- Home
- Entertainment
- జబర్దస్త్ లో డీజే టిల్లు గిల్లుడు...అనసూయకు పువ్వు ఇవ్వబోయి పుష్పం అయిన కామెడీ స్టార్..!
జబర్దస్త్ లో డీజే టిల్లు గిల్లుడు...అనసూయకు పువ్వు ఇవ్వబోయి పుష్పం అయిన కామెడీ స్టార్..!
జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ అనసూయకు పువ్వు ఇవ్వబోయి పుష్పం అయ్యాడు కమెడియన్. రాజుల కాలం థీమ్ తీసుకొని స్కిట్ చేసిన కమెడియన్స్ అనసూయపై వేసిన పంచ్ భలే పేలింది.

Jabardasth
జబర్దస్త్ (Jabardasth Comedy Show) నుండి చాలా మంది స్టార్ కమెడియన్స్ తప్పుకున్నారు. చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్, ధన్ రాజ్, కిరాక్ ఆర్పీ, అప్పారావు, అదిరే అభితో పాటు పలువురు వేరే ఛానల్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక జబర్దస్త్ కి ఆయువుపట్టుగా ఉన్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుతో పాటు హైపర్ ఆది కూడా కనిపించడం లేదు.
Jabardasth
ఇక 2019లోనే నాగబాబు (Nagababu) జబర్దస్త్ వదిలేయగా.. మంత్రి పదవి రావడంతో రీసెంట్ గా రోజా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ మెల్లగా కళ కోల్పోతుంది. జబర్దస్త్ జడ్జెస్ గా సింగర్ మనుతో పాటు హీరోయిన్ ఇంద్రజ జాయిన్ అయ్యారు.
Jabardasth
సీనియర్స్ నిష్క్రమణతో చాలా మంది కొత్త కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొందరు నవ్వులు పూయిస్తుండగా.. మరి కొందరు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇక లేటెస్ట్ స్కిట్ లో ఓ కమెడియన్ అనసూయపై ఓ కామెడీ పంచ్ విసిరాడు. రాజుల కాలం నాటి థీమ్ లో స్కిట్ చేసిన ఓ టీమ్ డీజే టిల్లు పాటతో అదరగొట్టారు.
Jabardasth
''అరేయ్.. మొన్న అనసూయ (Anchor Anasuya) మహారాణికు పువ్వు ఇవ్వబోతే ఆమె తీసుకోలేదు. చాలా సమయం వెయిట్ చేయినా వర్క్ అవుట్ కాలేదు'' అని డైలాగ్ కొట్టాడు. దానికి టీమ్ సభ్యుడు ''ఇద్దరిలో ఫువ్వు ఎవరో తెలియక తీసుకొని ఉండరు ప్రభూ.. '' అంటూ పంచ్ విసిరాడు. ఈ పంచ్ కి అనసూయతో పాటు జడ్జెస్ పడీపడీ నవ్వారు.
Jabardasth
ఎక్స్ట్రా జబర్దస్త్ లో హైపర్ ఆది ప్రత్యేక ఆకర్షణ. అతడు అనసూయను తరచుగా స్కిట్ లో భాగం చేసేవాడు. ఆమెపై నవ్వులు పూయించే పంచెస్ విసిరేవాడు. అనసూయతో సైతం హైపర్ ఆదితో కామెడీ పంచడానికి ఇష్టపడేది.
Jabardasth
ప్రస్తుతం హైపర్ ఆది కూడా జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఇతర బుల్లితెర కార్యక్రమాలతో పాటు అతడికి సినిమా ఆఫర్స్ రావడం వలన ఈ షోని వదిలేసినట్లు వార్తలు వస్తున్నాయి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది షోని వదిలిస్తే... అది మేకర్స్ కి చాలా నష్టమని చెప్పాలి.