- Home
- Entertainment
- Allu Aravind : నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు రాంచరణ్, దయచేసి ఇక ఆపేయండి.. అల్లు అరవింద్ ఎమోషనల్
Allu Aravind : నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు రాంచరణ్, దయచేసి ఇక ఆపేయండి.. అల్లు అరవింద్ ఎమోషనల్
Allu Aravind : తండేల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులని హర్ట్ చేశాయి. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్.. దిల్ రాజు గురించి మాట్లాడే క్రమంలో గేమ్ ఛేంజర్ చిత్రం విషయంలో నోరు జారారు.

Allu Aravind, Ram Charan
తండేల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులని హర్ట్ చేశాయి. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్.. దిల్ రాజు గురించి మాట్లాడే క్రమంలో గేమ్ ఛేంజర్ చిత్రం విషయంలో నోరు జారారు. దిల్ రాజు ఈ సంక్రాంతికి ఒక చిత్రాన్ని ఇక్కడికో తీసుకెళ్లి మరో చిత్రాన్ని ఇలా తీసుకెళ్లారు అంటూ నేలని చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ చిత్రాల రిజల్ట్ ని పోల్చారు.
Allu Aravind
ఇది మెగా అభిమానులకు ఆగ్రహం కలిగించింది. దీనితో అల్లు అరవింద్ కి పలుమార్లు ఈ వివాదంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఆయన స్పందించలేదు. తండేల్ చిత్రం రిలీజ్ అయ్యాక తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ వివాదం గురించి అల్లు అరవింద్ ఎమోషనల్ గా స్పందించారు.
Allu Aravind
ఆ రోజు వేదికపై దిల్ రాజు కష్టాలు నష్టాలు అన్నీ ఒకేసారి అనుభవించారు అని చెప్పే క్రమంలో పొరపాటున గేమ్ ఛేంజర్ చిత్రం గురించి అలా చెప్పడం జరిగింది. ఆ కామెంట్స్ నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. యదాలాపంగా జరిగిపోయింది. దీనితో మెగా అభిమానులు ఫీల్ అయిన విషయం నా దృష్టికి వచ్చింది. మెగా అభిమానులకు ఎమోషనల్ గా చెబుతున్నా.. రాంచరణ్ నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు, నేను చరణ్ కి ఒకే ఒక్క మేనమామని.
ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేయండి అని అల్లు అరవింద్ అన్నారు. రాంచరణ్ కి నాకు అద్భుతమైన బంధం ఉంది. కాబట్టి ఈ వివాదాన్ని ఇక పట్టించుకోవద్దు అని కోరారు. అల్లు అరవింద్ చేసిన వ్యాఖలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.