పదివేలిస్తా అనసూయతో పెద్ద పూజ సెట్ చెయ్... వామ్మో హైపర్ ఆది అరాచకం
జబర్దస్త్ (Jabardasth)లో హైపర్ ఆది జోకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్ స్టాప్ పంచ్ లకు ఈ కమెడియన్ పెట్టింది పేరు. సమకాలీన అంశాలపై సెటైర్స్ వేయడం ఆది స్పెషల్. ఇక ఆది అతి, మోతాదుకు మించిన సెటైర్స్ అప్పుడప్పుడు కొందరి ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో హైపర్ ఆది విమర్శలు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ వివాదాలు, విమర్శలు పట్టించుకోకుండా హైపర్ ఆది (Hyper Aadhi)హాస్యాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, అతనికి మద్దతుగా నిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ మధ్య యాంకర్ అనసూయను తన జోక్స్, స్కిట్స్ లో భాగం చేస్తున్నాడు. ప్రతి స్కిట్ లో ఆమెపై సెటైర్స్ వేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. అనసూయ సైతం హైపర్ ఆది హాస్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
తాజాగా పుష్ప(Pushpa) థీమ్ తీసుకొని కామెడీ స్కిట్ చేశాడు. ఈ స్కిట్ లో పుష్ప మూవీలో కీలక రోల్ చేసిన జగదీష్ మరోసారి కేశవ రోల్ చేశాడు. ఆది పుష్పరాజ్ గా గొడ్డలితో హల్ చల్ చేశాడు. ఇక పుష్ప గెటప్ లో ఉన్న ఆది అనసూయను (Anasuya)ఉద్దేశిస్తూ.. ఆ అమ్మి నన్ను చూసి నవ్వుతుంది కదా?.. అని కేశవను అడుగుతాడు. మరి వెయ్యి రూపాయలు పూజ అంటే ఆ మాత్రం ఉంటుందని కేశవ సమాధానం చెప్తాడు.
ఇదిగో కేశవ.. ఈ వెయ్యి రూపాయలు పూజలు కాదు గానీ.. ఒక పదివేలు ఇస్తా పెద్ద పూజ ఏర్పాటు చెయ్ అని ఓపెన్ గా అడిగేశాడు. ఆది డైలాగ్ కి మూతి ముడుచుకొని కోప్పడింది అనసూయ. పదివేలు ఇస్తాను అనసూయతో ముద్దు ముచ్చట ఏర్పాటు చేయమని ఆది నేరుగా అడిగినట్లైంది.
ఇదంతా కామెడీ కోసమే అయినా డబ్బులు ఇస్తాను.. రొమాన్స్ సెట్ చేయమని అడగడం ఒకింత ఇబ్బందికర డైలాగ్స్ అనుకోవాలి. పుష్ప మూవీలో కేశవ వెయ్యి రూపాయలిచ్చి శ్రీవల్లి పుష్పరాజ్ వైపు చూసేలా సెట్ చేస్తాడు.
ఆ విషయం తెలుసుకున్న పుష్పరాజ్(Allu Arjun).. ఈసారి ఐదు వేలు ఇస్తాను... శ్రీవల్లితో ముద్దు సెట్ చేయమంటారు. పుష్ప మూవీలో నవ్వులు పూయించిన ఈ సన్నివేశాలు జబర్దస్త్ వేదికపై స్పూఫ్ చేశాడు ఆది.
పుష్ప రాజు గూని పై హైపర్ ఆది వేసిన జోకు బాగా పేలింది. ఆ భుజం ఎందుకు అలా పైకి పోయిందంటే.. బైక్ మీద సెల్ ఫోన్ మాట్లాడి మాట్లాడి అలా అయిపోయిందని చెప్పడం నవ్వులు కురిపించింది. మొత్తంగా వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్ నవ్వులు కురిపించనుందని స్పష్టంగా అర్థం అవుతుంది.