మహేష్ బాబు యాడ్స్ కి డబ్బింగ్ చెప్పేది ఎవరో తెలుసా?.. `జబర్దస్త్` కమెడియన్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా?
మహేష్ బాబు ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేస్తాడు. సినిమాలతో కంటే యాడ్స్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తాడు. అయితే తన యాడ్స్ కి డబ్బింగ్ చెప్పేది మాత్రం ఆయన కాదట.
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి `గుంటూరు కారం` సినిమాతో అలరించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయలేకపోయింది. కానీ ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు భారీ సినిమాకి రెడీ అవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి యాక్ట్ చేయబోతున్నారు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు మహేష్.
మహేష్ బాబు సినిమాలతోపాటు యాడ్స్ కూడా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఏకకాలంలో నాలుగైదు యాడ్స్ చేస్తుంటాడు. సినిమాల కంటే యాడ్స్ ద్వారానే బాగా సంపాదిస్తున్నాడు మహేష్. ఇటీవల ఆయన ఫోన్ పే యాడ్ చేసి కోట్లు అర్జించాడు. సంతూర్, బైజూస్, థమ్స్ అప్, డ్యూక్, మసాలా, రియల్ ఎస్టేట్, నగలు, పర్‌ఫ్యూమ్, ఇలా చాలా యాడ్స్ చేశాడు, ఇప్పుడు కొన్ని చేస్తున్నాడు మహేష్.
అయితే ఆయా యాడ్స్ కి డబ్బింగ్ చెప్పేది ఆయన కాదట. కేవలం కొన్నింటికి మాత్రం మహేష్‌బాబు డబ్బింగ్ చెబుతాడట. కానీ చాలా వరకు ఇతరులతోనే డబ్బింగ్ చెప్పిస్తారట. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. మహేష్ యాడ్స్ కి చాలా వరకు జబర్దస్త్ కమెడియన్ డబ్బింగ్ చెబుతాడట. ఆ విషయం లేటెస్ట్ గా బయటకు వచ్చింది.
extra jabardasth promo
అతను ఎవరో కాదు బుల్లెట్ భాస్కర్. `జబర్దస్త్` షోలో స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు. విలక్షణమైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. డిఫరెంట్ గెటప్స్ లోనూ మెరుస్తుంటాడు. ఒకప్పుడు ఫైమాతో కలిసి కామెడీ చేశాడు. ఇప్పుడు కొత్త, పాత ఆర్టిస్ట్ లతో కలిసి కామెడీ చేస్తున్నాడు. నవ్వులు పూయిస్తున్నాడు.
ఇప్పటి వరకు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్‌లోని కామెడీనే చూశాం, కానీ ఆయనలో మరో యాంగిల్ ఉంది. దాన్ని బయటకు తీశాడు. పెద్ద షాకిచ్చాడు. అతను డబ్బింగ్ కూడా చెబుతాడట. మిమిక్రీ బాగా చేస్తానని తెలిపారు. `సుమన్ టీవీ`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు. చాలా వరకు మహేష్ బాబు యాడ్స్ కి తాను డబ్బింగ్ చెప్పినట్టు తెలిపాడు.
అంతేకాదు.. `వన్‌ః నేనొక్కడినే` మూవీలోనూ ఓ ట్రాక్‌కి ఆయనే డబ్బింగ్ చెప్పాడట. అది చూసి మహేష్ బాబు ఆశ్చర్యపోయాడట. అచ్చం మహేష్ బాబు వాయిస్‌ని దించినట్టు తెలిపారు. మహేష్ బాబు తన వాయిస్ విని టీమ్‌తో తన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వెల్లడించాడని చెప్పాడు. అంతేకాదు ఇంటర్వ్యూలోనూ తాను డబ్బింగ్ చెప్పిన యాడ్స్ లో మహేష్ వాయిస్‌లో మాట్లాడి మెప్పించాడు.
సినిమాల్లోని డైలాగ్‌లు కూడా చెప్పి అలరించాడు. అయితే మహేష్ బాబుని ఇప్పటి వరకు తాను కలిసే అవకాశం రాలేదని, ఓ సారి కేవలం ఫోటో మాత్రం తీసుకున్నట్టు తెలిపారు.