MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఎక్స్ట్రాలో 'నా పెట్టే తాళం' పాటకి నేను ఒప్పుకోలేదు.. చివరకి ఏం చేశారంటే, జబర్దస్త్ సత్య వ్యాఖ్యలు వైరల్

ఎక్స్ట్రాలో 'నా పెట్టే తాళం' పాటకి నేను ఒప్పుకోలేదు.. చివరకి ఏం చేశారంటే, జబర్దస్త్ సత్య వ్యాఖ్యలు వైరల్

షూటింగ్ కి ఒకరోజు ముందు మాత్రమే సాంగ్ విన్నా. అప్పుడే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సమయంలో చేయలేనని చెప్పలేను. ఎందుకంటే షూటింగ్ కి అంతా రెడీ అయిపోయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 15 2023, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ దారుణమైన డిజాస్టర్ దిశగా వెళుతోంది. డిసెంబర్ 8న రిలీజైన ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కామెడీ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం పై అటు నితిన్, ఇటు వక్కంతం వంశీ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఒకటి రెండు ఫన్నీ సీన్స్ తప్పితే రచయితగా వక్కంతం వంశీ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఇక దర్శకుడిగా తీవ్రంగా నిరాశపరిచారు. నితిన్ తన భుజాలపై సినిమా మొత్తాన్ని మోసినప్పటికీ ఫలితం లేకపోయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వక్కంతం వంశీ రచన, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి. చాలా సిల్లీగా అనిపించే పాత్రలు, సన్నివేశాలతో విసిగించిన వక్కంతం వంశి విమర్శలు మూటగట్టుకున్నారు. 

36

నవ్వులు పూయిస్తాయి, వినోదం అందిస్తాయి అనుకున్న సన్నివేశాలు విమర్శలు వచ్చేలా చేశాయి. పల్సర్ బైక్ సాంగ్, గున్న గున్న మామిడి సాంగ్ తరహాలో పేలుతుంది అనుకుని రికార్డింగ్ డ్యాన్స్ లలో వేసే 'నా పెట్టే తాళం' పాటతో మరింతగా విసుగుపుట్టించారు. అది కూడా పోలీస్ స్టేషన్ లో  లేడీ కానిస్టేబుల్స్ పాత్రలతో ఈ సాంగ్ పెర్ఫామ్ చేయించడం పరాకాష్ట అనే చెప్పాలి. 

 

46

ఈ సాంగ్ లో పెర్ఫామ్ చేసింది ఎవరో కాదు జబర్దస్త్ సత్య. ఈ సాంగ్ విషయంలో సత్య తన అనుభవాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ కి మూడు రోజుల సమయం ఉండగా ఈ ఆఫర్ వచ్చిందట. ముందుగా సిట్యువేషన్ తగ్గ పాటలో డ్యాన్స్ చేయాలనీ చెప్పారట. ఏమి సాంగ్ అది అని అడిగితే వల్గర్ గా ఏమి ఉండదు.. సిట్యువేషన్ కి తగ్గట్లుగా వస్తుంది అని చెప్పారు. దీనితో నేను ఒకే చెప్పా. కానీ షూటింగ్ కి ఒకరోజు ముందు మాత్రమే సాంగ్ విన్నా. అప్పుడే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ సమయంలో చేయలేనని చెప్పలేను. ఎందుకంటే షూటింగ్ కి అంతా రెడీ అయిపోయింది. భయం భయంగానే షూటింగ్ కి వెళ్ళా. 

 

56

సాంగ్ ప్రధానంగా నా మీదే ఉంటుంది. అట్రాక్ట్ చేసే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. సెక్సీగా డ్యాన్స్ చేయాలి అని అన్నారు. నేను డ్యాన్స్ చేస్తున్నాను కానీ ఎంత ప్రయత్నించినా అలాంటి ఎక్స్ప్రెషన్స్ నా వల్ల కావడం లేదు. శేఖర్ మాస్టర్ నాకు వివరంగా చెప్పారు. నీ మీదే ప్రధానంగా సాగే పాట ఇది. హీరోతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం. ఇలాంటి ఆఫర్ చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. మిస్ చేసుకోవద్దు అని అన్నారు. డైరెక్టర్ కూడా నువ్వేమి వల్గర్ గా చేయడం లేదు కదా.. ఎక్స్ ఫోజింగ్ కూడా లేదు. 

 

66

ఈ పాటని మేము ముంబై డ్యాన్సర్లతో చేయించాలని అనుకున్నాం. ఎందుకంటే హావభావాలు సెక్సీగా ఉండాలి అని వక్కంతం గారు అన్నారు. కావలసిన హావభావాలు ఇవ్వడానికి నాకు 15 టేకులు పట్టింది. కానీ మధ్య మధ్యలో శేఖర్ మాస్టర్ ని అడుగుతూనే ఉన్నా.. మాస్టర్ ఇది జనాల్లోకి వేరేలాగా వెళ్ళదు కదా అని అడుగుతూనే ఉన్నా. అలా ఏమి ఉండదు అని ధైర్యం చెప్పారు. సాంగ్ ముగిసాక సత్య ఇరగదీశావ్ అంటూ నితిన్ గారు అందరి ముందు మెచ్చుకున్నట్లు సత్య పేర్కొంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved