జబర్థస్త్ వర్ష మంచి మనసు.. వాచ్ మెన్ కుటుంబాన్ని ఆదుకున్న బ్యూటీ..
అందానికి అందం.. కామెడీతో పాటు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది జబర్థస్త్ బ్యూటీ వర్ష. ఈ బుల్లితెర సెలబ్రిటీ.. తాజాగా ఓ ఫ్యామిలీకి చేసిన సహాయం గురించి మొదటి సారి నోరు విప్పింది.
కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా.. ఆతరువాత సినిమా నటిగా.. అడుగు పెట్టిన వర్ష.. ఆతరువాత బుల్లితెరపై అడుగు పెట్టింది. ముందుగా సీరియల్స్ ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ.. అటు నుంచి జబర్థస్త్ స్టేజ్ మీదకు చేరింది. అందం అభిమనయం తో పాటు.. కామెడీ సెన్స్ ఉందని నిరూపించుకున్న బ్యూటీ.. తాజాగా మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది.
Jabardasth Varsha
వర్షకు సినిమాలు, సీరియల్స్ ద్వారా రాని గుర్తింపును జబర్దస్త్ కామెడీ షో ద్వారా వచ్చింది. ముఖ్యంగా జబర్దస్త్‌లో ఇమ్మాన్యూయేల్ తో కాంబినేషన్ స్కిట్స్ అంటే.. ఇప్పటికీ జనాలకు క్రేజ్ ఎక్కువ. వరుస పంచ్ లతో.. కామెడీ పండించే వర్ష.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో.. వర్ష చేసే అరాచకం అంతా ఇంతా కాదు. ఇన్ స్టాలో వరుస ఫోటో షూట్లతో హడావిడి చేస్తుంది బ్యూటీ. అంతే కాదు హాట్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది బ్యూటీ.
Jabardasth Varsha
ఇక తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్ష.. యాంకర్ సర్ ప్రైజింగ్ గా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. అది కూడా తాను చేసిన ఓ సాయం గురించి రివిల్ చేసింది బ్యూటీ. మీరు ఒక వాచ్ మెన్ కొడుకుని చదివిస్తున్నారని వార్తలు వస్తున్నాయి అవి నిజమేన అని యాంకర్ అడగగా తను మాట్లాడుతూ.. అవును నిజమే ఒక అబ్బాయిని చదివిస్తున్నాను, వాచ్ మెన్ వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కాని అందులో ఒక్క బాబుని మాత్రమే వాళ్లు చదివిస్తున్నారు..
మరో బాబును చదివించే స్తోమత తనకు లేదు.. ఆ విషయం తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను వాళ్లకు చెప్పాను మీ అబ్బాయిని నేను చదివిస్తాను. ఎంత ఖర్చయిన పర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పాను. నేనావిషయం చెప్పినప్పుడు వాళ్లు చాలా సంతోషపడ్డారు. వాళ్లది పేద కుటుంబం. నా వంతుగా నాకు ఉన్నదాంట్లో ఏదో చిన్న సహాయం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. వర్ష చేస్తున్న మంచి పని గురించి తెలిసి నెటిజన్లు అభినందిస్తున్నారు. గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Jabardasth Varsha
ఇక షూటింగ్స్ చేసి ఇంటికి వచ్చే సరికి అలిసిపోయి ఉంటాను.. అప్పుడు ఆ బాబు వచ్చి..మేడం అంటూ.. పలకరిస్తాడు.. అప్పుడు ఎంత అలసిపోయినా.. ఆ అలసట తెలియదు.. అన్నిమర్చిపోతాను అంటుంది వర్ష. ఈ మధ్య బాగా బిజీ బిజీగా గడిపేస్తోంది బ్యూటీ. జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థ్స్త్ తో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ.. షూటింగ్స్ లో బిజీ బిజీగాఉంటుంది.
Jabardasth Varsha
అంతే కాదు ఈమధ్య సినిమా అవకాశాలు వస్తుండటంతో.. షూటింగ్స్ ఏమాత్రం గ్యాప్ లేకుండా పాల్గోంటోంది వర్ష. ఇక మీరు ఏ స్టార్ తో నటించాలని డ్రీమ్ గా పెట్టుకున్నారు అని యాంకర్ అడగ్గా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ గారికి సిస్టర్‌గా చేస్తాను అంటుంది. ఇక లవర్‌గా మాత్రం అల్లు అర్జున్ తో నటించాలని ఉందతి అంటోంది జబర్థస్త్ వర్ష.