MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జబర్దస్త్ లో కుళ్ళు రాజకీయాలు భరించలేకపోయా..నరకం చూపించారు, అసలు బాగోతం బయటపెట్టిన నూకరాజు

జబర్దస్త్ లో కుళ్ళు రాజకీయాలు భరించలేకపోయా..నరకం చూపించారు, అసలు బాగోతం బయటపెట్టిన నూకరాజు

తాను ఎదుగుతున్న టైంలో ఆ కుళ్ళు రాజకీయాలని భరించలేకపోయానని నూకరాజు కుండబద్దలు కొట్టేశాడు. జబర్దస్త్ షోలో ట్యాలెంట్ గురించి పట్టించుకునేది చాలా తక్కువ.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 13 2024, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెర టీవీ కార్యక్రమాలతో పలువురు నటీనటులు కమెడియన్లు గా రాణిస్తున్నారు. కొందరు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకి వెళ్లి పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు. హాస్యం బాగా పండించే వారికి జబర్దస్త్ షోలలో గుర్తింపు దక్కుతోంది. తన ట్యాలెంట్ తో బాగా పాపులర్ అయిన కమెడియన్ నూకరాజు. 

27

షార్ప్ గా కామెడీ పంచ్ లు పేల్చడంలో నూకరాజు దిట్ట. జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా నూకరాజు అప్పుడప్పుడూ సందడి చేస్తుంటాడు. దాదాపు రెండున్నరేళ్ల పాటు అవమానాలు ఎదుర్కొని కష్టపడితే తనకి ఈ గుర్తింపు దక్కినట్లు నూకరాజు తెలిపాడు. ఇటీవల ఇంటర్వ్యూలో నూకరాజు జబర్దస్త్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

37

టీమ్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, సీనియర్స్ కొందరు కుళ్ళు రాజకీయాలు ప్రదర్శిస్తారని.. తాను ఎదుగుతున్న టైంలో ఆ కుళ్ళు రాజకీయాలని భరించలేకపోయానని నూకరాజు కుండబద్దలు కొట్టేశాడు. జబర్దస్త్ షోలో ట్యాలెంట్ గురించి పట్టించుకునేది చాలా తక్కువ. వాళ్ళకి కావలసిన వాళ్ళని మాత్రమే హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారు. 

47

కనీసం డైలాగ్ చెప్పడం కూడా రానివాళ్ళని బలవంతంగా హైలైట్ చేయాలనీ చూస్తారు. ముందుగా ట్యాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత తమకి కావలసిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అదో పద్ధతి. కానీ ఇక్కడ అలా ఉండదు. కొన్నిసార్లు ఈ రాజకీయాలు భరించలేక ముఖం మీద అడిగేసిన సందర్భాలు ఉన్నాయి. 

57

అలా అడిగినప్పుడు నన్ను కొన్ని ఎపిసోడ్స్ నుంచి తీసేశారు. మరికొన్నిసార్లు ప్రోమోలో కూడా నేను కనపడకుండా చేసేవారు. దీనివల్ల చాలా సందర్భాల్లో మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యా. ఇంత రాజకీయం జరుగుతున్నా నన్ను నా రైటింగ్ కాపాడింది. ఆడియన్స్ కి చేరువ చేసింది అని నూకరాజు తెలిపారు. ఇప్పుడు నూకరాజు జబర్దస్త్ లో స్వయంగా టీం లీడర్ గా ఎదిగాడు. 

67

ప్రస్తుతం తన సమస్యలు కొంత వరకు తీరాయని నూకరాజు తెలిపారు. ఒక సమస్య తీరింది అనుకుంటే మరో సమస్య ఉందట. అదే తన పెళ్లి. నూకరాజు ప్రస్తుతం ఏంజెల్ ఆసియాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్ళికి పెద్దలు అంగీకారం తెలపడం లేదట. ఎప్పటికైనా వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుంటాం అని నూకరాజు తెలిపారు. 

77

అయితే లేట్ అయ్యే కొద్దీ ఇది ఎక్కడ ప్రేమ లేదు ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటుందేమో అని మరో టెన్షన్ అంటూ సరదాగా తన ప్రియురాలిని ఉద్దేశించి తెలిపాడు. పక్కనే ఉన్న ఆమె దిండుతో నూకరాజుని ప్రేమగా కొట్టింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved