పాల రోజా ఫ్రాక్ లో పరువాల జాతర... కిక్ ఇచ్చే జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య గ్లామర్!
జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు బుల్లితెరపై తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు.
Sowmya Rao
తాజాగా రోజ్ పింక్ కలర్ ఫ్రాక్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది అమ్మడు. సౌమ్యరావు(Sowmya Rao) నాజూకు పరువాలు మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక ఆమె ఫ్యాన్స్ మీరు అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Sowmya Rao
గత ఏడాది స్టార్ యాంకర్ అనసూయ(Anasuya) జబర్దస్త్ నుండి తప్పుకోగా సౌమ్య రావుకు ఛాన్స్ దక్కింది. ఈ కన్నడ భామ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్ షోలో రష్మీతో పోటీపడుతుంది. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేస్తుంది. తాజాగా నీలి రంగు చీరలో మనసులు దోచుకుంది.
Sowmya Rao
జబర్దస్త్ (Jabardasth)షో ఎందరో జీవితాలు మార్చేసింది. ఈ క్రమంలో యాంకర్ పొజిషన్ కోసం చాలా మంది పోటీపడ్డారు. అనూహ్యంగా సౌమ్యరావు దక్కించుకుంది. శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ వంటి తెలుగు భామలు రంగంలోకి దిగుతారని అనుకుంటే అనూహ్యంగా సౌమ్యరావుని అదృష్టం వరించింది.
Sowmya Rao
సౌమ్యరావు అదృష్టానికి చాలా మంది యాంకర్స్ కుళ్ళుకుంటున్నారు. కారణం ఈ షో రష్మీ (Rashmi Gautam), అనసూయల ఫేట్ మార్చేసింది. సామాన్యులను స్టార్స్ చేసింది. సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ యాంకర్ గా కూడా చేశారు.
Sowmya Rao
అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి.
Sowmya Rao
ఇక సౌమ్యరావుకు ఎపిసోడ్ కి లక్ష నుండి లక్షన్నర పారితోషికం ఇస్తున్నారట. అనసూయ, రష్మీలకు ఇచ్చిన దానికంటే ఇది తక్కువే అంటున్నారు. సౌమ్యరావు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయితే అడిగినంతా ఇస్తారు. ఏది ఏమైనా జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయింది.