MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌ 10 ఇండియన్‌ సినిమాలు, మన తెలుగు మూవీస్‌ ఎన్ని అంటే?

ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్‌ 10 ఇండియన్‌ సినిమాలు, మన తెలుగు మూవీస్‌ ఎన్ని అంటే?

ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు, పాన్‌ ఇండియా సినిమాలకు ఫస్ట్ డే కలెక్షన్లు చాలా కీలకంగా మారాయి. మరి ఇప్పటి వరకు ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ టాప్‌ 10 సినిమాలేంటో చూద్దాం.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 11 2025, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. పాన్‌ ఇండియా హీరోలు సైతం ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాలని చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇండియాలోనే ఫస్ట్ డే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 సినిమాలేంటి? ఏ హీరో ఎక్కువగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ రాబట్టారు? టాప్‌ 10లో మన తెలుగు సినిమాలున్నాయనేది చూస్తే. 
 

211

ఫస్ట్ డే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో `పుష్ప 2` మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది డిసెంబర్‌ 5న విడుదలైన ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలిసిందే. అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ డే రూ.294కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది సుమారు రూ. 1900కోట్లు రాబట్టింది.
 

311
rrr

rrr

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీకి ఏకంగా ఆస్కార్‌ కూడా వరించింది. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ 2022లో విడుదలైంది. ఫస్ట్ డే ఇది రూ.223కోట్లు చేసినట్టు టీమ్‌ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా లాంగ్‌ రన్‌లో ఇది రూ. 1200కోట్లు రాబట్టిందని సమాచారం. 
 

411
Bahubali 2

Bahubali 2

ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచిన మూవీ, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో `బాహుబలి 2` ఉంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ నటించిన ఈ మూవీ ఫస్ట్ డే రూ.210కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1800కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో ఇది మూడో స్థానంలో నిలిచింది. 
 

511

ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో మందున్నారు. ఆయన గతేడాది `కల్కి 2898ఏడీ`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ మూవీ ఫస్ట్ డే 191.5కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇది రూ.1250కోట్లు చేసిందని సమాచారం. ఇందులో అమితాబ్‌, కమల్‌ హాసన్‌, దీపికా, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. 
 

611

రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందిన `గేమ్‌ చేంజర్‌` ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శంకర్‌ రూపొందించిన ఈ చిత్రం మొదటి రోజు రూ.186కోట్లు రాబట్టిందని టీమ్‌ ప్రకటించారు. అయితే ఈ ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ట్రోల్‌ నడుస్తుంది. ఫేక్‌ అంటూ ప్రచారం జరుగుతుంది. టీమ్‌ లెక్కల ప్రకారం ఇది ఐదో స్థానంలో నిలిచింది. 
 

711

`బాహుబలి 2`, `కల్కి` చిత్రాలే కాదు `సలార్‌`తోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టారు ప్రభాస్‌. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన `సలార్‌` మూవీ 2023లో డిసెంబర్‌లో వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే రూ.178కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారు రూ.750కోట్లు రాబట్టింది. 
 

811

`ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఎన్టీఆర్ మార్కెట్‌ కూడా పెరిగింది. గతేడాది ఆయన `దేవర` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన `దేవర` మూవీ ఫస్ట్ డే రూ.172కోట్లు రాబట్టిందట. సైఫ్‌ అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌ నటించిన ఈ చిత్రం టోటల్‌గా రూ.500కోట్లు రాబట్టింది. దీనికి పార్ట్ 2 కూడా రాబోతుంది.

911

హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 7 తెలుగు సినిమాలే ఉన్నాయి. ఆ తర్వాత ఎనిమిదో స్థానంలో కన్నడ మూవీ `కేజీఎఫ్‌ 2` ఉంది. యష్‌ హీరోగా నటించిన ఈ మూవీ ఫస్ట్ డే రూ.160కోట్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది టోటల్‌ రన్‌లో రూ.1200కోట్ల వసూలు చేసిందట. దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 
 

1011
Leo Movie

Leo Movie

తొమ్మిదో స్థానంలో తమిళ సినిమా ఉంది. విజయ్‌ హీరోగా తెరకెక్కిన `లియో` మూవీ ఫస్ట్ డే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది రూ.148కోట్లు వసూలు చేసింది. లాంగ్‌ రన్‌లో సుమారు ఆరు వందల కోట్లు రాబట్టిందని సమాచారం. దీనికి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

1111

ఇక పదో స్థానంలో కూడా తెలుగు సినిమానే ఉంది. అది కూడా ప్రభాస్‌ మూవీ `ఆదిపురుష్‌` కావడం విశేషం. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్ డే 140కోట్లు వసూలు చేసింది. డిజస్టార్‌ అయ్యింది. ఇలా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ టాప్‌ 10సినిమాల్లో తెలుగువే ఎనిమిది ఉన్నాయి. అందులో ప్రభాస్‌ మూవీస్‌ నాలుగు ఉండటం విశేషం. దీంతో డార్లింగ్‌ నిజమైన పాన్‌ ఇండియా హీరోగా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read more: రామ్‌ చరణ్‌కి అన్యాయం చేసిన శంకర్‌, `గేమ్‌ ఛేంజర్‌` విషయంలో ఆయన చేసిన మిస్టేక్‌ ఇదే?

 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved