- Home
- Entertainment
- ఆ వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మను వివాహం, 13 మంది మధ్య ఇంద్రజ పెళ్లి... జబర్దస్త్ జడ్జెస్ పెళ్లిళ్లలో ట్విస్ట్!
ఆ వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మను వివాహం, 13 మంది మధ్య ఇంద్రజ పెళ్లి... జబర్దస్త్ జడ్జెస్ పెళ్లిళ్లలో ట్విస్ట్!
అనూహ్యంగా జబర్దస్త్ జడ్జెస్ట్ సింగర్ మను, నటి ఇంద్రజ పెళ్లి, ప్రేమ వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. మను బాల్య వివాహం చేసుకున్న విషయం వెలుగులోకి రాగా.. ఇంద్రజ కేవలం 13 మంది సన్నిహితుల మధ్య ప్రేమ వివాహం చేసుకున్నారట.

Jabardasth
ఎప్పటిలాగే జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్ నాన్ స్టాప్ నవ్వులతో సిద్ధమైంది. చలాకీ చంటి, మంకీ వెంకీతో పాటు మిగతా కమెడియన్స్ తమదైన స్కిట్స్ తో గిలిగింతలు పెట్టనున్నారు. ఆసక్తికరంగా వెంకీ తన టీం మేట్ గా భార్యను తీసుకొచ్చారు. వెంకీ స్కిట్ లో ఆమె నటించడం జరిగింది. సాంగ్ త్వరగా ముగియగానే... వేరే అమ్మాయిలతో అయితే ఎక్కువ సేపు డాన్స్ చేస్తారు అంటూ ఆమె పంచ్ విసిరింది. దానికి వెంకీ వాళ్లంటే మళ్ళీ దొరకరు కదే అంటూ సెటైరికల్ కౌంటర్ వేశాడు.
Jabardasth
ఇక వీరి స్కిట్ సరదా సరదాగా ముగిసినట్లుంది. అనంతరం జడ్జ్ ఇంద్రజ వెంకీని తన పెళ్లి గురించి అడిగారు. తమది లవ్ మ్యారేజ్ అని వెంకీ తెలియజేశారు. తాను కూచిపూడి డాన్సర్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్. ఓ ఈవెంట్ సందర్భంగా కలిసి తమ మధ్య పరిచయం ఏర్పడడం, అది పెళ్లికి దారి తీసినట్లు వెంకీ వెల్లడించారు. ఇక తన ఇద్దరు పిల్లలను కూడా జబర్దస్త్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
Jabardasth
తన గురించి చెప్పిన వెంకీ అనంతరం ఇంద్రజను అడిగారు. మేడమ్ మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అని అడిగాడు. దానికి తనది లవ్ మ్యారేజ్ అని చెప్పారు. తన పెళ్లి కేవలం 13 మంది సమక్షంలో జరిగింది అన్నారు. ఇక తన పెళ్లికి అయిన ఖర్చు కేవలం రూ. 7500 అని ఇంద్రజ ఆసక్తికర విషయం తెలియజేశారు.
Jabardasth
ఇంద్రజ పెళ్లి మేటర్ తర్వాత విషయం సింగర్ మను వైపుకు మళ్లింది. మను గారు మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అని యాంకర్ అనసూయ అడిగారు. నేను సంపాదిస్తున్నానని పేరెంట్స్ చిన్న వయసులోనే వివాహం చేసేశారని మను వెల్లడించారు. అప్పుడు తన భార్య వయసు కేవలం 16 ఏళ్ళు అని మను చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
Jabardasth
అంటే మను గారు మీరు బాల్య వివాహం చేసుకున్నారా అని అనసూయ నోరెళ్లబెట్టింది. చివరిగా మను అనసూయ నీగురించి చెప్పమనగా... నాది జీవితం తెరిచిన పుస్తకం. అందరికీ తెలుసని కామెంట్ చేసింది. భరద్వాజ్ అనే వ్యక్తిని అనసూయ చాలా కాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు.
కాగా నటి ఇంద్రజ నటుడు బిజినెస్ మాన్ మహమ్మద్ అబ్సర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్త్ కాగా పేరు సారా. కులాంతర వివాహం చేసుకున్న ఇంద్రజ పెళ్లి తర్వాత వెండితెరకు దూరమయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వయసుకు తగ్గ పాత్రలతో పాటు బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్నారు.