- Home
- Entertainment
- పెళ్లి చూపుల్లో రష్మీ గౌతమ్ కి అవమానం... ఆ సుధీర్ కి తప్పితే ఎవరికీ నచ్చవంటూ ఎద్దేవా!
పెళ్లి చూపుల్లో రష్మీ గౌతమ్ కి అవమానం... ఆ సుధీర్ కి తప్పితే ఎవరికీ నచ్చవంటూ ఎద్దేవా!
స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కి అవమానం జరిగింది. పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు ఆలోచించి చెబుతా అన్నాడు. దాంతో ఆమె షాక్ అయ్యింది.

Rashmi Gautam
రష్మీ గౌతమ్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఈమె సుడిగాలి సుధీర్ ని ప్రేమిస్తున్నారనే వాదన ఉంది. బుల్లితెర మీద ఈ జంట నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. ఏళ్ల తరబడి ప్రేమికులుగా స్కిట్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరు ప్రేమికులే అనే అనుమానాలు ఉన్నాయి.
నేరుగా అడిగితే లేదంటారు. మేమిద్దరం స్నేహితులం మాత్రమే. అంతకు మించి మా మధ్య ఏం లేదంటారు. రష్మీ ఒక్కోసారి అనుమానాస్పదంగా మాట్లాడుతుంది. సుధీర్ తో నా రిలేషన్ ఏమిటో ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు చెప్పేస్తే జీవితంలో దాపరికం అంటూ ఏమీ ఉండదని ఆమె అన్నారు.
అలాగే రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకోవడం లేదు. ఇద్దరికీ 35 ఏళ్ళు దాటాయి. పెళ్ళికి ఇంకా సమయం ఉందంటున్నారు. ఈ క్రమంలో ఏదో ఒకరోజు సడన్ గా బాంబు పేల్చుతారేమో అనే సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే పెళ్లి చూపుల్లో రష్మీకి అవమానం జరిగింది. తనని చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి... ఆలోచించి చెబుతా అన్నాడు. దాంతో రష్మీ షాక్ అయ్యింది.
Rashmi Gautam
అయితే ఇదంతా స్కిట్ లో భాగమే. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారు. ఫ్రెండ్షిప్ డే నేపథ్యంలో మరింత ఎంటర్టైనింగ్ గా సిద్ధం చేశారు. యాంకర్ రష్మీ పెళ్లి చూపులపై చిన్న స్కిట్ చేశారు. రష్మీని చూడటానికి వచ్చిన అబ్బాయి షాకింగ్ కామెంట్ చేశాడు.
Rashmi Gautam
ఏంటి నేను నచ్చలేదా? అని రష్మీ అనగానే... ఆలోచించి చెబుతా మేడం అన్నాడు. ఇంత అందగత్తెను నేను నచ్చలేదా అని రష్మీ నొచ్చుకుంది. అదే షోలో ఉన్న వర్ష వెంటనే అందుకుని సెటైర్ వేసింది. సుడిగాలి సుధీర్ తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు... బావా నువ్వే ఆలోచించలేదు. రష్మీ విషయంలో అందరూ ఆలోచిస్తున్నారని కామెంట్ చేసింది.
Rashmi Gautam
నువ్వు మాత్రమే వెనుకా ముందు ఆలోచించకుండా రష్మీని ఇష్టపడ్డావు. కానీ ఇతరులకు ఆమె అంతగా నచ్చడం లేదనే అర్థంలో వర్ష సెటైర్ వేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఆసక్తికర అంశాలతో ఎంటర్టైనింగ్ గా సాగింది.
ఇక మల్లెమాల సంస్థలో సందడి మొత్తం రష్మీదే. ఈటీవీలో ఆమె హవా నడుస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ భర్తీ చేస్తుంది.
కాగా కొత్త యాంకర్ రావడంతో జబర్దస్త్ షో చేజారింది. అనసూయ స్థానంలో సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి.
ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. భోళా శంకర్ మూవీలో రష్మీ గౌతమ్ ఓ పాత్ర చేసినట్లు సమాచారం.