- Home
- Entertainment
- సుధీర్‌తో రిలేషన్‌పై అందరిముందు ఓపెన్ అయిన రష్మి.. ఇద్దరి మనసులు కలిసే ఉన్నాయంటూ పెద్ద షాక్..
సుధీర్‌తో రిలేషన్‌పై అందరిముందు ఓపెన్ అయిన రష్మి.. ఇద్దరి మనసులు కలిసే ఉన్నాయంటూ పెద్ద షాక్..
సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మి జంట అంటే బుల్లితెరపై ఓ సంచలనం. అటు టీవీ షోస్‌లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ వీరి సొంతం. తాజాగా సుధీర్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చింది `జబర్దస్త్` రష్మి.

హాట్ బ్యూటీ రష్మి(Rashmi) యాంకర్‌గా చేసే `జబర్దస్త్`(Jabardasth)లో సుడిగాలి సుధీర్ కమేడియన్‌గా రాణించిన విషయం తెలిసిందే. రష్మిపై డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేస్తూ సుధీర్ తన ప్రేమని వ్యక్తం చేసే వాడని అంటుంటారు. అంతేకాదు వీరిద్దరు కలిసి స్కిట్లతోపాటు అనేక రొమాంటిక్ డ్యూయెట్లు పాడుకున్నారు. ఎన్నోసార్లు అటు `జబర్దస్త్` వేదికగా, ఇటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`(Sridevi Drama Company) వేదికగా పెళ్లిళ్లు చేసుకున్నారు.
ఒకరి గురించి ఒకరు చెప్పుకునేటప్పుడు ఇద్దరూ ఎంతో ఎమోషనల్ అయిపోతుంటారు. అదోలా చూసుకుంటూ తమ ఫీలింగ్స్ ని బయటపెట్టేవారు. ఒకరిపై ఒకరి ప్రేమని చాటుకునే వారు, చాలా వరకు స్కిట్ల కోసమే అని, షోకి హైప్, రేటింగ్ కోసం ఇలా చేసేవారని అంటుంటారు. కానీ వారి మధ్య ఉన్న రిలేషన్‌లోనూ నిజమే ఉందని మరికొందరు అంటుంటారు. లేకపోతే ఇన్నిసార్లు ఇలా రియాక్ట్ అవ్వరని, స్టేజ్‌పై వారి కెమిస్ట్రీ అద్బుతంగా పండేదని, మనసులో ఏమి లేకపోతే అలా రాదని కామెంట్లు వినిపిస్తుంటాయి.
అయితే తమ రిలేషన్‌పై ఇద్దరూ ఆచితూచి వ్యవహరించేవారు. ప్రేమని వ్యక్తం చేసుకునే వారు, కానీ తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, లవర్స్ అని ఏ రోజూ చెప్పలేదు. ఇద్దరం మంచి స్నేహితులమని, తమది ప్రత్యేకమైన బంధం అంటూ కవర్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల సుడిగాలి సుధీర్ అటు `జబర్దస్త్` నుంచి, ఇటు `శ్రీదేవి డ్రామా కంపెనీ` నుంచి తప్పుకున్నారు. దీంతో రష్మి ఒంటరైపోయిందనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ముఖ్యంగా వారి అభిమానులు బాగా మిస్ అవుతున్నారు.
`శ్రీదేవి డ్రామా కంపెనీ`కి సుధీర్ స్థానంలో రష్మినే హోస్ట్ గా చేస్తుంది. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో టీవీ సీరియల్స్, జబర్దస్త్ కమేడియన్లు జోడీగా మారి రొమాంటిక్ పాటలకు స్టెప్పులేశారు. బెడ్ పై పాటలేసుకుంటూ రెచ్చిపోయారు. ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకుంది.
అయితే ఇదంతా చూసిన హైపర్ ఆది.. యాంకర్ రష్మిని ప్రశ్నించాడు. ఇవన్నీ చూశాక నువ్వేమన్నా మిస్ అవుతున్నావా? అని రష్మిని అడిగాడు. గతంలో సుధీర్, రష్మి కూడా ఇలాంటి డ్యూయెట్ సాంగ్‌లు ఎన్నో పాడారు. వారి కెమిస్ట్రీ ఎవర్ గ్రీన్ అనేలా ఉంది. అవన్నీ చూసి రష్మికి గుర్తు వచ్చిందనేకోణంలో సుధీర్‌ని మిస్ అవుతున్నావా? అనే ఉద్దేశ్యంతో తన ప్రశ్నని సంధించాడు ఆది.
రష్మిని తాను దూరం నుంచి చూశానని, కాస్త ఎమోషనల్ అవుతున్నట్టు అనిపించిందని, అందుకే అడుగుతున్నట్టు చెప్పారు ఆది(Hyper Aadi). దీనికి రష్మి రింగులు రింగులు తిరడం విశేషం. ఆమె ఫేస్‌లోనూ ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడింది. కాస్త ఎమోషనల్‌గానూ అనిపించింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెగ ఆకట్టుకుని, కాసేపు సస్పెన్స్ లో పెట్టిన రష్మి ఎట్టకేలకు ఆది ప్రశ్నకి స్పందించింది.
రష్మి మెలికలు తిరుగుతూ, గుండె నిబ్బరం చేసుకుని స్టేజ్‌పైనే అందరి ముందు ఓపెన్ అయ్యింది. మనసులకు దూరానికి సంబంధం ఉండదని, అవి ఎక్కడ ఉన్నా కలిసే ఉంటాయని తెలిపింది. మొత్తంగా సుధీర్‌తో రిలేషన్‌పై ఈ రకంగా క్లారిటీ ఇచ్చింది. అందరి ముందే రష్మి ఈ విషయం చెప్పడంతో వేదిక మొత్తం హోరెత్తిపోవడం విశేషం.
ఇక సుధీర్ ఎందుకు `ఈటీవీ` షోలను వదిలేశాడనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అయ్యింది. ఆయనకు హీరోగా సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లను వదిలేశాడని, మళ్లీ వస్తాడని అంటున్నారు. అదే సమయంలో `ఈటీవీ నిబంధనల వల్ల, మల్లెమాల నిర్వహకులు `జబర్దస్త్` ఆర్టిస్టులను ఘోరంగా ట్రీట్ చేయడం వల్లే అవమానంభరించలేక వెళ్లిపోయారని కిర్రాక్ ఆర్పీ లాంటి వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. మరి నిజం ఏంటనేది సుధీర్‌కే తెలియాలి.