- Home
- Entertainment
- ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతున్న `జబర్దస్త్` రష్మి.. సుడిగాలి సుధీర్ పరిస్థితేంటి?.. ఫ్యాన్స్ లో ఆందోళన ?
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతున్న `జబర్దస్త్` రష్మి.. సుడిగాలి సుధీర్ పరిస్థితేంటి?.. ఫ్యాన్స్ లో ఆందోళన ?
`జబర్దస్త్` యాంకర్ రష్మి గౌతమ్.. కోట్లాది మంది అభిమానులకు షాకిచ్చింది. తొమ్మిదేళ్లుగా అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పింది. సుడిగాలి సుధీర్ లేని టైమ్‌లో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

తెలుగు హాట్ యాంకర్లలో ఒకరు రష్మి గౌతమ్(Rashmi Gautam). యాంకర్లలోనూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుందీ భామ. తొమ్మిదేళ్లుగా `జబర్దస్త్`(Jabardasth)కి యాంకర్‌గా చేస్తూ రాణిస్తుంది. కోట్లాది మంది అభిమానులను ఏర్పర్చుకుంది. ముద్దుముద్దు మాటలు, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, హాట్ అందాలతో కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు అందరిని అలరిస్తుంది రష్మి. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిస్తుంది.
`జబర్దస్త్` లో కమేడియన్ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer)తో కలిసి ఆమె చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తారాస్థాయికి చేరుతుంది. రష్మినే టార్గెట్‌గా సుధీర్ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు పేలుస్తూ అలరించారు. అంతేకాదు ఇద్దరు చాలా సందర్భాల్లో కలిసి డ్యూయెట్లు పాడుకున్నారు. ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమని చాటుకున్నారు. స్టేజ్‌పై పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.
దీంతో ఇద్దరి మధ్య ఘాటైన ప్రేమ ఉందనేలా ఆడియెన్స్ ని నమ్మించారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం తాము మంచి స్నేహితులమని చెప్పుకుంటూ వస్తున్నారు. షోలో మాత్రం ఘాటెక్కించే కెమిస్ట్రీతోరెచ్చిపోతున్నారు. అభిమానులను, ఆడియెన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెడుతున్నారు. ఇదిలా ఉంటే `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోల నుంచి సుధీర్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆ రెండు షోల భారం తనపైనే వేసుకుంది రష్మి.
ఇదిలా ఉంటే రష్మి ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనేది ఆసక్తికరంగా సస్పెన్స్ గా మారింది. కొన్నిఏళ్లుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు ఆ మధ్య వినిపించాయి. అదే సమయంలో సుధీర్‌తోనూ పెళ్లి అనే గాసిప్పులు నడిచాయి. తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది రష్మి.
హాట్ యాంకర్ రష్మి తన అభిమానులకు బాంబ్ లాంటి వార్తని చెప్పింది. తన పెళ్లి కుదిరిందని వెల్లడించింది. తొమ్మిదేళ్లుగా అడుగుతున్న ప్రశ్నకి సమాధానం దొరికిందని, పెళ్లి కుదిరిందని చెప్పడం విశేషం. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.
రష్మి.. `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`(Sridevi Drama Company)కి యాంకర్‌గా చేస్తుంది. సుధీర్ వెళ్లిపోయాక రష్మినే యాంకరింగ్ బాధ్యతలు తీసుకుంది. తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. `అక్కా బావెక్కడా` అనే స్పెషల్ స్కిట్‌ని ప్రదర్శించారు. ఇందులో రష్మి తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వడం విశేషం. అంతేకాదు ఫ్రెండ్స్ కి బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చింది.
ఇందులో యాంకర్ రష్మి చెబుతూ, `తొమ్మిదేళ్లుగా మీరు అడుగున్న ప్రశ్నకి ఈ రోజు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. పెళ్లి (Rashmi Marriage)కుదిరింది` అంటూ సిగ్గులొలికించింది రష్మి. రింగు రింగులు తిరుగుతూ, సిగ్గులతో ముగ్గేస్తూ తెగ మురిసిపోతుంది రష్మి. ఈ సందర్భంగా ఆమె ఫ్రెండ్స్ `అక్కా బావెక్కడ` అని ప్రశ్నించడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతుంది.
`శ్రీదేవి డ్రామా కంపెనీ` షో ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారం కానుంది. దీంతో ఈ ఆదివారంతో తన పెళ్లిపై, ప్రియుడిపై ఇలా అనేక విషయాలపై రష్మి క్లారిటీ ఇవ్వబోతుందని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు, నెటిజన్లు. మరి నిజంగానే చెబుతుందా? లేక ఎప్పటిలాగే స్కిట్‌లో భాగంగా అంతా తూచ్ అనిపిస్తుందా? అనేది చూడాలి.
ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ ఈ షోని వదిలేసి చాలా రోజులవుతుంది. దీంతో సుధీర్ లేని టైమ్‌లో రష్మి ఇలా తన పెళ్లి మ్యాటర్ బయటపెట్టబోతుండటం కూడా ఆసక్తికరంగా మారింది. సుధీర్ అభిమానులు దీన్ని ఎలా తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది. అదే సమయంలో కొంపదీసి రష్మి.. సుధీర్ అభిమానులకు బాంబ్ లాంటి వార్త చెప్పబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఆదివారం అన్నింటికి క్లారిటీ రానుందని చెప్పొచ్చు.