జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ కారుకి ప్రమాదం, ఆయన కండిషన్ ఇదే!
జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాదం పెను ప్రమాదం నుండి తృటిలో తప్పుకున్నట్లు సమాచారం. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆక్సిడెంట్ కి గురైందట.
జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఆటో రామ్ ప్రసాద్ ఒకడు. ఈయన కారుకు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 5 ఉదయం రామ్ ప్రసాద్ షూటింగ్ నిమిత్తం తన కారులో బయలుదేరారు. తుక్కుగూడ సమీపంలో రామ్ ప్రసాద్ కార్ కి ముందు వెళుతున్న కార్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడట. దాంతో రామ్ ప్రసాద్ సైతం సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందట. ఈ క్రమంలో వెనకున్న ఆటో ఒకటి రామ్ ప్రసాద్ కారును బలంగా ఢీ కొట్టిందట.
ఆ ధాటికి రామ్ ప్రసాద్ కారు ముందున్న కారును ఢీ కొట్టిందట. ఒక్కసారిగా షాక్ కి గురయ్యారట రామ్ ప్రసాద్. అదృష్టవశాత్తు రామ్ ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారట. కారు మాత్రం డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. మరో వెహికల్ లో అక్కడి నుండి వెళ్లిపోయిన రామ్ ప్రసాద్, గాయాలకు చికిత్స తీసుకున్నారట. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
సుడిగాలి సుధీర్ టీంలో రామ్ ప్రసాద్ సుదీర్ఘ కాలం చేశాడు. జబర్దస్త్ కి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ప్రధాన ఆకర్షణగా ఉండేవారు. వీరి టీం ప్రస్తుతం విచ్ఛిన్నం అయ్యింది. నటులుగా సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యాక గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. రామ్ ప్రసాద్ మాత్రం కొనసాగుతున్నారు.
రామ్ ప్రసాద్ ఒక టీమ్ ని నడుపుతున్నారు. ఆయన లీడర్ గా స్కిట్స్ చేస్తున్నారు. అయితే సుధీర్, గెటప్ శ్రీను కాంబినేషన్ ఆడియన్స్ మిస్ అవుతున్నారు. ఒకప్పటిలా రామ్ ప్రసాద్ ఆటో పంచ్ లు పేలడం లేదు. ఆయన టీమ్ లో ఉన్న కమెడియన్స్ తన మిత్రుల స్థాయిలో కామెడీ పంచలేకపోతున్నారు.
మరోవైపు రామ్ ప్రసాద్ కూడా సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఆయన పలు హిట్ చిత్రాల్లో కామెడీ రోల్స్ చేశారు. రచయితగా కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో రామ్ ప్రసాద్ స్కిట్స్ చేస్తున్నాడు. రామ్ ప్రసాద్ ప్రమాదం నుండి బయటపడ్డారన్న విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.