- Home
- Entertainment
- కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్.! ఒకరిపై మరొకరికి స్ట్రాంగ్ ఫీలింగ్.. బీటౌన్ లో మారుమోగుతోంది!?
కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్.! ఒకరిపై మరొకరికి స్ట్రాంగ్ ఫీలింగ్.. బీటౌన్ లో మారుమోగుతోంది!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) కలిసి ‘ఆదిపురుష్’లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీతో వీరిద్దరూ బాగా కలిసిపోయారంట. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

పెద్దనాన్న కృష్ణం రాజు (Krishnam Raju) మరణంతో యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడిప్పుడే శోక సంద్రం నుంచి బయటపడుతున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన డార్లింగ్ ను అభిమానులు అలా చూడలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
కొన్నేండ్లుగా ప్రభాస్ అభిమానులు, తెలుగు ఆడియెన్స్ ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తర్వలో గుడ్ న్యూస్ చెప్పేందుకు డార్లింగ్ ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు.. యంగ్ హీరోయిన్ కృతి సనన్ అంట. వీరిదద్దరూ మధ్య రిలేషన్ బలంగా ఏర్పడిందంటూ బీటౌన్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరు కలిసి పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ (Adhipurush)లో కలిసి నటించిన విషయం తెలిసిందే. కృతి సనన్ - ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమాతోనే కలిశారు. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యే సరికి వీరి మధ్య బంధం బలపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీ టౌన్ లోనూ చర్చించుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ - కృతి సనన్ ‘ఆదిపురుష్’ సెట్స్ లో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారంట. అప్పటి ఎక్కువ సిగ్గుపడే ప్రభాస్ కృతితో బహిరంగంగానే చనువుగా ఉండేవారంట. అలాగే ఎక్కువ సమయం కృతితో చాట్ చేయడానికి కేటాయించారంట. ఇప్పటికే ఈ చిత్రం ముగిసి దాదాపు ఏడాదికి దగ్గరొస్తోంది. అయినా వీరిద్దరి రిలేషన్ కొనసాగుతూనే ఉందంట.
మరోవైపు ఒకరికొకరు పరస్పర అభిమానాన్ని కలిగి ఉండటంతో పాటు స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా ఏర్పడిందంటూ నెట్టింట గట్టిగానే ప్రచారం జరుగుతోంది. గతంలో కృతి సనన్ కూడా ప్రభాస్ తన అభిప్రాయాన్ని చెప్పింది. ‘డార్లింగ్ కండ్లు బాగుంటాయని, మొదట సిగ్గుపడేవాడని, చాట్ చేయడం ప్రారంభించిన తర్వాత కాస్తా మెరుగయ్యాడంది. ఆహార ప్రియుడు, సహనటులకూ స్పెషల్ గా ఫుడ్ అరెంజ్ చేయడం అంటే ఇష్టమని’ చెప్పింది.
ఇక ఇటీవలనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి - ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు కృష్ణం రాజు ఆస్పత్రిలో ఉన్నప్పుడు స్విటీ వెళ్లడం, నివాళి అర్పించడంతో, ప్రభాస్ ను ఓదార్చడంతో వీరి మ్యారేజ్ ఫిక్స్ అంటూ కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం కృతి సనన్ తో డేటింగ్ చేస్తున్నారని మరింత గట్టిగా చెబుతున్నారు. ఏదేమైనా ప్రభాస్, కృతి సనన్ దీనిపై స్పందిస్తేనే అసలు విషయం బయటపడుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయిన ‘ఆదిపురుష్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకాచకా జరుపుకుంటోంది. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. సైఫ్ అలీఖాన్ లంకేష్ పాత్రను పోషించారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీ, తెలుగులో రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. మిగితా భాషల్లోనూ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. దసరా కానుకగా మూవీ నుంచి టీజర్ రానుంది. రేపు ఫస్ట్ లుక్ రాబోతోంది.