్మానియేల్ గుండె బద్దలైంది. అప్పటి వరకు వర్ష వేరొకరితో వీడియోలు చేయదని చెప్పిన ఇమ్మానియేల్ నమ్మకం వమ్మయ్యింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇమ్మానియేల్ వర్షను నిలదీశాడు. ఎవడే వాడంటూ విరుచుకుపడ్డాడు. రియల్ లవర్ ఎవరు? వాడా నేనా? అని ఫైర్ అయ్యాడు.
Jabardasth Varsha
నా మీద నీకు అంత డౌట్ ఎందుకు ఇమ్మానియేల్ నీకు అని వర్ష అసహనం వ్యక్తం చేసింది. నిజంగానే ఈ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా వర్షా? అని ఎదురు ప్రశ్నించాడు ఇమ్మానియేల్. దీనంతటికీ కారణం నువ్వే అంటూ ఆది మీద పడ్డాడు. వర్ష-ఇమ్మానియేల్ మధ్య హైడ్రామా చోటు చేసుకుంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్లే చేసిన వీడియోలో వర్షతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో తేలిపోయింది. నిజానికి తాను కూడా వర్ష లవర్ కాదు. ఇమ్మానియేల్ మాదిరి జస్ట్ వ్యాంప్. ఇంస్టాగ్రామ్ వ్యూస్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తుంది. బుల్లితెర మీద హైప్ కోసం ఇమ్మానియేల్ లవర్ గా ప్రచారం అవుతుంది. ఇవ్వన్నీ కెరీర్ కోసం ప్లే చేసే ట్రిక్స్ మాత్రమే.