- Home
- Entertainment
- సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్‌పై రష్మిని రెచ్చగొడుతున్న రాంప్రసాద్.. తొమ్మిదేళ్లుగా చేస్తున్నది అదేనట..
సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్‌పై రష్మిని రెచ్చగొడుతున్న రాంప్రసాద్.. తొమ్మిదేళ్లుగా చేస్తున్నది అదేనట..
సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గత తొమ్మిదేళ్లుగా లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. కానీ ఈ మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో తాజాగా రష్మిని రెచ్చగొట్టే కామెంట్ చేశాడు రాంప్రసాద్.

బుల్లితెరపై సుడిగాలిసుధీర్, యాంకర్ రష్మి మధ్య గత కొంత కాలంగా లవ్ ట్రాక్ నడుస్తుంది. కానీ అది నిజమా? కాదో తెలియడం లేదు. ఎప్పటికప్పుడు దోబూచులాడుతూనే ఉన్నారు. కానీ ఇటీవల అది కూడా లేదు. ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. సుధీర్ జబర్దస్త్ మానేయడంతో రష్మి ఒంటరైపోయింది. ఒకప్పటి నాటి సందడి లేడు. దీంతో జబర్దస్త్ షో కూడా క్రేజ్ తగ్గిపోయింది. డ్రామా పండటం లేదు.
రష్మి, సుధీర్ ఫ్యాన్స్ వీరి జంటగా చాలా మిస్ అవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఇతర షోస్ ప్రోమోల్లో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఆ సందడి మిస్ అయ్యింది. షోస్ లో ఏదో లోటు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ వీరిని గెలికే ప్రయత్నం చేశాడు. అంతేకాదు రష్మిని అందరి ముందు రెచ్చగొట్టాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో టీవీ సీరియల్స్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. వీరిలో చాలా వరకు భార్యాభర్తలున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ఇప్పటికీ తమ బంధాన్ని ఎంతో ప్రేమగా కొనసాగిస్తున్నారు. ఆ ప్రేమ, అనుబంధాలను షోలోనూ చూపించారు. రొమాంటిక్ సాంగ్‌లో రెచ్చిపోయారు. ఇది చూసిన యాంకర్ రష్మి జెలసీ ఫీలయ్యింది.
పెళ్లై తొమ్మిదేళ్లు అవుతుందని వాళ్లు చెప్పగా, తొమ్మిదేళ్లు అవుతున్నా, హూ.. హూ.. అంటూ రొమాంటిక్‌గా గిల్లే ప్రయత్నం చేసింది. దీనికి వాళ్లది తొమ్మిదేళ్ల పెళ్ళి అనుబంధం అని, మీలాగా తొమ్మిదేళ్ల లవ్ ట్రాక్ కాదు అంటూ సెటైర్లు విసిరారు. దీంతో దెబ్బకి రష్మి ముఖం వాడిపోయింది.
ఇందులో వాళ్లది రియల్ బంధం అని, కానీ మీది(రష్మి, సుధీర్)లది కేవలం ట్రాక్ మాత్రమే అని పంచులు విసిరారు రామ్ ప్రసాద్. పరోక్షంగా యాంకర్ రష్మిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో జబర్దస్త్ యాంకర్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది హైలైట్‌గా నిలిచింది.
సుధీర్.. జబర్దస్త్ ని వదిలేసి దాదాపు రెండేళ్లు కావస్తుంది. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాలతో ఆడియెన్స్ అని అలరించారు. చివరగా ఆయన `కాలింగ్ సహస్త్ర` చిత్రంలో నటించారు. కానీ ఇది నిరాశ పరిచింది. ప్రస్తుతం ఆయన `గోట్` మూవీతో వస్తున్నారు. ఇది విడుదలకు రెడీ అవుతుంది.
photo credit-dhee promo
మరోవైపు యాంకర్ రష్మి టీవీ షోస్‌తో బిజీగా ఉంది. ఆమె `జబర్దస్త్` కి యాంకర్‌గా చేస్తుంది. దాదాపు పదేళ్లుగా ఆమె కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. తరచూ గ్లామర్ ట్రీట్‌తో మెప్పిస్తుంది. దీంతోపాటు అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్న విషయం తెలిసిందే. చివరగా ఆమె `భోళా శంకర్`లో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిందీ సెక్సీ యాంకర్.