- Home
- Entertainment
- ‘జబర్దస్త్’వర్ష డేరింగ్ ఫొటోషూట్.. లెహంగా వోణీలో అదిరిన వయ్యారాలు.. పూల మార్కెట్ లో రచ్చరచ్చ!
‘జబర్దస్త్’వర్ష డేరింగ్ ఫొటోషూట్.. లెహంగా వోణీలో అదిరిన వయ్యారాలు.. పూల మార్కెట్ లో రచ్చరచ్చ!
బుల్లితెర బ్యూటీ వర్ష అందాల విందుతో అదరగొడుతోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా లెహంగా వోణీ ధరించిన యంగ్ బ్యూటీ పూల మార్కెట్ లో డేరింగ్ గా ఫొటోషూట్ చేసి ఆకట్టుకుంది.

యంగ్ బ్యూటీ, జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) బుల్లితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ పరంగా ఓకే అనిపించుకుంటున్న ఈ బ్యూటీ స్మాల్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.
పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో ఫేమ్ సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం నెట్టింట తెగ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుని ఖుషీ చేస్తోంది.
తాజాగా వర్ష చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వరసగా అదిరిపోయే డ్రెస్సులు ధరిస్తూ ఫొటోలకు పోజులిస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. కుర్రకారుకు సండే ట్రీట్ గట్టిగానే ఇచ్చింది.
ఇప్పటికీ ఇండోర్ షూట్ కే పరిమితమైన వర్ష.. తాజాగా అవుట్ డోర్ ఫొటోషూట్ చేసి తన డేర్ నెస్ ను చూపించింది. ట్రెడిషనల్ వేర్ ధరించిన వర్ష కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. గ్రీన్ లెహంగా, వైట్ వోణీలో ఆకట్టుకుంటోంది.
ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్ష.. ఈసారి అవుట్ డోర్ షూట్ లో భాగంగా ఓ పూల మార్కెట్ లో రచ్చరచ్చ చేసింది. అల్లరి పనులతో మార్కెట్ లోని వారందరి చూపు తనపై పడేలా చేసింది. పూలదండలను తాకుతూ.. గులాబీలను గాల్లోకి ఎగరేస్తూ సందడి చేసింది.
వర్ష ఏకంగా మార్కెట్ లోనే స్వేచ్ఛగా తిరగడంతో స్థానికులు షాక్ అయ్యారు. ముద్దుగుమ్మ అందాలను తమ చరవాణిలో బంధించారు. మరికొందరు సెల్ఫీలు అడిగి వర్ష క్రేజ్ ను మరింత పెంచారు. కుర్ర చూపులన్నీ వర్షపైనే నిలిచాయి.
సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా తయారైన వర్ష.. వయ్యారాలతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది. మెరిసిపోయే అందంతో మార్కెట్ లో వెలుగులు నింపింది. కుర్ర భామా చిలిపి చేష్టలకు అంతా ఫిదా అయ్యారు. తాజాగా ఆ ఫొటోలనే నెట్టింట పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం బుల్లితెరపై వర్ష దూసుకెళుతున్నది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర ఈవెంట్లలోనూ తనదైన శైలి పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది. బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా పేరు దక్కించుకుంది. మరోవైపు ఇంటర్నెట్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.