నితిన్ ఫ్లాప్ మూవీపై జబర్దస్త్ కమెడియన్ సెటైర్లు, పరువు తీశాడుగా..అందరి ముందు ఆమెపై వల్గర్ కామెంట్స్
జబర్దస్త్ షోలో కామెడీ విపరీతంగా మారుతుందనే విమర్శలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. మహిళా కమెడియన్స్, నటీమణులపై వేసే పంచ్ డైలాగులు దారుణంగా ఉంటున్నాయి. కామెడీ కోసం, టిఆర్పి రేటింగ్స్ కోసం హద్దులు దాటుతున్నారు అంటూ తరచుగా వివాదం జరుగుతూనే ఉంది.
జబర్దస్త్ షోలో కామెడీ విపరీతంగా మారుతుందనే విమర్శలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. మహిళా కమెడియన్స్, నటీమణులపై వేసే పంచ్ డైలాగులు దారుణంగా ఉంటున్నాయి. కామెడీ కోసం, టిఆర్పి రేటింగ్స్ కోసం హద్దులు దాటుతున్నారు అంటూ తరచుగా వివాదం జరుగుతూనే ఉంది. జబర్దస్త్ కమెడియన్లు సినిమాలపై కూడా పేరడీ చేస్తుంటారు.
ఈ క్రమంలో ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ వివాదంగా మారేలా ఉంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజయింది. ఓ స్కిట్ లో జబర్దస్త్ సత్య, బులెట్ భాస్కర్ పెర్ఫామ్ చేశారు. బుల్లెట్ భాస్కర్ నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంపై దారుణమైన సెటైర్లు వేశాడు. ఈ క్రమంలో జబర్దస్త్ సత్యపై వల్గర్ కామెంట్స్ చేశాడు.
నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్ట్రా చిత్రం గత ఏడాది డిసెంబర్ లో రిలీజయింది. నితిన్ కి మరో దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. వక్కంతం వంశీ దర్శకుడిగా మరోసారి విఫలమైన చిత్రం ఇది. ఈ చిత్రంలో కొన్ని కామెడీ సన్నివేశాలు తప్ప ఇంకేమి వర్కౌట్ కాలేదు. జబర్దస్త్ సత్యతో 'నా పెట్టె తాళం' అనే స్పెషల్ సాంగ్ చేయించారు. ఆ సాంగ్ కొంత వరకు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
బుల్లెట్ భాస్కర్ తన స్కిట్ లో సత్యపై డబుల్ మీనింగ్ పంచ్ లు వేశాడు. సత్యకి భాస్కర్ డాష్ ఇస్తాడు. చూసుకోవా అంటూ తిడుతుంది. తిరిగి బదులిస్తూ.. చూసే గుద్దాను.. రాత్రి యూట్యూబ్ లో కూడా మొత్తం చూసేశాను అని అంటాడు. దీనితో బులెట్ భాస్కర్ నా పెట్టె తాళం పాట పాడుతాడు. దీనితో సత్య సిగ్గుపడిపోతుంది.
అంతటితో ఆగలేదు.. ఇదిగో అమ్మాయి.. మన దగ్గర చాలా తాళాలు ఉన్నాయి అని భాస్కర్ వల్గర్ గా కామెంట్స్ చేస్తాడు. ఇది కాస్త వివాదం అయ్యేలా ఉంది. అందరి ముందు అమ్మాయిని నా దగ్గర చాలా తాళాలు ఉన్నాయి అని డబుల్ మీనింగ్ గా చెప్పడం ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. దీనికి జబర్దస్త్ సత్య సిగ్గుపడుతూ ఇస్తున్న ఎక్సప్రెషన్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
ఎక్స్ట్రా చిత్రంలో నా పెట్టె తాళం చిత్రం చేయడానికి అడిగినప్పుడు తాను ముందు అంగీకరించలేదు అని గతంలో సత్య ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది జనాల్లోకి వేరే రకంగా వెలుతుందేమో అని భయపడినట్లు పేర్కొంది. కానీ దర్శకుడు వక్కంతం వంశీ, హీరో నితిన్ అలా ఏమీ ఉండదని హామీ ఇచ్చిన తర్వాతే అంగీకరించినట్లు సత్య తెలిపింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా తనపైనే బుల్లెట్ భాస్కర్ డబుల్ మీనింగ్ తో సెటైర్లు వేస్తున్నప్పటికీ ఆమె సిగ్గు పడుతూ యాక్సప్ట్ చేయడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.