- Home
- Entertainment
- Jabardasth Rashmi: రష్మీ బట్టర్ ఫ్లై అందాలు.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. నెటిజన్లు షాకింగ్ కామెంట్
Jabardasth Rashmi: రష్మీ బట్టర్ ఫ్లై అందాలు.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. నెటిజన్లు షాకింగ్ కామెంట్
జబర్దస్త్ యాంకర్ రష్మికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే సోషల్ మీడియా షేక్ అయిపోవాల్సిందే. ఆమె ఫాలోయింగ్‌కి ఇతర యాంకర్లు కూడా బేజార్ అయిపోవాల్సిందే.

యాంకర్ రష్మీ.. `జబర్దస్త్` షో కోసం అందంగా, ట్రెండీ వేర్‌లో ముస్తాబై హోయలు పోతుంది. తాజాగా బట్టర్‌ఫ్లైని పోలిన డ్రెస్‌లో పరువాలు పోయింది రష్మి. స్లీవ్ లెస్ ఫ్రాక్‌లో ఫోటో షూట్‌కి పోజులిచ్చింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారాపంచుకోగా, అవి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.
రష్మీ గౌన్ ఎగరేస్తూ ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. దీంతో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుందని అంటూ సెటైరికల్ పోస్ట్ లు పెడుతుండటం విశేషం. అందాల దేవతలా ఉన్నావని, బ్యూటీఫుల్ అని, హాట్‌నెస్ ఓవర్‌లోడ్ అని, క్యూట్‌గా ఉన్నావని ఎవరికి నచ్చినట్టు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వరుస కామెంట్లు, షేరింగ్‌లతో రష్మి సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది.
ఇదిలా ఉంటే కొంత మంది షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. రష్మీలో అందం తగ్గిందంటూ పోస్ట్ లు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో ఉన్న హాట్‌నెస్ ఇప్పుడు కనిపించడం లేదంటున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
రష్మీ గ్లామర్‌తో `జబర్దస్త్` షోని రక్తి కట్టిస్తుంది. ఆమె వచ్చీ రాని తెలుగుతో మరింత ముద్దుగా మారిపోతుంది. ఓ వైపు గ్లామర్, మరోవైపు వచ్చీ రాని తెలుగుతో టీవీ ఆడియెన్స్ ని అలరిస్తుంది రష్మి. షో కి రేటింగ్ రావడంతో తనవంతు ప్రయత్నం చేస్తుంది.
రష్మీ రెగ్యూలర్‌గా గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియా అభిమానులను అలరిస్తుంది. పొట్టి దుస్తుల్లో అందాలు చూపిస్తూ ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రతి వారం ఈ అమ్మడి నుంచి లేటెస్ట్ ట్రెండీ వేర్ పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇంకా చెప్పాలంటే యాంకర్ రష్మి హాట్ ఫోటోల కోసం లక్షలాధి మంది ఎదురుచూస్తున్నారని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అలా ఓ వైపు టీవీ ఆడియెన్స్ ని, మరోవైపు సోషల్ మీడియా అభిమానులను ఆకట్టుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజీ బ్యూటీగా నిలుస్తుంది.
ఇక `జబర్దస్త్` షోలో సుడిగాలి సుధీర్‌తో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరిపై స్పెషల్ స్కిట్లని ఏర్పాటు చేయిస్తూ షో నిర్వహకులు `జబర్దస్త్`కి స్పెషల్ హైప్‌కి తీసుకొస్తుంటారు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ హైలైట్ చేస్తూ టీఆర్పీ రేటింగ్‌ని పెంచుతుంటారు.
అంతేకాదు షో వేదికపై ఎన్నోసార్లు వీరికి పెళ్లిళ్లు చేయడం విశేషం. ఇది అన్ని టీవీ షోస్‌లో ఓ ట్రెండ్‌గానూ మారింది. చాలా మంది దీన్ని ఫాలో అయ్యారు. అయితే దీనిపై విమర్శలు వచ్చాయి. `జబర్దస్త్` నిర్వహకులైన మల్లెమాల సంస్థపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థనా, లేక పెళ్లిళ్ల బ్రోకరా;? అంటూ విమర్శలు రావడం విశేషం.
దీంతో ఆతర్వాత నుంచి వీటికి ఫుల్ స్టాప్ చెప్పారు. కానీ రష్మి, సుధీర్ మాత్రం ఇలాంటి స్పెషల్ స్కిట్లకి బ్రాండ్‌గా మారిపోయింది. అయితే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పీక్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వీరి మధ్య స్కిట్లని, సీన్లని తగ్గించారు. `ఢీ` షో నుంచి ఏకంగా వీరిని తీసేయడం గమనార్హం.
జబర్దస్త్ యాంకర్ రష్మికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే సోషల్ మీడియా షేక్ అయిపోవాల్సిందే. ఆమె ఫాలోయింగ్‌కి ఇతర యాంకర్లు కూడా బేజార్ అయిపోవాల్సిందే.