దిల్ రాజుపై ముగిసిన ఐటీ రైడ్స్, 6 బాక్సుల నిండా అవే.. మొదలైన అనుమానాలు ?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు ముగిశాయి. నాలుగు రోజుల పాటు అధికారులు దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షిత రెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు ముగిశాయి. నాలుగు రోజుల పాటు అధికారులు దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షిత రెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దిల్ రాజు బ్రదర్ శిరీష్ ఇంట్లో కూడా రైడ్స్ జరిగాయి. దిల్ రాజు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం 18 ప్రదేశాల్లో అధికారులు 55 బృందాలుగా విడిపోయి రైడ్స్ చేశారు.
Dil Raju
దిల్ రాజు గత రెండేళ్లలో నిర్మించిన చిత్రాల వయ్వహారాలని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆయన సతీమణి తేజస్వినిని బ్యాక్ కి తీసుకెళ్ళి లాకర్ కూడా పరిశీలించారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ లో కూడా రైడ్స్ జరిగాయి. ఐటీ అధికారులు కొన్ని కీలక అంశాలని గుర్తించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు చూపించిన ఆదాయ వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు తేల్చారట.
దానితో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 బాక్సులలో డాక్యుమెంట్స్ ని సీజ్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దిల్ రాజుని తమ వాహనాల్లో అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ కి తీసుకెళ్లారు. దీనితో ఆయన అరెస్ట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
కానీ ఆదాయ వివరాల్లో తేడాలు ఉన్నందున అధికారులు ప్రస్తుతానికి వివరణ ఇవ్వాలని కోరుతున్నారట. సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల బిజినెస్ లెక్కలేని కూడా అధికారులు చెక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు సీజ్ చేసిన డాక్యుమెంట్స్ కి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసే పనిలో ఉన్నారట.
రెండేళ్ల కాలంలో దిల్ రాజు తనకి వచ్చిన ఆదాయానికి, చెల్లించిన ట్యాక్స్ కి భారీ వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ చెల్లించిన ట్యాక్సులలో కూడా వ్యత్యాసాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఐటీ అధికారులు తదుపరి ఏం చేస్తారో అనే ఉత్కంఠ టాలీవుడ్ లో నెలకొంది.