MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Prabhas: ప్రభాస్ జుట్టు రహస్యం లీక్... సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో 

Prabhas: ప్రభాస్ జుట్టు రహస్యం లీక్... సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో 

ప్రభాస్ హెయిర్ పై కొన్నాళ్లుగా పరిశ్రమలో అనుమానాలు ఉన్నాయి. ఆయన విగ్గు వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుమానాలు బలపరుస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

2 Min read
Sambi Reddy
Published : Dec 23 2022, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Prabhas

Prabhas

పేద గొప్ప, చిన్న పెద్ద, సామాన్యుడు సెలెబ్రిటీ అనే తేడా లేకుండా వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. మనిషిని అందంగా చూపించే అతి ముఖ్యమైన అంశాల్లో జుట్టు ఒకటి. చక్కని హెయిర్ స్టైల్ ఉన్నోళ్లకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. 
 

26
Prabhas

Prabhas

ఒత్తైన జుట్టు అద్దంలో చూసుకుంటుంటే వచ్చే మజా వేరు. పబ్లిక్ లో వేళ్ళతో సరి చేసుకుంటూ ఫోజు కొట్టడాన్ని కిక్ గా ఫీల్ అవుతారు యూత్. ఇక జుట్టు రాలిపోతుంటే ఎక్కడలేని దిగులు మొదలవుతుంది. అమ్మో బట్టతల వచ్చేస్తుందేమో అని కంగారు పడిపోతారు. హెయిర్ ఫాల్ ఆపాలని... ఎవడేం చెప్పినా నమ్మేస్తారు, ఆకులు అలములు, ఆయిల్స్, షాంపూస్ వాడేస్తాం. ఒక సామాన్యుడే ఇంతలా జుట్టు గురించి ఆలోచిస్తే సెలెబ్రిటీలకు జుట్టు అంటే ఎంత ప్రేమ, ఊడిపోతే ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. అందమే పెట్టుబడైన హీరోలకు జుట్టు చాలా అవసరం.

36
Asianet Image


సిల్వర్ స్క్రీన్ పై హ్యాండ్ సమ్ గా కనిపించాలంటే ఒత్తైన జుట్టు ఉండాలి. విగ్గు వాడితే యాంటీ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తారు. అయితే సినిమా హీరోలకు జుట్టు కాపాడుకోవడం పెద్ద సమస్య. వేళాపాళా లేని షూటింగ్స్, వివిధ వాతావరణ పరిస్థితులతో కూడిన లొకేషన్, అసమయ భోజనం, నిద్ర లేకపోవడం వంటి కారణాలతో 40 ఏళ్ళు వచ్చే సరికి జుట్టు పలుచబడి పోవచ్చు. 

46
Prabhas

Prabhas

ఇండియాలో చాలా మంది స్టార్ హీరోలు విగ్గులతో తమ బట్టల రహస్యం దాచేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత అత్యంత సహజంగా కృత్రిమమైన జుట్టు తలలపై అమరుస్తున్నారు. కాగా హీరో ప్రభాస్(Prabhas) జుట్టుపై కొన్నాళ్లుగా అనుమానాలు ఉన్నాయి. ఆయన విగ్గు వాడుతున్నారేమో అనే సందేహం చాలా మందిలో ఉంది. 
 

56
Prabhas

Prabhas


సాహో చిత్రం నుండి ప్రభాస్ హెయిర్ స్టైల్ అసహజంగా ఉంటుంది. పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఆయన నిట్ క్యాప్ తో హెయిర్ కవర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ జుట్టు రహస్యం తెలుసుకోవాలనే ఆత్రుత చాలా మందిలో ఉంది. కాగా ప్రభాస్ విగ్గు వాడుతున్నట్లు అనుమానాలు రేకెత్తించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ప్రభాస్ జుట్టు సరి చేస్తుండగా... ఇవన్నీ ముందే చేయి, నెక్స్ట్ టైం నుండి బయట చేయవద్దని సూచించాడు. 
 

66
Prabhas

Prabhas


హెయిర్ స్టైలిస్ట్ జుట్టు సరి చేస్తున్న విధానం చూస్తే... విగ్గు సరి చేస్తున్నట్లుగానే ఉంది. నిజం ఏదైనా ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ జుట్టు విగ్గే, ఇదిగో ప్రూఫ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వీడియో వైరల్ గా మారింది. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
ప్రభాస్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved