MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వచ్చే నెలలోనే రష్మీ గౌతమ్ పెళ్లి.. స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్.!

వచ్చే నెలలోనే రష్మీ గౌతమ్ పెళ్లి.. స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్.!

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) పెళ్లికి  ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెలలోనే తన పెళ్లి అంటూ స్వయంగా రష్మీనే తెలియజేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 03 2022, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొన్నాళ్లు బుల్లితెర ఆడియెన్స్, అభిమానుల మదిలో మెదులుతున్న మాట అందాల యంకర్ రష్మీ గౌతమ్ పెళ్లి. ఇప్పటికే ఈ బ్యూటీకి, కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్ కు మధ్య ప్రేమాయణం కొనసాగుతోందన్న మాట ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు స్వయంగా తానే చెప్పింది. దసరా పండుగకు ముందే తను పెళ్లి జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం రష్మీ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. 

36

అయితే ఇది తన నిజమైన పెళ్లి కాదండోయ్.. ఓ ఈవెంట్ లో భాగంగా పెళ్లి చేసుకోబోతుందని చెప్పింది. ఇంతకీ ఏమైందంటే.. Extra Jabardasth లేటెస్ట్ ఎపిసోడ్ నిన్న విడుదలైంది. ఈ షోలో ఆటో రామ్ ప్రసాద్ మరియు  గెటప్ శ్రీను స్కిట్ లో భాగంగా రష్మీ ఈ కామెంట్స్ చేసింది. ‘వయస్సు అయిపోతోంది త్వరగా పెళ్లిచేసుకో..’ అని అన్న ఓ ఆర్టిస్ట్ కు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.
 

46

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ ‘అన్నట్టు చెప్పడం మర్చిపోయా.. వచ్చే నెలలోనే నా పెళ్లి. దసరా పండుగ వస్తోంది కదా.. మన ఈవెంట్ లోనే జరుగుతుంది. మన పెళ్లిళ్లు ఈవెంట్లలోనే జరుగుతయ్.. బయట జరగవు కదా.!’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు పెళ్లిపై రష్మీ ఇలా భిన్నంగా స్పందించడం పట్ల నెటిజన్లు, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. 

56

బుల్లితెర హాట్‌ యాంకర్లలో రష్మీ గౌతమ్‌ (Rashmi Gautam) ఒకరు. విభిన్నంగా యాంకరింగ్ చేస్తూ టెలివిజన్ ఆడియెన్స్ ను తనదైన శైలిలో అలరిస్తోంది. పదేండ్లుగా యాంకర్ రష్మీ తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది. మరోవైపు యూత్ లోనూ యమా క్రేజ్ పెంచుకుంది. 

66

తొమ్మిదేళ్లుగా ప్రముఖ కామెడీ షో `జబర్దస్త్` (Jabardasth)కు  యాంకర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ‘ఎక్ట్స్రా జబర్దస్త్’కు యాంకర్ గా చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇటు యాంకరింగ్ చేస్తూనే రష్మీ గౌతమ్ ఇటు బుల్లితెరపై అందాలను ఆరబోస్తోంది.  అదిరిపోయే అవుట్స్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. అటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved