- Home
- Entertainment
- #BiggBossTelugu6: యాక్సిడెంట్ అయ్యాక లైఫ్ తిరిగిపోయింది.. కదిలించే చిత్తూరు చిలక గీతూ రాయల్ జర్నీ..
#BiggBossTelugu6: యాక్సిడెంట్ అయ్యాక లైఫ్ తిరిగిపోయింది.. కదిలించే చిత్తూరు చిలక గీతూ రాయల్ జర్నీ..
ఆ మధ్య `జబర్దస్త్`లో `పుష్ప` సినిమాలోని డైలాగులతో స్కిట్ చేసి పాపులర్ అయ్యింది గలాటా గీతూ రాయల్. తాజాగా బిగ్ బాస్ 6లో పాల్గొని కన్నీళ్లు పెట్టించే తన బ్యాక్ గ్రౌండ్‌ని వెల్లడించింది.

యూట్యూబర్‌గా, ఐటీ ఉద్యోగిగా, రివ్యూవర్‌గా, ఆర్జేగా, ఆర్టిస్టుగా రాణిస్తుంది గీతూ రాయల్(Geethu Roayl). గలాటా గీతూగా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గీతూ రాయల్ బిగ్ బాస్ తెలుగు 6(Bigg Boss Telugu 6) లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. చలాకీతనంతో, గలగల మాట్లాడుతూ ఆకట్టుకుంది. స్టేజ్‌పై చాలా సేపు ఉండి అందరిని ఆకట్టుకుంది. నాగ్‌ని సైతం ఇంప్రెస్ చేసింది.
ఈ సందర్భంగా తన గతాన్ని పంచుకుంది గీతూ రాయల్. 2014లో బొమ్మరిల్లు సినిమా మాదిరిగా రన్నింగ్ బస్ నుంచి దిగే ప్రయత్నంచేశా. కానీ క్షణంలో కిందపడిపోయిందట. దీంతో రోడ్డుపై రక్తం కారిపోతుందని, తలపై బలంగా దెబ్బ తగిలిందట. ఓ వైపు తనకు రక్తం కారుతుంటే, అక్కడ జనాలంతా సెల్ఫీలు తీసుకుంటున్నారని ఆ టైమ్‌లో ఓ వ్యక్తి వచ్చి తనని చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. దాదాపు 24 గంటలు కోమాలోనే ఉండిపోయాయని అతనే డబ్బులు ఖర్చు పెట్టి తనకు ట్రీట్‌మెంట్ ఇప్పించారని పేర్కొన్నారు. మూడు నెలలు ఏం జరిగిందో తెలియదని, ఇప్పటికీ మతిమరుపు ఉంటుందని చెప్పింది.
ఆ తర్వాత తన లైఫ్ మారిపోయిందని, అంతకు ముందు తనకు చాలా పెద్ద పేరు ఉందని, తర్వాత గీతూ రాయల్‌గా పేరుమార్చుకున్నానని, దీంతో తన సుడి తిరిగిపోయిందని చెప్పింది. ఇప్పుడు చిత్తూరి చిలుకలా మారిపోయానని, యూట్యూబర్‌గా, ఐటీ ఎంప్లాయ్‌గా, ఆర్జేగా, ఆర్టిస్ట్ గా బిగ్‌బాస్, సినిమాలు, బిగ్ బాస్ రివ్యూవర్‌గా ఇలా చేసుకుంటూ వస్తున్నానని, ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నానని చెప్పింది గీతూ రాయల్. పేరు మార్చుకోవడం వల్లే తన సుడి తిరిగిందని చెప్పింది గీతూ రాయల్.
అంతేకాదు తన లవ్ స్టోరీని బయటపెట్టింది. వికాస్ చిన్నప్పట్నుంచి ఫ్రెండ్ అని, పెద్దయ్యాక వాళ్ల ఫ్యామిలీ వాళ్లే తమ ఇంటికొచ్చి సంబంధం అడిగారని, అలా అరెంజ్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది గీతూ రాయల్. తాను వెటర్నెటీ డాక్టర్ కావాలనుకుందట, కానీ ఇంట్లో వాళ్లు అభ్యంతర చెప్పడంతో మానేసినట్టు తెలిపింది. అదే సమయంలో బేబీ వాయిస్ మాట్లాడి ఇంప్రెస్ చేసింది.
తాను ఈ షోకి రావడానికి మూడు కారణాలని తెలిపింది. నిజానికి ఎప్పుడో రావాల్సి ఉందట. కానీ కాస్త సన్నగా మారి వద్దామనుకున్నానని, కానీ లావు తగ్గడం లేదని, చివరికి తానేంటో చూపించాలని వచ్చినట్టు చెప్పింది. తను ఇప్పటికీ ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవుతుందట. తన లైఫ్‌లో కొన్ని సంఘటన కారణంగా ఆ అభద్రతాభావం ఉందని, దాన్ని అధిగమించాలని వచ్చినట్టు చెప్పింది.
దీంతోపాటు తాను బిగ్ బాస్ రివ్యూలు చెబుతుంటాను, తాను వెళితే ఎలా ఉంటుంది, తాను సత్తా చాటగలనా అనేది నిరూపించుకునేందుకు వచ్చినట్టు చెప్పింది. మూడో కారణం టాప్ ఫైవ్‌లో నిలిచినప్పుడు చెబుతానని వెల్లడించింది గీతూ రాయల్. ఉన్నంత సేపు గలగల మాట్లాడుతూ, సెటైర్లు,పంచ్‌లతో ఆద్యంతం వినోదాన్ని పంచింది గీతూ. ఆమె లైఫ్‌లో కొంత బాధ, మరికొంత స్ఫూర్తినిచ్చే అంశాలుండటం విశేషం.